EPISODE · May 20, 2022 · 13 MIN
నవ్వుకోండి నవ్వుకోండి.. | Navvukondi navvukondi | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి! రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు సుబ్బరామయ్య కాలిలో దురద పెట్టిన పిల్లిలా హాల్లో అటూఇటూ తిరుగుతున్నాడు. అతని సెల్ కుయ్యో కుయ్యో అంది. వెంటనే ఆన్ చేశాడు. ఎవరండీ మీరు?'' అంటూ అడిగాడు. ''అన్నయ్యా నేను.. నీకు సొంత తమ్ముడిని.'' అన్నదో కంఠం.. అవతల నుండి. '' సొంత తమ్ముడా... చింతపండా..నాకెవరూ తమ్ముడులు లేరు.. నీ పేరు.?..'' అడిగాడు సుబ్బరామయ్య. '' నేనన్నయ్య నీ రక్తబంధం.. నీ తర్వాత పుట్టిన ప్రయోగాలరావుని.'' అన్నాడు అవతల వ్యక్తి. ''మా ప్రయోగాలరావా.. నువ్వు చచ్చిపోలేదా..? బ్రతికున్నావా? అసలు నువ్వు మనిషివా.. లేక.. దెయ్యానివా''?.. చిత్ర విచిత్రంగా అడిగాడు సుబ్బ రామయ్య. ''అప్పుడు నాకు ఐదేళ్ళు.. అన్నవరంలో మన కుటుంబం దగ్గరనుండి తప్పిపోయిన నేను తెలివి వచ్చి చూసేసరికి ఇతరదేశాల్లో ఉన్నాను.. చదువు సంధ్య అన్నీ అక్కడే. ఈ పాతికేళ్లలో బస్తాలు బస్తాలు డబ్బు సంపాదించాను. నీ అడ్రస్ తెలుసు కున్నాను.. ఇప్పుడు రాజమండ్రి లో ఉన్నాను.. ఒక గంటలో వచ్చేస్తున్నాను నీ దగ్గరికి.''.. అలా అనడం ప్రయోగాలరావు అన్నగారు దగ్గరకి వచ్చేయడం గంటలో జరిగిపోయాయి. ''పాతిక సంవత్సరాల తర్వాత ఇతరదేశాల నుంచి వస్తున్నాను కదా.. పైగా ముద్దుల తమ్ముడిని.. ఏమిటన్నయ్యా కాస్త స్వాగతం కూడా లేదు...'' రావడంతోనే గారాలు పడ్డాడు ప్రయోగాలరావు.. రోడ్డు అవతల నిలబడి సుబ్బరామయ్య తెల్లమొహం వేసి ఇలా అన్నాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/6BlnAfxkJV8
Embed this episode
NOW PLAYING
నవ్వుకోండి నవ్వుకోండి.. | Navvukondi navvukondi | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.