EPISODE · Jan 11, 2023 · 12 MIN
పాణిగ్రహణం - 2 | PaniGrahanam - 2 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 2 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి. హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల. సాగర మేఖల జీవితం గురించి ఒక పుస్తకం రాయమని హంస మంజీరను అడుగుతుంది సుగాత్రి. విరుపాక్షను మందు పార్టీకి రమ్మని స్నేహితులు బలవంతం చేసినా అంగీకరించడతను. గర్భవతిగా ఉన్న భార్యను వదిలి రానంటాడతను. ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 2 చదవండి. 'నాచేయి వదలనన్నాడు గుబులు వేళల్లో నీలాలన... గోదారి అలలను చుంబించే పున్నమి వెన్నెల కిరణం అన్నాడు నువ్వే లేకుంటే నేను శూన్య పంజరంలోని రెక్కలు తెగిన విహంగమన్నాడు నా అన్వేషణ : కొండ కొమ్ము నుండి జారిపడ్డాక అడుగున దొరికే నీ నవ్వుల ముత్యపు చిప్పల కోసమన్నాడు తను తనువైతే నేను మనసన్నాడు ప్రేమరధానికి తను చక్రమైతే నేను ఇరుసన్నాడు ... నా ఏకాకితనపు ఎడారిలో దక్కిన ఒయాసిస్సు వన్నాడు అన్నీ అనీ అనీ ఎవరికి ఏమయ్యాడు? తన గుండెను గుడిగాచేసి .... నన్ను దేవతను చేసి... తను దేవుడయ్యాడు ????????????? పతిదేవుడయ్యాడు.' కవిత రాస్తుండగా....... బయటినుండి వచ్చిన భర్త ముఖం వివర్ణమవటం చూసింది హంసమంజీర. కురిసివెలవటానికి సిద్దమవుతున్న మేఘం నలుపురంగు రంగు విడిలి దూదిపింజలుగా విడిపోయి....పాలిపోయినట్లలుముకున్న ఆకాశాన్ని చూస్తున్నట్లు, అనిపించింది, ఆక్షణంలో భర్తముఖం హంసమంజీరకు.... "ఏమయిందీ?" అంది. "క్రాస్ రోడ్డులో అన్నయ్య కనిపించాడు." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం - 2 | PaniGrahanam - 2 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.