నల్లజర్ల రోడ్డు (1/3) - తిలక్ గారి కథ episode artwork

EPISODE · Jan 1, 2022 · 23 MIN

నల్లజర్ల రోడ్డు (1/3) - తిలక్ గారి కథ

from Harshaneeyam

నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya‘“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. అవధానిగారు యిలాగ అనేటప్పటికి మేమందరం పక్కున నవ్వాం. .కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిసాయి.“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయ పెడతాయో మీకు తెలియదు” అన్నారు మళ్ళీ.“చెప్పండి. మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాను నేను.“ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయి వుంటుంది.” అన్నాడు నారాయణ.. –“తోట అంతా చీక టైపోయింది” అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. “ఇంకా – కొవ్వొత్తులున్నాయాండీ!” అని అడిగాడు. అవధానిగారు తల వూపారు – ఉన్నాయన్నట్టు“ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ – ఓహ్! మరిచిపోలేం” అన్నాడు నారాయణ.“వూరికి యింతదూరంగా యీ తోట వుండడమే అంత ‘ బాగా లేదు” అన్నాడాచారి.“చెప్పండి కథ” అన్నాను నేను. “కథా!” నిరసనగా చూశారు – అవధానిగారు.“అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన….” అని సర్దుకున్నాను. అవధానిగారు కవీకాదు; కథకుడూ కాదు.. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు. . ఆయన చెప్పడం మొదలు పెట్టారు.“ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం, పది గంటలు దాటింది రాత్రి. నాగ భూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం. ప్లీడరుగారు – కారు దగ్గరకి వచ్చి”నా మాట విన్నారు కాదు” అన్నారు. “అబ్బే ఎంత సేపండీ, సరీగ్గా తొక్కితే ఒక్క గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి” అన్నాడు రామచంద్రం.– “అమ్మమ్మ! ఎంత మాట! కలక్టరుగారింట్లో శుభ • కార్యమంటే వేరే చెప్పాలా! ” అన్నారు ప్లీడరుగారు … యావద్విషయాన్నీ గ్రహించిన వారై.కారు సాగింది.“అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి – మీ రెవరూ పుట్టివుండరు” అన్నారు – అవధానిగారు మా అందరికేసి చూసి.“అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి” అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడయింది. ఆచారి ఉలిక్కిపడి “దొంగలేమో” అన్నాడు.“పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే” అన్నారు అవధానిగారు.కథలోకి రండి” అన్నాను నేను. . “అంటే….. ” కోపంగా చూశారు అవధానిగారు. “అదేనండీ, మీ చిన్నప్పటి….”అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి యిలా చెప్పసాగారు.-ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామ చంద్రం దిగి బానెట్ చూశాడు.  ” ఇది వెధవ కారులా వుంది. నడచి వెనక్కి పోదాం పద. ఎందుకేనా మంచిది” అన్నాడు నాగభూషణం మామయ్య.“అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని యీ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలో వుండదు” అన్నాడు రామచంద్రం.“అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది” మామయ్య విసుగ్గా అన్నాడు. “డొక్కు కార్లు కొనకురా , అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకే మొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్నికూడా మనతో తీసుకువచ్చాం.  కర్మ!  వీడు ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది” అన్నాడు నన్ను ద్దేశించి.“ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళూ ,కార్లలో , ప్రయాణం చెయ్యడం నాకు సరదా” అన్నాను నేను.రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. – పొడుగ్గా, బలంగా, హుషారుగా వుంటాడు. మా, వూరి క్లబ్బుకి , సహాయ కార్యదర్శి, సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, యేం చేసేదో యిప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలవ వొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్యా కుమారరత్నమూ , కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి యిచ్చిన ముప్పేనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక, తేలక జిజ్ఞాసువులు చాలామంది బాధపడే వారు పాపం. మా నాగభూషణం మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరది అవుతాడో – యిటువంటి భోగట్టా నాకు సరీగా తెలియదు. మా ఆవిడకి తప్ప – అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ; అందరమూ ఒకే ఊళ్ళో వుండ డమూ, రాకపోకలూ, శుభకార్యాలూ, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడమూ – ఇలాంటి వాటివలన ఈ కుటుంబాలన్నింటికీ చనువూ, గాఢ స్నేహమూ ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఉళ్ళో చెప్పుకోదగినవాడు. ఎం.ఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతీ ఏడాదీ భగవద్గీత మీదా, ఉపనిషత్తులమీదా పెద్ద వాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు యిప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరేగాని జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని యింట్లోనే మకాం. – కారు బాగుపడిందాండీ?” అన్నాడు నారాయణ మధ్యలో అడ్డువచ్చి.ఆ రామచంద్రం కారు చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు. కొంత సేపు గొణుక్కున్నాడు. కారు కిందా మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి “ఆల్ రైట్” అంటూ కారులో కూర్చు న్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డుమీద కారు వెళుతూంటే చల్లనిగాలి మొహానికి కొడుతోంది. ఇటూ అటూ’ పంటచేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడులాంటి అనిర్వచ నీయమైన శక్తి సన్నిహితంగా వున్నట్టు వుంటుంది. మామయ్య నన్ను బి.ఏ. ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాము లజ్ కార్నర్ కి దగ్గర్లో అతనికో థియాసఫిస్టు మిత్రుడున్నాట్ట. అతని దగ్గరవుండి చదువుకోమనీ, హాస్టల్సులో వుంటే పాడై పోతావనీ చెపుతున్నాడు. రామచంద్రం మధ్య – మధ్య రాజమండ్రి శంకరం టెన్నీస్ ఆటలో. వుండే లోపాన్ని గురించి చెపుతున్నాడు.“మిక్సెడ్ డబుల్స్ ఆడుతుందిట. ఆవిడెవరూ?” మామయ్య అడిగాడు.“మిస్ శర్మిష్ట” “బాగుంటుందా?” “ఆవిడా, ఆవిడ ఆటా?” “రెండూనూ” అంటూ మామయ్య నవ్వాడు. “దోబిచెర్ల వస్తున్నాం” అన్నాడు రామచంద్రం.అక్కడక్కడ రెండు మూడు పాకలూ, గుడి సెలూ, చీకట్లో ముడుచుకుపోయి పున్నాయి. ఒక బండి దగ్గర ఇద్దరు మనుష్యులు తలలకు పాగాలు చుట్టుకుని జమిలిదుప్పట్లు కప్పుకొని చుట్టలు కాల్చుకొంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపలకు వుంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ పాతికేళ్ళలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు ! తెలియదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్ళే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి ఎనిమిది దాటాక యీ రోడ్డు సంరక్షితం కాదు. నిర్జనంగా, చీకట్లో నిశ్శబ్దంగా నిద్ర పోతూండేది. ఇప్పుడు చూడండి నిముష నిముషానికి ఒక లారీ వస్తూ, వెళుతూ వుంటుంది. ప్రతీ గ్రామం నుండీ కూరలూ, – పసుపూ, మిర్చీ మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో యిప్పుడొక డేరా సినిమా కూడా వుంది. గ్రామీణు లీనాడు చుట్టలకన్న సిగరెట్లు ఎక్కువకాలుస్తున్నారు. మొన్న  కార్లో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బాడ్మింటన్ పోటీలు జరుగుతూన్నట్టు పెద్ద బోర్డు వ్రాసి ఉంది. దారి పొడుగునా కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ రెండు న్యూ మోడల్ కార్లు కూడా వున్నాయి.పాతికేళ్ళ క్రితం ఉన్న స్థితికీ యిప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా రెండు దశాబ్దాలలో యింత మార్పు ఎక్కడా చరిత్రలో జరుగదు.