EPISODE · Feb 26, 2023 · 11 MIN
పాణిగ్రహణం - 9 | PaniGrahanam - 9 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 9 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి. హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల. సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష. గతం గుర్తుకొస్తుందతనికి. కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల. హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె. ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష. ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష. మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు. ముందుగా సాగర మేఖల కాపురం సరిదిద్దాలనుకుంటాడు. ఆమె భర్తకు కాల్ చేసి సాగర మేఖలకు అతనంటే విముఖత లేదని చెబుతాడు. మొదట్లో అతను సరిగ్గా బదులివ్వక పోయినా విరూపాక్ష పట్టుదల వల్ల మెత్తబడతాడు. సాగర మేఖలలో కూడా మార్పు వచ్చి భర్త దగ్గరకు వెళ్తుంది. సమీర్ కాపురాన్ని కూడా అతని తండ్రి సహకారంతో సరిదిద్దుతాడు. తరువాత లక్ష్మణ్ సమస్య పైన దృష్టి సారిస్తాడు. ఇక పాణిగ్రహణం ధారావాహిక తొమ్మిదివ భాగం చదవండి. "హలో! విరూపాక్ష గారేనా?" ఫోన్ లో ఓ గొంతు బలహీనంగా అడిగింది. "అవును ! 'పాణిగ్రహణం 'కన్స ల్టెన్సీ' "మిమ్మల్ని ఓసారి కలవాలి" "రండి! మా అడ్రసు...." "మీ అడ్రస్ మాకు తెలుసండీ! కానీ నేను వచ్చే పరిస్థితిలో లేను. దయచేసి వీలుచూసుకుని మీరే రాగలరా!? ఈఊళ్ళోనే.... అడ్రసు... మీ బండి పెట్రోలు ఖర్చు నేను భరిస్తాను. " ఖళ్ళూ ఖళ్ళూ దగ్గుతూ ఫోన్ పెట్టేసాడు ఓ పెద్దాయన. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/UU20kGUIUKk
Embed this episode
NOW PLAYING
పాణిగ్రహణం - 9 | PaniGrahanam - 9 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.