EPISODE · Jan 18, 2023 · 9 MIN
పాణిగ్రహణం - 3 | PaniGrahanam - 3 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 3 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. ఇంటికి వచ్చిన భర్త ముభావంగా ఉండటం గమనించి కారణం అడుగుతుంది హంస మంజీర. తన మేనమామ కొడుకు సమీర్, భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు చెబుతాడతను. సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష. గతం గుర్తుకొస్తుందతనికి. ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 3 చదవండి. సాగర మేఖలను చూసుకోటానికి పెళ్ళి వారు వచ్చారు. తండ్రి లేడు కాబట్టి.... తల్లి రాకూడదనే ఆచారం ప్రకారం.... మేనమామా భార్య వచ్చారు. వస్తూ ఓ పురోహితుణ్ణి వెంటబెట్టుకు వచ్చారు. ఇటువైపూ తండ్రిలేడు, విరూపాక్ష, పిన్నీ, బాబాయ్ వచ్చారు మాట్లాడటానికి. పిల్లవాడి మేనమామ, "పిల్ల బాగుంది, చదువుకుంది. ఉద్యోగస్థురాలు.... ఇంకేం! శుభస్యశీఘ్రం. అయ్యగారూ! జాతకాలు సరిపోయాయంటారా?" అడిగాడు. "అంటే.... అన్నీ బాగున్నాయి కానీ, జాతకాలలో కొద్దిగా లోటుంది. " నీళ్ళు నమిలాడు పంతులుగారు. "మా రోజుల్లో ఇవన్నీ చూసి చేసారామా పెళ్ళిళ్ళూ... ఇవాళారేపూ ఇదో వంక వచ్చేసింది. జాతకాలు కలవలేదు అనీ.... " మేనమామ పెళ్ళాం దీర్ఘాలుతీసింది. "జాతకాలు కలవకపోవటం ఏం లేదండీ... చిన్న లోపం అంతే!... పేరు మార్చితే సరిపోతుంది " పంతులుగారు పంచాంగం తిరగేసాడు. విరూపాక్ష బాబాయ్ విరూపాక్ష ను బయటికి తీసుకుపోయి... "పిల్ల, ఉద్యోగం... మిగతా లాంఛనాలు నచ్చినాయ్ కాబట్టి.... పేరు మార్చమని చెబితే పోలా! మనం మాత్రం ఇంతకన్నా మంచిసంబంధం తేగలమా ?ఆలోచించు విరూ! " అన్నాడు. "నాన్న ఉంటే ఏం చేసేవాడో తెలీదు. అక్కకూ ఓ అభిప్రాయం ఉంటుందిగా... అడిగీ.... "అక్కా! ఓ సారి ఇలావస్తావా?" వచ్చింది. "విన్నావుగా! అతను నచ్చాడా? పేరు మార్చుకోటం ఇష్టమేనా? మేమేదో పెళ్ళి సంబంధాలు చూడటానికి కష్టపడి పోతామని.... రాజీ పడవద్దు. నీ కిష్టమయితేనే! బలవంతమేం లేదు. " చెప్పాడు. "మన మధ్యతరగతి కుటుంబాలలో, ఇంతకన్నా మంచి ఎక్కువ ఆశించటం... అందులోనూ.... నాన్నని పోగొట్టుకున్న మనం.... నాకిష్టమే.... " "మన:స్ఫూర్తిగా చెబుతున్నావా అక్కా!" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం - 3 | PaniGrahanam - 3 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.