EPISODE · Feb 13, 2023 · 9 MIN
పాణిగ్రహణం - 7 | PaniGrahanam - 7 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 7 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అప్పుడే ఓ చిన్న గులాబీ మెుక్క తెచ్చి, దానికున్న మెుగ్గ, ఒక్కొక్కరేకూ విచ్చుకుంటుండగా.... అక్కడే కూర్చుని మురిసిపోయే, చిన్నారి మనసులా... తన 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ' బ్యానర్ మాటిమాటికి చూసుకుని.... తన బాధ్యత ను తలుచుకుని ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాడు. మెుదటి కేసు అక్కదే... ఎలా? ఎక్కడినుంచి, మెుదలుపెట్టాలీ? "విరూ! భోజనం కూడా చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు ?" తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, తల విదిలించాడు. "అమ్మా! ఆశీర్వదించమ్మా!" "విరూ! నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందిరా! అక్కకీ, నీకూ!" "నా ప్రయత్నం అంతా అక్క జీవితం బాగుచేయాలనే! కానీ.... ఏదో ఉద్వేగం... " "ప్రయత్నించండి... ముందుగా అక్కకు ఫోన్ చేసి, ఆమె అభిప్రాయం తెలుసుకోండీ ఆమెకు అతనితో కలవడం ఇష్టమేనా?... " భార్యసలహాతో... ఫోన్ తీసాడు. విరూపాక్ష భార్యకూడా అతనికి అనుకూలవతే, చేదోడు వాదోడుగా ఉండే ఇల్లాలు. ఆడపడుచు సంసారం ఇలా అవటం ఆమెనూ బాధిస్తోంది. "వదినా! మీరు ఒక్కరే అంతదూరం లో ఎందుకు? ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని మాతోనే ఉంటే మీ తమ్ముడు, నేనూ కనిపెట్టుకుని ఉంటాం... అత్తయ్య గారికీ, మనశ్శాంతి గా ఉంటుంది. " ఎన్నోసార్లు చెప్పిచూసింది. కానీ సాగరమేఖల "నువ్వు చాలా మంచిదానివి. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని, మీ మధ్యలోకి రాలేను. భార్యాభర్తల మధ్య మూడో మనుషులు చేసే విధ్వంసం నేను అనుభవించాను. కాబట్టి... దూరంగా ఉంటేనే బంధాలు నిలబడతాయి. తరచుగా కలుస్తూనే ఉందాం. " సున్నితంగా తిరస్కరించింది సాగరమేఖల. విరూపాక్ష ఫోన్ అక్కకి చేసాడు. "అక్కా! బాగున్నావా!" "సూ..... పర్... కొత్త ప్రపంచం... కొత్త ఉద్యోగం.... " "హంసమంజీర.... ఆమె భర్త సహాయం. ప్రస్తుతం అంతా ఓకే... " అంటూ నవ్వింది. "అక్కా! బావ ఎక్కడున్నాడో ఫోన్ చేయకపోయావా?" సాగర మేఖల నవ్వు మాయమయింది. "విరూ! ఇదేమిటీ కొత్తగా! తెగతెంపులు చేసుకుని వచ్చేసాక.... " అంది. "మీఇంటిపేరు ఏమిటే " "చామర్తి" "చూసావా! మనింటి పేరు చెప్పలేదు నువ్వు. అత్తింటి పేరే మోస్తున్నావుగా!" "ఐతే !" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0Zb_fyr_ov0
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం - 7 | PaniGrahanam - 7 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.