EPISODE · Oct 23, 2022 · 10 MIN
ఓ అమ్మాయి కథ | O Ammayi Katha | Telugu short story | N Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓ అమ్మాయి కథ రచన: N. ధనలక్ష్మి చేసిన తప్పును తెలుసుకొని తనని తాను సరిదిద్దుకున్న ఓ ఇంతి కథ. పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. పెళ్ళి రేపు అనగా ఇంట్లో డబ్బులు, నగలు తీసుకొని తను ఇష్టపడిన రాహుల్ తో పారిపోయింది పెళ్ళి కూతురు భాను. పెళ్ళికి మంచి ముహూర్తాలు లేవంటూ కొద్ది రోజులు జీవితాన్ని లవర్స్ గా ఎంజాయ్ చేద్దామని తనని నమ్మించి సొంతం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా సరదాగా గడిపారు. పెళ్ళి చేసుకుందాం అంటే ఎప్పుడూ మాట దాటేసేవాడు. మూడు నెలల తరువాత భాను నెల తప్పింది. ఆ విషయం రాహుల్ కి చెప్పి ‘పెళ్ళి చేసుకుందాం. ఆలస్యం అయితే ప్రమాద’మని చెప్పింది. రాహుల్ పెళ్ళికి కావాల్సినవి తెస్తానని చెప్పి బయటకి వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. భాను కంగారు పడుతూ ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భాను తెచ్చుకున్న నగలు, డబ్బులు కూడా లేవు. భానుకి అర్థమైంది తను మోసపోయానని! అమ్మ, నాన్నలకి తను ఒక్కటే సంతానం. వారి వద్దకు వెళ్ళాలి అనుకుంది. మోసపోయానని చెప్పితే ఆదరిస్తారు అనుకొని ఊరికి చేరింది. ఊర్లో వారికి తానెవరో తెలియకుండ ఉండేలా మొహానికి ముసుగు వేసుకుంది. తన ఇంటికి చేరుకుంది కానీ తాళం వేసి ఉంది . భాను లేచిపోవడం వల్ల ఊరిలో పరువు పోయింది. వారు ఆ బాధలో ఉండగా పెళ్ళి వారు తల ఓ మాట అనడం భరించలేక వాళ్ళ అమ్మ, నాన్న.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పారు. తన వల్లే అమ్మ , నాన్న ఈ లోకం నుండి వెళ్ళిపోయారని, తట్టుకోలేక పోయింది. వారి ఊరిలొన్న బావిలో దూకి చనిపోవాలని అనుకుంది. ఆ ఊరికి మెడికల్ క్యాంప్ కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న సింధూ ఆ దృశ్యాన్ని చూసి భానును ఆపింది. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావుని సింధూ అడగగానే తన గురించి చెప్పింది "మేడమ్! నేను చేసిన పనికి చావు తప్ప ఇంకో పరిష్కారం లేదు.. అవునా కాదా చెప్పండి!????” సింధూ భాను వైపు చూస్తూ... “మీరు చేసింది తప్పే! కాదు అనను.. కానీ చనిపోవడం కరెక్ట్ కాదు.... చూడండి భాను.. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. కాకపోతే అన్నిటినీ తట్టుకుని నిలబడే మనోదైర్యం ఉండాలి. అదే మీకు మార్గాన్ని చూపిస్తుంది. మీ ఇష్టపూర్వకంగానే కదా కలిశారు. ఆ ఫలితమే మీ కడుపులోని బిడ్డ. తనని చంపే హక్కు మీకు లేదు. బిడ్డ పుట్టాక, చనిపోవాలి అనుకునే నిర్ణయాన్ని మీరే మార్చుకుంటారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి పరిష్కారం తప్పక దొరుకుతుంది....” భాను నవ్వుతూ.... “ప్రశాంతత ఎక్కడుంది , ఎక్కడ దొరుకుతుంది.... నా నిర్ణయం మార్చుకొమ్మని ఎంత బాగా చెప్తున్నారు.. మీకేమీ నాకున్న సమస్యలు లేవు కదా.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/U7b05exVZKA
Embed this episode
NOW PLAYING
ఓ అమ్మాయి కథ | O Ammayi Katha | Telugu short story | N Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.