Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు episode artwork

EPISODE · Feb 13, 2023 · 30 MIN

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

from Harshaneeyam

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.కథను ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)వఱడు  :రాత్రి పదిగంటలు కావస్తోంది. ఆ కీకారణ్యమంతటా పేరుకున్న నల్లటి జారు ముద్దలాంటి చీకటి అలుముకునుంది. కేంపు గూడారాలు మాత్రం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయ్. మధ్యలో అక్కడక్కడ కేంపు పనివాళ్ళు వన్య మృగాల బారినుండి రక్షించుకోడానికి వేసిన మంటలు, దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కన్పిస్తున్నాయ్. గుడారాల్లో హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకు మంటూంటే, ఆఫీసు టెంటుల్లో పెట్రోమాక్సు లైటు వెలిగిపోతోంది. దశరధరామయ్య గారు ఇంకా ఆఫీసు పనిచేసుకుంటున్నారు. అలా రాత్రి ఒంటి గంట వరకూ ప్రతిరోజూ పని చెయ్యడం ఆయనకి పరిపాటే. –చిమ్మెట్టలు “జూయ్ “మనిచేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండ గొర్రె అవిరామంగా “కార్ కార్ “మని అరుస్తోంది. దశరధ రామయ్యగారికి చిన్న దగ్గుతెర వచ్చింది. కాస్సేపు గొంతుకలో కఫం తగ్గేదాకా దగ్గి, గుండెని చేత్తో పట్టుకుని టెంటు తెర తొలగించి బైటకొచ్చి తుపుక్కున ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తరవాత, ఇహ ఇవాల్టికి ఇంటికి పోదామనుకున్నాడు. – కానీ ఇంకా బోలెడు పనుండి పోయింది. ఐనా ఇప్పుడు టైము ఎంత అయుంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు.జీపు డ్రైవరు చిన్నయ్య హెడ్ క్వార్టర్సులో వుంటే, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఎన్ని పనులున్నా లైటార్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్సు మిలిటరీ డిసిప్లేన్ అంటాడు.ఇంకా లాంతరు గుడారంలో వెలుగుతోంది. అంటే పన్నెండు కాలేదన్నమాట. సరే మరో గంట పనిచేసి పోదామని టెంటు లోకి దశరధరామయ్యగారు దూరుతుండగా “ఠకాలు”మని బూట్లు కొట్టుకున్న చప్పుడు, వెంటనే “గుడ్ నైట్ పంతులు బాబూ” అనే అరుపుకూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిట్రీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా, అది చిన్నయ్య కేకే అని పోల్పేసుకున్నాడు. “ఆఁ రావయ్యా! నిద్రపోలా!” అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య,“రాత్రుళ్ళు కూడా నీ మిలిటీ సెల్యూట్లేనా మిలిట్రీ వదిలేసినా, ఇంకా ఆ డ్రెసులూ వీశడు బరువు బూట్లు, మిలిటీ సెల్యూట్లూ మానవు గదా….. రావయ్యా!…… భోంచేశావా?” అనడిగాడు దశరధరామయ్య..