EPISODE · Jan 28, 2023 · 15 MIN
ఓ సాంబయ్య కథ | O Sambaiah Katha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓ సాంబయ్య కథ రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత మొదటి సోమవారం. తన కన్నా ముందే లేచి తలకు స్నానం చేసిన సాంబయ్య “ఆయమ్మా! నేను అలా శివాలయానికి వెళ్ళి వస్తాను. ఈవేళ మొదటి కార్తీక సోమవారమంటగా. ’’ అని అడిగాడు, వీధి అరుగుమీద కూర్చుని దూది వత్తులు చేసుకుంటున్న సరస్వతిని. ‘’అవును. వెళ్ళి రా బాబు. జాగ్రత్త. తొందరగా వచ్చేయ్” అన్న సరస్వతి, అరుగుమీద కూర్చునిపోయి ఎదురుగా ఉన్న డాబాకేసి చూసింది. అది మూడేళ్లక్రితం నరసయ్య ఇల్లు. ఈవేళ కొనుక్కుని ఉంటున్నవాళ్లది. హు.. ఆ దేవుడు ఎవరికి ఎపుడు ఎక్కడ ఎలా రాసిపెడతాడో? అనుకుంటూ గతంలోకి జారుకుంది. * * * "ఏరా ఇంతలేటయ్యింది... అయిందా అన్ని దేవుళ్ళకు మొక్కడం... అన్ని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం? ఈ కార్తీకమాసం పీడ ఎప్పుడు వదులుతుందో గాని... చస్తున్నాను నీతో. " సాంబయ్య ను చూస్తూనే కయ్ మని లేచాడు కిరాణాకొట్టు నరసయ్య. "నీతో చెప్పే ఎల్లాగా.. అట్ఠా తిడతావేంది? ఈయేలా ఏమైందో తెలుసా... ఎవరో ఒకాయన.. మంచి రచయితంట.. మనూల్లో కమ్యూనిటీ హాల్లో సన్మానం సేత్తన్నారంట. హోటల్లో దిగినాడంటా... స్నానం సేసి ఊళ్ళో గుళ్ళు సూడ్డానికి బయల్దేరాడంట. దారిలో నన్ను ఆపి 'దగ్గర్లో గుళ్లు ఏమన్నా ఉన్నాయా' అని అడిగాడు. అతనికి అన్నీ చూపించాక నా గురించి అడిగాడు. నీదగ్గర పనిచేస్తున్నానని చెప్పాను. టీ తాపించాడు. అతన్ని పంపేసి వచ్చేసరికి రోజూకన్నా పది నిముసాలు లేటయ్యింది. అంతేగా. ఈ మాత్రం దానికే తిడతావే? ఇదుగో పెసాదం. "అని నరసయ్య చేతిలో పెట్టాడు సాంబయ్య. "ఈ ప్రసాదం తినందే గల్లా పెట్టి తెరవనని తెలుసు గదా. సరే వెళ్లి టిఫిన్ తిను. "అని పురమాయించాడు నరసయ్య. సాంబయ్య '' అత్తా, సాంబయ్య వచ్చాడు, టిఫిన్ పెట్టావా?'' అంటూ లోపలికి వెళ్ళాడు. ఇదంతా ఎదురింటి కిటికీలోంచి చూస్తున్న సరస్వతి సాంబయ్యకేసి జాలిగా చూసింది. ఆ జాలి బాధగా మారి గుండెల్లోకి దిగింది. సరస్వతి ముప్పై అయిదేళ్లు గా ఆ వూళ్ళో ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుళ్ళు పోసే నర్సుగా పనిచేసి రిటైర్ అయింది. ఈవేళ ప్రభుత్వం చేపట్టిన పధకాలు, విధివిధానాలు అన్నీ మారిపోయాయి. గ్రామసేవికలు ఇంటింటికీ వచ్చి తమకు కేటాయించిన గ్రామంలో గర్భం ధరించిన స్త్రీల వివరాలు నమోదు చేసుకుని బిడ్డ ప్రసవించేవరకూ అనేక రకాలుగా వారిని సాకి, చక్కని బిడ్డను ప్రసవింపచేసి, ఆబిడ్డకు మూడు నెలలు వచ్చే వరకు అన్నివిధాలా సాకుతున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9RiGh_h2D1w
Embed this episode
NOW PLAYING
ఓ సాంబయ్య కథ | O Sambaiah Katha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.