EPISODE · Aug 20, 2023 · 9 MIN
నన్ను క్షమించవూ | Nannu kshaminchavu | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Nannu kshaminchavu' - New Telugu Story Written By Padmavathi Divakarla 'నన్ను క్షమించవూ' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పద్మావతి దివాకర్ల కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ప్రశాంత్ హాస్పిటల్లో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనికి నిద్రాభంగం కలగకుండా నెమ్మదిగా కుర్చీని అతని బెడ్ పక్కకి లాక్కొని కూర్చుంది సుమతి. ఎంత నెమ్మదిగా ఆమె అలా చేసినా ప్రశాంత్కి మెలుకువ రానేవచ్చింది. కళ్ళెత్తి ఆమె వైపు చూసి బలహీనంగా నవ్వాడు. మరుక్షణం అతని కనుకొలుకుల్లో నీళ్ళు నిలిచాయి. ప్రశాంత్ ని అలా చూసేసరికి సుమతికి మనసులో కలుక్కుమంది. ఎప్పుడూ జాలీగా, సరదాగా, హుషారుగా ఉండే ప్రశాంత్ పరిస్థితికి బాధ కలిగింది. "ధైర్యంగా ఉండు ప్రశాంత్! నీకేమీ కాదు! త్వరలోనే నయమైపోతుంది. రెండంటే రెండే రోజుల్లో నయమై హాస్పిటల్నుండి తిరిగి వస్తావు. " ప్రశాంత్ తల నిమురుతూ అనునయంగా అంది సుమతి పెదవులపై నవ్వు తెచ్చుకుంటూ. ఆమె వైపు జాలిగా చూసి జీవంలేని నవ్వు ఒకటి నవ్వాడు ప్రశాంత్. "నాకు తెలుసు సుమతీ, నాకు వచ్చిన జబ్బు ఎంత ప్రమాదకరమైనదో! నాకు బ్లడ్ క్యాన్సరని నాకు తెలుసు. నా ఆయువు కొన్ని నెలలేనని కూడా నాకు తెలుసు. నేను బతకనని, కొద్ది రోజుల్లోనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదని కూడా తెలుసు నాకు. " అన్నాడు ప్రశాంత్. అతని మాటలు విన్న సుమతి నిరుత్తరరాలైంది. ఇన్నాళ్ళూ ప్రశాంత్ కి ఏ విషయమైతే తెలియకూడదని ఆరాటపడిందో ఆ నిజమే అతనికి తెలిసిపోయింది. అసలే అధైర్యంగా ఉన్న ప్రశాంత్ పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రశాంత్ ని చూసే డాక్టర్ వెంకట్ తనకేనాడో చెప్పాడీ విషయాన్ని. ప్రశాంత్ కి బ్లడ్ క్యాన్సర్ అని తెలియగానే ఆమె నవనాడులు కృంగిపోయాయి. ప్రశాంత్ ని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఏడాదైనా కాలేదు. తన జీవితం అర్ధాంతరంగా మోడుబారిపోతుందని తెలియగానే ఆమె దుఃఖానికి అంతేలేకుండా పోయింది. ఎంతోమంది స్పెషలిస్ట్ లకి చూపించింది. ధైర్యం కోల్పోకుండా విదేశాలనుండి వచ్చిన డాక్టర్లకి కూడా చూపించింది. రేపు అమెరికానుండి డాక్టర్ ప్రాన్సిస్ వస్తాడంటే అతన్ని కలసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆమెలో ఇంకా ఆశ మిణుకుమిణుకుమంటూనే ఉంది. ప్రశాంత్ ప్రాణం కాపాడటానికి, అతన్ని మృత్యుముఖం నుండి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందామె. ఆమెలో ఆత్మస్తైర్యం తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కి తన జబ్బు విషయం తెలిసిందనగానే ఆమెలో ఏదో తెలియని భయం ప్రవేశించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/OPXnSvC0s40
Embed this episode
NOW PLAYING
నన్ను క్షమించవూ | Nannu kshaminchavu | Telugu Short Story | Padmavathi Divakarla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.