EPISODE · Feb 19, 2023 · 8 MIN
పాణిగ్రహణం - 8 | PaniGrahanam - 8 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 8 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "హలో! 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ'" "అవును.. మీరూ మేమూ చుట్టాలమే.. నేను సమీర్ తండ్రి ని" డైరెక్టు గా ఫోన్ చేస్తే.. వెటకారంగా ఉంటుంది. ‘మా విషయాల్లో మీకేంపనీ?’ అంటారు. అందుకే విరూపాక్ష, దీని గురించి వేరే వారిచేత చెప్పించాడు.. సమీర్ తల్లిదండ్రులు వచ్చారు ముగ్గులోకి.. "సమస్య ఏంటి?" "రెండేళ్ళనుండి కోర్టులచుట్టూ తిరగలేక చస్తున్నామ్. కేసులు కోర్టుల్లో పడితే ఓ పట్టాన తెములుతాయా ? ఫీజు ఇచ్చుకుంటాం.. ఉపాయం చెబుదురూ! " "విషయం ఏంటిట? " గంటసేపు జరిగిందంతా చెప్పనిచ్చాడు. "నేనడిగింది.. ఎందుకలా జరిగింది? భవిష్యత్తు లో ఆమె ఏంచేయాలనుకుంటోంది అనీ?" "మా పిల్లలు మాకేం చెప్పరు. మా పిల్లలే కాదు.. ఏ పిల్లలైనా అంతే ఉన్నారు. చదువులు వచ్చినాయ్. బయటి ప్రపంచం తెలీటల్లా.. సర్దుబాట్లు తెలీటల్లా.. లేక మనమే చెప్పట్లేదో!? చెప్పేంత టైం ఏదీ? వినేంత టైం ఎవరికీ? చదువూ!.. చదువూ!.. చదువూ!.. తర్వాత కెరీర్ ముఖ్యం అంటున్నారు." "మర్కట కిశోర న్యాయమా? మార్జాల కిశోర న్యాయమా? అన్నట్లుంది.. నేటిపిల్లలతో.. " "అంటే?" "మర్కటం అంటే కోతి.. మార్జాలం అంటే పిల్లి. కిశోరం అంటే పిల్ల.. కోతి చెట్ల మీంచి దూకేటప్పుడు.. కోతిపిల్ల.. కోతి పొట్టను గట్టిగా పట్టుకునే ఉంటుంది. పట్టుకోకపోతే పడిపోతుంది. అక్కడ భద్రత, బాధ్యత అంతా కోతిపిల్లదే. అదే పిల్లుల విషయంలో పిల్ల బాధ్యత తల్లిదే. నోటితో పట్టుకునే ఏడు సందులు తిప్పుతుందిట. కాబట్టీ మనం పిల్లల్ని పట్టుకోవాలో? మనల్ని వాళ్ళే పట్టుకోవాలో?.. " "సమస్యంతా అక్కడే వస్తోంది" వారంరోజులు సమీర్ ఫామిలీ తో టచ్ లోనే ఉండి.. మనస్థత్వాలూ.. మాటతీరూ పరిశీలన చేసి.. చర్చలు జరిపాక.. "సమీర్ భార్య ఫోన్ నెంబర్ ఇవ్వండీ" వారం తర్వాత.. సమీర్ తండ్రి ఫోన్ చేసాడు."ఏం తేలింది?" "మీలోనే లోపం ఉన్నట్లు తేలింది. " "అదెలా?" "సమీర్ భార్యకి తండ్రిలేడు. ఏమిటో! ఈమధ్య తండ్రి లేని సంసారాలే ఎక్కువవుతున్నాయి. విడిపోతున్నారో.. దేవుడి దగ్గరకే పోతున్నారో గానీ, సింగిల్ పేరెంటెడ్.. కుటుంబాలు.. ప్చ్.. ఇక మీ విషయానికి వస్తే.. తల్లి ఆడపిల్లలిద్దరినీ కష్టపడి పెంచింది. చదువూ చెప్పించింది. ఇవన్నీ మీకు తెలుసు కదూ! " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7i-lMpkv-MY
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం - 8 | PaniGrahanam - 8 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.