పాణిగ్రహణం - 6 | PaniGrahanam - 6 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 8, 2023 · 8 MIN

పాణిగ్రహణం - 6 | PaniGrahanam - 6 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 6 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నగదే ఐనా కొంతమంది ఆహూతులతో ఇద్దరు పత్రికా విలేఖరులతో కళకళ లాడుతోంది. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' అనే చిన్న బ్యానర్ వెనకవైపు గోడకు తగిలించి ఉంది. వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ సర్వ్ చేయబడ్డాయి. "ఎందుకు పిలిచాడో? ఇదంతా ఏమిటో? " వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు. "కాసేపట్లో అదే తెలుస్తుందిగా! వండుకున్నమ్మ తినక మానదుగా! కడుపుతో ఉన్నమ్మ కనక మానదుగా! " నవ్వులూ. గొంతువిప్పాడు విరూపాక్ష. "నా యింట్లో ఇంత చిన్న గదిలోకి నేను ఆహ్వానించగానే, మీమీ పనులు మానుకుని అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించి.... వచ్చిన శ్రేయోభిలాషులకు, పత్రికా విలేఖరులకు ముందుగా ధన్యవాదాలు... " "డియర్ ఫ్రెండ్స్...వెనకనున్న బ్యానర్ చూడగానే మీకు సగం అర్ధమయిపోయి ఉండాలి" "అంటే 'మ్యారేజ్ బ్యూరో' ఏదైనా పెడుతున్నావా? విరూ! మరి ఉద్యోగం?" "ఉద్యోగం దారిదానిదే! ఇది మ్యారేజి బ్యూరో కాదు. " అని క్షణం ఆగి.... "మీ అందరికీ తెలుసు. ఇవాళా రేపూ వివాహ వ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నమైపోతోందో? " "అవును విరూ! మా వాళ్ళలోనే మూడు విడాకుల కేసులు... " "నిజమే! పెళ్ళి పెళ్ళని శుభలేఖలు పంచి, లక్షలు పెట్టి, కల్యాణ మంటపాలు మాట్లాడి లక్షలు ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేసినంతసేపు పట్టట్లా ! ఇంటికివచ్చి కాళ్ళుకడుక్కున్నంత సేపట్లో, ఫోన్.... ఆ జంటకు విడాకులని... " "పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటేనే...  ఆ!... ఎందుకులే! వీళ్ళు కలిసిఉండేదా? పెట్టేదా? గిఫ్ట్, ప్రయాణం ఛార్జీలు దండగ... వాళ్ళు కలిసున్నారని తెలిసాక పోదాం, అనిపిస్తోంది" ఓ పెద్దాయన అన్నాడు. "శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యంభవతి శతమితిశతం దీర్ఘమాయుః " అని ఆశీర్వదించినంతసేపు పట్టట్లా. " "కారణం ఏమిటంటారూ?" విరూపాక్ష చర్చకు దిగాడు. "ఆ... ఆడవాళ్ళ చదువులూ, ఉద్యోగాలూ " ఆడవాళ్ల మీద ఉక్రోషంతో అన్నాడు ఓ పెద్దాయన. "మరి చదువుకోని వాళ్ళూ విడిపోయినట్లు విన్నానూ" "ఐతే! ఇగోలేమో! నేనూ అనే... కాన్సెప్ట్ " అన్నారు ఇంకొకరు. "కొంత కారణం కావచ్చు... కానీ అన్నీ అలాగూ లేవు. " "మరి నువ్వేమంటావో అది చెప్పు విరూ!" చనువుగా అడిగింది పెద్దావిడ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/as437GtERhk

Episode metadata supplied by the publisher feed · Published Feb 8, 2023

Embed this episode

NOW PLAYING

పాణిగ్రహణం - 6 | PaniGrahanam - 6 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com

0:00 8:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 8, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!