పాత చింతకాయపచ్చడి లాంటి కథ | Patha Chinthakayapacchadi Lanti Katha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 12, 2023 · 23 MIN

పాత చింతకాయపచ్చడి లాంటి కథ | Patha Chinthakayapacchadi Lanti Katha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాత చింతకాయపచ్చడి లాంటి కథ "హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”. ''ఎవరు మాట్లాడేది??” "నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్చి నీకు కూడా పంపుతాను." "అరెరే.. వాడు నిన్ననే మానేశాడు రా'' "ఏడ్చావు.. ఆ సంగతి ముందుగానే చెప్పొచ్చు కదా. ఫోన్ పెట్టేయ్.. కాల్ వేస్ట్......" "మరి పచ్చడి ఎప్పుడు పంపుతావ్. అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో ఆ పచ్చడి ఎలా ఉంది'' "ఆపు నీ వెధవ అనుమానం. నీకు తెలియకుండా ఉండబట్టే ఇన్నేళ్లు ఉంది. ఇదిగో ఎల్లుండి మా కొడుకులు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలు అందరూ వస్తున్నారు. అందరం తిన్నాక మిగిలితే పంపుతాలే వింటున్నావా... ' "మళ్లీ ఏదో అరకాసులో తిరకాసు పెడుతున్నావు. వాళ్లంతా వచ్చి రెండు నెలలే కదా అయింది. మళ్ళీ ఎలా వస్తారు?".. అనుమానం తీరక అడిగాడు సుబ్రహ్మణ్యం. "అదంతే.. నాకు చూడాలని ఉంది. పావులు కదుపుతున్నాను కదా.. వాళ్ళు వచ్చేస్తారు." ఫోన్ పెట్టేసాడు శివరామకృష్ణయ్య. ******** "వెన్నెల్లో పిండారపోసినట్లు, ఆ పిండితో చేగోడీలు చేసుకుతిన్నట్టు నీ ముఖం ఎంత కరకరలాడుతుంది.. సారీ.. కళకళలాడుతుంది. బాగుందా నా కవిత్వం.. లే.. తెల్లవారబోతుంది.” "కిర్రు కిర్రు కాలి చెప్పుల్లా కిసుక్కున నవ్వే నీ నవ్వు శబ్దం టెంక లేని తాటి పండులా పళ్ళు లేని నీ నోటి అందo'' “వహ్వా.. భలే కుదిరిందోయ్ ప్రాస.. కాత్యాయనీ నేను ఎన్ని కవితలు చదివినా నీకు మెలుకువ రాదేమిటి?''.. భార్యను లేపుతూ అన్నాడు శివరామకృష్ణయ్య. అతను యవ్వనంలో శ్రీకృష్ణదేవరాయలు అంత దిట్ట. అన్ని పత్రికలు అవి బ్రతికినన్నాళ్లు అతని కవిత్వాన్ని ప్రచురించాయి.. తన ఫోటోనే కాకుండా భార్య కాత్యాయని ఫోటోతో సహా. అతని కవిత్వ గంధం లో కాస్తంత సుగంధం ఆమెకు కూడా అంటుకుంది... అలా వాళ్ల కవిత్వాలు ఆ ఇద్దరు ఫోటోలతో సహా మారుమోగిపోయేవి అప్పట్లో.. ఇదంతా మూడు పుష్కరాలు నాటి మాట. ఇప్పుడు అతనికి తొమ్మిదిపదులు ఆమెకు పది తక్కువ. "లేచావా కూర్చో.. మన వాళ్ళందరినీ నీకు మళ్ళీ చూడాలని ఉందా?" ప్రశ్నించాడు. "మీకు మాత్రం ఉండదా.. మీ ఆశ కాకపోతే వాళ్లు మళ్లీ ఇప్పుడు ఎలా వస్తారు?'' "ముందు నువ్వు మంచం దిగు.. కొంపతీసి నడుంకాని పట్టేసిందా మళ్లీ?'' Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

Episode metadata supplied by the publisher feed · Published Feb 12, 2023

Embed this episode

Ready to play

పాత చింతకాయపచ్చడి లాంటి కథ | Patha Chinthakayapacchadi Lanti Katha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

0:00 23:02

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 23 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!