“ఇప్పుడే అయింది బాబూ, చుట్ట కాల్చుకుందామని బైటికొచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్తు మంచిదికాదు. ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం ఇంతవరకూ పని చేస్తే ఒళ్ళు పాడైపోతాది, ఇంటికెల్లి పడుకోండి బాబూ, అమ్మగారొక్కరూ బితుకు బితుకు మంటుంటారు”.“అప్పుడే ఎక్కడయ్యా? ఇంకా నన్ను తగలెట్టినంత పనుంది. ఒంట్లో బాగా లేదని పంచేయడం మానేస్తే ఊరుకుంటారా? అందులోనూ రిటైరైనవాడ్ని, కనికరించి తిరిగి వేసుకున్నారు. సరిగా పని చెయ్యకపోతే పీకి పారెయ్యరూ……..”“బాబూ! ఇప్పుడు మీకు అరవై దాటుంటాయనుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళిలా కష్టపడతారు?”“చచ్చేవరకూ……! తప్పదు చిన్నయ్యా, చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని చెయ్యక తప్పదు. లేకపోతే నాకు, నా పెళ్ళానికి ముద్ద ఎలా గడుస్తుంది. ఊళ్ళో చదువుకుంటున్న నా కొడుకును ఎవరు చూస్తారు?” అని బరువుగా భయంగా నవ్వి టెంటు లోకిపోయి కళ్ళు తడుచుకుంటూ కాయితాల ముందు కూర్చున్నాడు దశరథరామయ్య. కంట్రాక్టరు బిల్లులోని వేలు, లక్షల రూపాయలు – అతని కళ్ళకు గజిబిజిగా కనిపించాయి.. “ఏవిటో, పంతులు బ్రతుకు” అంటూ సానుభూతిగా పెదవి విరిచి చుట్ట కాల్చుకోడానికి మంటదగ్గరకి నడిచాడు చిన్నయ్య. మంచు బాగా కురుస్తుండడంవల్ల మంటలు సన్నగిల్లి పోతున్నాయి. పనస చెట్టుమీదనుండి ఉండుండి మంచు బొట్లు మంటల మీదపడి సుయ్ సుయ్ మంటున్నాయి. నీరసించిపోతున్న మంటని బూటుతో తన్ని ఎగదోశాడు చిన్నయ్య, చిటపటమంటూ నిప్పురవ్వలు ఉవ్వెత్తున లేచాయి. పక్కనున్న ఎండుపుల్లల్ని, ఆకుల్ని ఏరి తెచ్చి మంటలో పడేసి రెండు మూడుసార్లు మళ్ళా బూటుతో తన్ని ఎగదోశాడు. పనస చెట్టు మొదట్లో కూర్చుని చుట్ట తీసి, మంటలోనుంచి ఒక కొరకంచు పుల్లతీసి వెలిగించుకున్నాడు చుట్ట. భగ భగ మని చుట్టపొగ వదుల్తూ సెగ కాచుకుంటున్నాడు. ఫళఫళమంటూ, ఎత్తుగా లేస్తున్న మంటలకి అందుబాట్లోనున్న పనస ఆకులు మాడిపోతున్నాయి.ఉండుండి కొండ గొర్రె అరుస్తూనే ఉంది. కొండల్లో నుండి పొగ వాసనతో నిండిపోయింది ఆ ప్రాంతమంతా. గాలేసినప్పుడల్లా చెట్టుకి పండిన బురదపనస మత్తు వాసనల్ని గుభాళిస్తోంది. ఉండుండి…… మంటల్లోని నిప్పులు చట్ ఛట్ మని పేలుతున్నాయి.చిన్నయ్య తన ఎడంవైపు టెంటు లోకి చూశాడు, ఎవరైనా మేలుకునున్నారేమోనని, అది దశరథరామయ్య కుటుంబం ఉండే టెంటు. లైటు బాగా దించేసుంది. “పంతులమ్మగారు పడుకునుంటారు ఫరవాలేదు” అని చుట్టి పారేసి మెల్లగా జేబులోంచి సీసా తీశాడు. వాటర్ సీసాలో పోసి తెచ్చుకున్న నాటుసారాని డగ్ గ్ మని రెండు గుటకలు మింగాడు. అసహ్యంగా ” బ్రేవు”మని తేన్చుకుంటూ సీసావెపు