EPISODE · Jan 4, 2023 · 11 MIN
పాణిగ్రహణం 1 | PaniGrahanam 1 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) భాగవతుల భారతి గారి ధారావాహిక పాణిగ్రహణం ప్రారంభం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నచిన్న చినుకులుగా వర్షం మెుదలయింది. బయటికి వచ్చిచూస్తే... ఇంటిముందు ఎండావానలను తట్టుకోటానికి, నిలువుగా వేలాడేసిన నీలంపట్టా మీది చినుకు జారి, అక్కడే ఉన్న కుండీలోని చిట్టిగులాబీ పువ్వుమీద పడి, చినుకు పడినప్పుడల్లా, పువ్వు అదోలా నవ్వడం, ఓఆటలా అనిపిస్తోంది. ఓ 'తేటగీతి' పద్యం మదిలో మెదిలింది.... 'మధుర భావాల మంజుల రథమునెక్కి తరుణి మదిలోన యాశల తావులద్ది సాంథ్యకాంతుల హారతి సంతరించ రార! చెలికాడ మజ్జీవన రమ్యవనికి' భావుకతతో చూస్తుంటే ఏదైనా పద్యమే, కవితే, ఏదైనా పాటే... ఈ సయ్యాటను కన్నార్పకుండా చూస్తున్న హంస మంజీరను, "ఏంటి సంగతులూ.. నాతో మాట్లాడటం మానేసి ఎటో చూస్తున్నావ్?" మాటలు వినబడి వెనుకకు తిరిగి చూసింది హంసమంజీర. "ఏం లేదే! సన్నని చినుకు గులాబిమీద పడితే దానికదలిక భలే తమాషాగా ఉంది. వలపు ఒడిలోని ప్రేయసీప్రియుల సరాగంలా! " "కవయిత్రి మెుల్ల... కాదు... కాదు మెల్ల.... " మెల్లకన్ను పెట్టి పకపకా నవ్వింది సాగరమేఖల. "ఏం చేస్తున్నావ్? ఉద్యోగాల వేటా?" "అవునే! ఇప్పటికి నాలుగు ఉద్యోగాలు మానేసా! కొత్తది వెదుకుతున్నా " "ఎలాఉంటున్నావే! నీ గురించే మా అందరి దిగులు" "నా గురించి ఎందుకు? నేను చూడు.... ఎంత ఉల్లాసంగా ఉన్నానో.... ఎంత ఉత్సాహం గా ఉన్నానో.... " బద్రిలా ఫోజ్ పెట్టి చెప్పింది సాగరమేఖల. "అన్నయ్య నిన్న ఫోన్ చేసి మనిద్దరి క్షేమసమాచారాలూ అడిగాడు. " "నాకూ చేసాడు. పిచ్చిఅన్నయ్య! నేను బాగానే ఉన్నానంటే వినడే! అమ్మకూడా దిగులు పడుతోందిట. అది వదిలేయ్. ఇంకేవైనా విషయాలు చెప్పు. " "ఈయనగారికి ప్రమోషన్ వచ్చేటట్లు ఉంది" "ప్రమోషన్ మీద ట్రాన్స్ ఫర్ కూడా అవుతుందా? ముందే చెప్పవే! నేనూ తట్టాబుట్టా సర్దుతా! " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/bkSuS2CFVvc
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం 1 | PaniGrahanam 1 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.