కాని ఒక్కుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవమూ, సైన్సు పరిణామ  ప్రయోజనమూ దాడిచేసేటప్పటికి పాతవి విచ్చిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్రవేగానికి తట్టుకోలేక మనుష్యులూ, సమాజమూ తమ చుట్టూ గోడలని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు….“మీరు కథని ఆపుచేశారు” అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధానిగారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి.“అవును. కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడెన్ గా అక్కడ ఆగిపోయింది” అన్నాడు అవధానిగారు చిన్నగా ‘ నవ్వుతూ.– “కొవ్వొత్తి అయిపోతోందండోయ్” అన్నాడు. ఆచారి. వాడి చూపు దానిమీదే వుంది. మొదటినుంచీ.అవధానిగారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగిం చారు. “ఇంక ఒక్క కొవ్వొత్తి మాత్రం వుంది – యిది కాక” అన్నారు.“చచ్చాం !’ అన్నాడాచారి. , “ఎందుకురా అంత భయం”- ప్రశ్నించాడు నారాయణ“నాకు చీకటంటే పడదు” అన్నాడాచారి దిగులుగా తోటలో పేరుకుని ముద్దకట్టిన చీకటిని చూచి.ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి “ఏమిటది అవధానులుగారు?” అని అడిగాడు.“నక్కలు” “మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయాండీ?” “తోటలో కాదు. శ్మశానంలో వుంటాయి” “శ్మశానమా?” ఆచారి గొంతు తడబడింది. వణికింది.“అవును. తోటకి అవతల కాస్త దూరంలో వుంది” – అవధానిగారు తాపీగా, జాగ్రఫీ, మేష్టారు తూర్పున బంగాళా ఖాతమూ దక్షిణమున హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెపుతూన్నంత నిర్లిప్తతతో అన్నారు.– “నోర్ముయ్యి ఆచారీ. ఇంత వయసొచ్చి కూడా, యింత మంది ఉండగా ఈ భయం ఏవిటీ? నవ్వుతారెవరైనా వింటే……” అన్నాడు నారాయణ కోపంగా.“నాకు దెయ్యాలంటే తెగ భయం…. అయితే…. హిహి హిహి” నెర్వెగా నవ్వాడు ఆచారి. ఈసారి బల్లమీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే వున్నాయి.“చెప్పండి” అన్నాను నేను అవధానిగారితో.. , రామచంద్రం విసుగ్గా కార్లోంచి దిగాడు. “మొదటినుండీ నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన వా .ఫోర్డు మారాం చేస్తోంది” అన్నాడు నాగభూషణంతో. బానెట్ తీసి పరీక్షించాడు. “సరిగ్గా కనపడ డంలేదు యీ గుడ్డి వెన్నెలలో” అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదికి చూశాను. జేగురురంగుగా ఉన్న చంద్రుడుమీద పల్చని’ మబ్బులు తారాడు తున్నాయి. రామచంద్రం’ చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. “కొంచెం అగ్గిపుల్ల గీస్తారా! కారు ఆగి పోయింది” అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే. అగ్గిపుల్ల. గీస్తోంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్ర. “థాంక్స్” అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర.“ఏ వూరెడుతున్నారు బాబూ” అన్నాడొక ఆసామీ. “తణుకు” అన్నాడు నాగభూషణం.“శానాదూరం. జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి కనపడిందని చెప్పుకుంటున్నారు.”“అలాగే, అలాగే” అని కారు స్టార్టు చేశాడు. రామచంద్రం. కారు సాగింది. నాకు ఏదో భయంగా వుంది.“అదేరా నల్లజర్ల అడవి ఉదయం వస్తూంటే నీకు చూపిం చలేదూ!” అన్నాడు మామయ్య.అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి .. రెండువై పులా అడవి పరచుకుని వుంది. వందల కొలదీ కొండ ముచ్చులు రోడ్డుకడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరుగెత్తేవి. పగటి వేళ సూర్యరశ్మిలో

Episode metadata supplied by the publisher feed · Published Jan 1, 2022

Embed this episode

NOW PLAYING

నల్లజర్ల రోడ్డు (1/3) - తిలక్ గారి కథ

0:00 23:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 23 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on January 1, 2022.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!