చూశాడు. మీసాలకి అంటుకున్న సారా బొట్టుని కాసేపు అనుమానంగా నాలికతో చప్పరించాడు. పరీక్షగా రెండు మూడుసార్లు బుడ్డీ లో సరుకుని వాసన చూసి, మిగతా సీసాని మరి రెండు గుక్కల్లో గబగబా ఖాళీ చేసి, ఖాండ్రించి ఎదురుగా వున్న మంటల్లోకి తుపుక్కున ఉమ్మాడు. “చత్! చప్పగా ఉంది” అని విసుక్కుంటూ, సీసా అడుగుని మిగిలున్న అయిదారు చుక్కల్నీ నిప్పుల మీదికి జాడించాడు. అవి సుయ్ సుయ్ మని నీరసంగా వెలిగి ఆరిపోయాయి..“దొంగనాయాల గాడు నీరు కలిపేశాడు. ఈ సివిలు నాకొడుకులింతే కల్తీ లేకుండా….. ఏ సరుకూ అమ్మరు గదా? మిలిట్రీ వోళ్ళకి ఆర్డరిచ్చిస్తేనా, ఇలాంటోళ్లని ఫైర్ చేసి పారేస్తారు……. అబ్బే కొంచమైనా ఫోర్సు ఎక్కలేదు…… దొంగనాయాలగాడు” అంటూ ఖాళీ సీసాని వెనకాల తుప్పల్లోకి విసిరేసి, కాళ్ళు రెండూ….. మంటలవైపు చాచి డిజప్పాయింటెడ్ గా పనసచెట్టు మొదలుకి చారగిలబడిపోయి మరో చుట్ట వెలిగించాడు చిన్నయ్య. చెమటపట్టిన మొహం మంట వెలుగులో ఎర్రగా కందగడ్డలా కనిపిస్తోంది.చిన్నయ్య అసలు పేరు ఆ కేంపులో చాలా తక్కువ మందికి తెలుసును. అంతా “మిలట్రీ మాన్” అని పిలుస్తారు. అది విని మురిసిపోతాడు చిన్నయ్య. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసి పింఛను పుచ్చుకున్నాడు. తరువాత అస్సాం నూనెగనుల్లో కొన్నాళ్ళు పనిచేశాడు. ప్రస్తుతం టెమ్పరరీ జీపు డ్రయివరుగ కేంపు నెంబరు -4, అసిస్టెంటు ఇంజనీరు దగ్గర పనిచేస్తున్నాడు. అతనికి మిలిట్రీ అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు, మనిషంటే మిలిట్రీ వాడే మనిషి అంటాడు. మిగతావాళ్ళు “సివిలోళ్ళు” అని చులకనగా చూస్తాడు. మిలిట్రీ వాళ్ళు తమ దేశం కోసం ఫైట్ చేస్తే, సివిలోళ్ళు పొట్ట కోసం దేవిరిస్తారంటాడు. మిలిట్రీవాళ్ళు నిస్వార్థంగా పనిచేసే నీతి నిజాయితీగల “సీదా ఆద్మీ”అని సివిలోళ్ళు “బద్మాష్ ఆద్మీ”అనీ ఏదో థీసిస్ చెప్తాడు.తుఫాను పట్టినా సరే, ఆ వయసులో తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచిపోయి కసరత్తు చేస్తాడు. ఆరో గంటకల్లా స్నానం చెయ్యడం, బూట్లు పాలిష్ చేసుకోవడం. మీసాలకు రంగెక్కించుకోవడం పూర్తి చేసుకుని నాస్తా చేసి మగ్గుడు టీ తాగి, ఆరున్నరకి ఠంచనుగా ఇంజనీరుగారి దగ్గరికి హాజరవుతాడు. వెళ్ళేముందు జార్జి చక్రవర్తి, సుభాసు బోసు పటాలకి, రకాలుమని బూట్లు కొట్టి అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చెయ్యనిదే బయల్దేరడు.