నమ్మకం | Nammakam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 21, 2022 · 9 MIN

నమ్మకం | Nammakam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నమ్మకం రచన : జీడిగుంట శ్రీనివాసరావు నమ్మకం అనే ఈ చక్కటి  కథను జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. చదివి వినిపిస్తున్నది మల్లవరపు సీతారాం కుమార్. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉండాలో, ఆమెతో అత్తమామలు ఎలా ఉండాలో తెలియజేసే కథ ఇది. ఇక కథలోకి వెడదాం. రజిత కాపురానికి వచ్చి వారం రోజులు అయ్యింది. భర్త శంకర్ కి సెలవు లేదని ఆఫీస్ కి వెళ్లిపోతున్నాడు. యింట్లో మామగారు, అత్తగారు, తను వుంటారు. మామగారు భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్ర పోతారు. అత్తగారికి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తి టీవీ తో సరిపోతుంది. తనతో మాట్లాడే వాళ్ళు లేకపోవడం తో, పుట్టింటి నుంచి తెచ్చుకున్న నవలలు చదువుకుంటూ టైం గడుపుతోంది రజిత. ఒకరోజు ఉదయం, మామగారు, అత్తగారు క్యాలెండరు చూస్తో, ‘ఈ రోజు మంచిది, ఈ రోజు చేయిద్దాం’ అనుకోవడం విన్న రజిత, ‘పోనిలే.. పెళ్ళిలో పెద్దగా నగలు పెట్టక పోయినా, యిప్పుడు చేయిద్దామనుకుంటున్నారు’ అని సంతోషం పడింది. టిఫిన్ తినేసిన రజిత భర్త శంకర్, ‘రాజీ.. నేను ఆఫీస్ కి వెళ్తున్నా’ అని చెప్పి, అక్కడే కుర్చీలో కూర్చొని వున్న తండ్రికి చెప్పక పోతే బాగుండదని, ‘వెళ్ళొస్తా డాడీ’ అని వెళ్ళిపోయాడు. ‘అదేమిటి, వీళ్ళు ఏదో నగలు చేయిద్దాం అని అనుకుంటూవుంటే, యియన ఆఫీస్ కి వెళ్ళాడు, బహుశా సాయంత్రం తీసుకొని వెళ్తారేమో’అని సర్దుకుంది రజిత. 11 గంటలయ్యింది, అత్తగారు రజిత గది లోకి తొంగిచూస్తూ, “రజితా! ఒకసారి యిలా రా అమ్మా” అని పిలిచింది. అత్తగారి పిలుపు విని ‘వుందిలే మంచికాలం’ అనుకుంటూ బయటకు వచ్చి, “ఏమిటి అత్తయ్యా!” అంది వినయం గా.. “ఈ రోజు మంచిది. వంటగది లోకి వెళ్లి, స్టవ్ కి కొద్దిగా పసుపు, కుంకం పెట్టి, దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టమ్మా. ఈ రోజు నుంచి వంటగది నీది, ఏమి వండాలో మీ మామయ్యగారు చెపుతారు. నువ్వు వండితే, నేను నాలుగు మెతుకులు తిని కృష్ణా రామా అనుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటా” అంది. అత్తగారి మాటలకి కొయ్యబారి పోయింది రజిత. ‘ఇందుకా మంచిరోజు చూసింది’ అని మనసులో అనుకుని, “సరే అత్తయ్యా” అంటూ వంటగది లోకి నడిచింది, కావాలనే ఎడమ కాలు ముందుగా పెడుతూ. అత్తగారు చెప్పినట్టు స్టవ్ శుభ్రపరిచి, మామగారిని అడిగింది ఈ రోజు ఏమి వండాలని. “మొదటి రోజు కదమ్మా నువ్వు వంట చేయడం! ఎక్కువ శ్రమ పడకుండా బీరకాయ పొడిపప్పు, బెండకాయ వేపుడు చేస్తే చాలు. మీ అత్తయ్య మాత్రం రసం లేందే అన్నం తినదు. ఆవిడకి టొమోటో వేసి రసం పెట్టు చాలు. సాయంత్రం నీ మొగుడికి యిష్టమైనవి చేసిపెడుదువు గాని” అన్నాడు పేపర్ లోనుంచి తలఎత్తకుండా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/brRw4KuNsUw

Episode metadata supplied by the publisher feed · Published Nov 21, 2022

Embed this episode

NOW PLAYING

నమ్మకం | Nammakam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

0:00 9:56

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 21, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!