EPISODE · Mar 4, 2023 · 9 MIN
పాణిగ్రహణం -10 | PaniGrahanam - 10 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 10 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నేను పాపిష్ఠి దాన్ని! నీ దగ్గర దాచలేను. చెప్పేస్తానన్నా! నన్ను నువు తిట్టినా సరే!" "కుమార్ సార్! ఉద్యోగ నిమిత్తం మన ఊళ్ళోనే ఉండేవాడు. రోజూ మెస్ లో భోజనానికి వచ్చేవాడు.. బోలెడు డబ్బుంది 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాలేదు. " "మాటా మాటా కలిపాడు. కళ్ళూ కళ్ళూ కలిపాడు. రోజూ ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడు. మాటల్లో తేనె లొలికించాడు అరచేతిలో స్వర్గం చూపించాడు. " "రాజుని చూసిన మీదట మెుగుణ్ణి చూస్తే మెుట్ట బుద్ధయిందనే సామెత నా లాంటి వాళ్ళని చూసే పుట్టిఉంటుంది. " "తన సూటూ, బూటూ, టక్కూ, పర్శనాలిటి నన్ను వెఱ్ఱెక్కించేసాయ్. నీ మెుగుడు పనికిరానివాడు. చేతకానివాడు. నీ లాంటి అందగత్తె ఇక్కడుండాల్సింది కాదు. నేనైతే అందలాల్లో ఉంచుతాను. తనతో పాటు వచ్చేయమన్నాడు. ఓ విషఘడియలో.." చెబుతూనే ఏడ్చింది. మళ్ళీ తనే.. తమాయించుకుని.. "ఉంచుకున్నోడు మెుగుడవుతాడా? పెంచుకున్నోడు కొడుకవుతాడా? అని శాస్త్రమే ఉందిగా అన్నా! అవసరం తీర్చుకున్నాడు. పైగా నగలు, డబ్బులూ, స్థలం తాలూకు కాగితాలూ అన్నీ తీసుకుని పారిపోయాడు. నేను మిషన్ కుట్టుకుని బ్రతుకుతున్నాను. నాకు తెలిసిన కాస్త విద్య అదేగా!" "మరిపాప!?" "ఇంకానయం! పాపని దూరంగా గురుకుల పాఠశాలలో చేర్చా! ఎందుకైనా మంచిదని..” "ఇదంతా లక్ష్మణకు తెలుసా? " అని అడిగి.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/jJI9cseC2Og
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం -10 | PaniGrahanam - 10 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.