మంటకాంతిలో దగ్గర్లో వున్న తుప్పలు, పనస చెట్టు సగం భాగం, పది పన్నెండు గజాల లోపుగానున్న చెట్ల మొదళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. పనస చెట్టు నీడ పడుతూండడంవల్ల దానికి కాస్త వెనకాల ఎడమవైపుగా నున్న పంతులుగారి టెంటు మసగ్గా కనిపిస్తోంది. చుట్టూ చిక్కని చీకటి అల్లుకునుంది. చిన్నయ్య మంటకి దగ్గర్లో ఉండడంవల్ల ఆ వెలుతురుకి అలవడ్డ కళ్ళకి చుట్టూవున్న చీకటి మరింత దట్టంగా కనిపిస్తోంది. చిన్నయ్య ఏమీ తోచక మంటల్లోకి, చుట్టూ ఆవరించుకున్న కటిక చీకట్లోకి, దూరంగా కొండల మీద కాలుతున్న అడవుల్లోకి చూస్తూ చుట్టమీద చుట్ట లాగించేస్తున్నాడు. ఉండుండి ఆఫీసు టెంటులోంచి దశరథరామయ్యగారి దగ్గులు వినిపిస్తున్నాయి. ..“ఏం చిన్నయ్యా! భోజనం అయిపోయిందేవిటి? కేంపునుండి ఎప్పుడొచ్చేవు అని పంతులుగారి భార్య పక్క టెంటు గుమ్మంలో నుండి పలకరించింది.“దండాలమ్మా, అరగంటయిందండీ వచ్చి, జీపు షెడ్డులో పెట్టి భోంచేసి ఇప్పుడిప్పుడే చుట్ట కాల్చుకుందామని ఇక్కడికొచ్చాను. పొద్దుట్నుండి తిరిగి తిరిగి నడుం లాగేస్తుంటే ఈ చెట్టుకి కొంచెం చేరబడ్డాను”.“ఏం నంజుకున్నావయ్యా? నీ కోసం పెరుగు పచ్చడి దాచాను”. కసురుకున్నట్లుగా అడిగిందావిడ.“ఛఛ! ఎందుకమ్మా మీకా బాధ? మీ ముసలి కడుపులు గడుపుకోవడమే ఈ రోజులో కనాకష్టంగా వుంటే మళ్ళా దానాలు…. ధర్మాలూ”చిన్నయ్య మాటల్ని మధ్యలోనే త్రుంచిందావిడ, “చాల్లే! దానాలా, నీకియ్యడం దానమెందుకయింది?” అంది. అంతకంటే ఎక్కువగా మాటల్లో తన కృతజ్ఞతను చెప్పుకోవడం ఆవిడకి చేతనైంది కాదుగానీ, మనసు నిండా చిన్నయ్యంటే ఆమెకి గొప్ప గౌరవం, అభిమానం. ‘ఆమె కన్న చూపే కాదు, ఆ కేంపులో అన్ని సంసారాలకు పెద్ద దిక్కు చిన్నయ్య! అందరి కుటుంబాలు వారి వారి టెంటుల వరకే పరిమితమైతే ఆ కేంపంతా చిన్నయ్య కుటుంబమే! అది మిలిట్రీ స్పిరిటంటాడు. కేంపులున్నప్పుడు పొద్దుటనగా బండి తీసినవాడు ఏ అపరాత్రికో ఇల్లు చేరుకుంటాడు. ఎటూ వెళ్ళక్కర్లేక పోయిన రోజులోనైనా ఊరుకోడు. ఆ టెంటులన్నీ తుడిపించడం, మలేరియా మందు చల్లించడం చిన్న పిల్లలందర్నీ చెరువుకి తీసుకెళ్ళి స్విమ్మింగు, డైవింగు చేయించి తీసుకు రావడం వగైరా పనులన్నీ నెత్తిన వేసుకుంటాడు. పట్నం ప్రయాణం పడినప్పుడు, ప్రతి టెంటు దగ్గరికి పనిగట్టుకు వెళ్ళి ఆ ఇళ్ళలో అవసరమైన సామాన్లు కనుక్కుని పెద్ద లిస్టు రాసుకుని, పట్నంనుండి పట్టుకొస్తాడు.అందుకే పిల్లల దగ్గర్నుండి పెద్దవాళ్ళవరకూ అతనంటే అమితమైన గౌరవం. అందుకే అతను జీపు డ్రైవరు చిన్నయ్య కాడు! మిలిట్రీ చిన్నయ్య!“అన్నట్టు చిన్నయ్యా మీ పంతులుగారు...

NOW PLAYING

Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

0:00 30:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 30 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on February 13, 2023.

What is this episode about?

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!