EPISODE · Aug 14, 2023 · 5 MIN
ఒక్కటే | Okkate | Telugu Short Story | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Okkate' - New Telugu Story Written By Dinavahi Sathyavathi 'ఒక్కటే!' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అనగనగా ఒక గ్రామంలో భైరవశర్మ అనే ధనికుడైన బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని భార్య వేదవతి. ఆ దంపతులకి ఆరేళ్ళ కొడుకు, పేరు రాఘవ శర్మ. భైరవశర్మ, భార్య వేదవతి మడి, ఆచారాలని అధికంగా పాటించేవారు. కొడుకుని తమ కులపు పిల్లలతో తప్ప వేరే కులం వారితో కలవనిచ్చేవారు కాదు. భైరవశర్మకి ఇంటిపనీ తోటపనీ చేయడానికి సూరీడని పాలేరు ఉండేవాడు. సూరీడుకి ఒక కూతురు, పేరు మంగళ. తల్లిలేని బిడ్డని ఒంటరిగానే పెంచుకొచ్చాడు సూరీడు. మంగళకి ఇప్పుడు ఎనిమిదేళ్ళు. పనికి వచ్చేటప్పుడు కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చేవాడు. తండ్రి పని చేస్తుంటే తానూ చిన్న చిన్న పనులు చేస్తూ, ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుండేది మంగళ. మంగళతో ఆడుకోవాలని ఉబలాటపడుతున్న కొడుకుని వద్దని వారించాడు భైరవశర్మ. “ఎందుకు నాన్నా అక్కతో ఆడుకుంటే ఏమవుతుంది?” కొడుకు ప్రశ్నకి కోపం ముంచుకొచ్చి “అది నీకు అక్కేమిటీ, వెధవ వరస కలపడం నువ్వూనూ” కసురుకున్నాడు. “నువ్వే కదా పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదన్నావు?” “మనవాళ్ళని అలా పిలవకూడదన్నాను” “వాళ్ళు మనవాళ్ళు కాదా?” “కాదు. వాళ్ళు అంటరాని వాళ్ళు. అలాంటి పిల్లతో నీకు ఆటలేమిటీ?” “అంటరాని వాళ్ళంటే?” “అంటే వాళ్ళని మనం ముట్టుకోకూడదు, వాళ్ళతో కలిసి తిరక్కూడదు” “మన వాళ్ళంటే?” “అంటే.. అంటే.. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదుగానీ పోయి ఆడుకో” తండ్రి విసుక్కునేసరికి బిక్క ముఖం వేసాడు రాఘవ. ఎంత ఆలోచించినా తండ్రి మాటలు బోధపడలేదు సరికదా ‘వాళ్ళని ముట్టుకో కూడదంటాడు నాన్న. కానీ మరి సూరీడు మా అందరి బట్టలూ ఉతుకుతాడు, ఆరిపోయిన బట్టలు మడత పెడతాడు, అవేగా మేము కట్టుకుంటాము! ఇల్లు ఊడుస్తాడు, అంట్లు తోముతాడు, గేదె పాలు పితుకుతాడు- ఆ పాలేగా నేను తాగుతాను! ఏంటో మరి?’ Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/wmf2A3tdeuc
Embed this episode
NOW PLAYING
ఒక్కటే | Okkate | Telugu Short Story | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.