'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం episode artwork

EPISODE · Feb 18, 2022 · 19 MIN

'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం

from Harshaneeyam

'పది రోజులు' అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని   శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు 'ఐదు కాళ్ళ మనిషి'.శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో పాటూ అనేక యూరోపియన్ దేశాల్లో , నార్త్ అమెరికా లో కూడా ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేశారు. చాలా మంచి కథారచయిత. ఆయాదేశాల్లో తనకు  ఎదురైన జీవితాలపై, అనుభవాలపై కథలు రాసారు. ఇప్పుడు  మీరు వినబోయే కథ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఆయనకెదురైన ఒక వ్యక్తి గురించి.పుస్తకం కొనడానికి కింది లింక్ ని ఉపయోగించండి.  https://harshaneeyam.captivate.fm/aidu‘పది రోజులు’ఇస్లామాబాద్ ఎనిమిది భాగాలుగా నిర్మించబడ్డ నగరం. అక్కడ ఎఫ్ ప్రాంతంలో అద్దె ఇళ్ళు దొరకడం అన్నది బ్రహ్మ ప్రళయం అనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగులు, మిలిటరీ అధికారులు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారూ మాత్రమే అక్కడ ఇళ్ళు కట్టుకుని నివసిస్తుంటారు. కాబట్టి అద్దె వాటాలన్నవి తక్కువ. ఉన్న కొన్నిటికీ అవి ఖాళీ కాక ముందునుండే టెనంట్లు ఎదురు చూస్తుంటారు. ఏ గొప్ప ప్రభుత్వాధికారికో ముందరే చెప్పివుంచి ఓ ఐదారు నెలలు కాచుకునుంటే ఇల్లు దొరకచ్చు. అలాంటి ఒక ప్రయత్నంతోనే నేను అక్కడొక ఇల్లు వెతుక్కుని అద్దెకు దిగాను.ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఎండగా వున్నప్పుడు డాబా మీదకెక్కిచూస్తే మర్గెల్లా  కొండలు కనబడుతాయి. వీధులు, రోడ్లు ఒకదానికొకటి సమకోణంలో ఉంటాయి. ఎత్తయిన మేడ మీదనుండి చూస్తే ఊరంతా చతురస్రాల్లా కనబడుతుంటుంది. మావీధి మొత్తం నేరేడు చెట్లు వుండటం వల్ల ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మార్కెట్టూ, షాపులూ లేకపోవడంతో వాహనాల రద్దీ, కాలుష్యం, దుమ్ము ఉండవు. వీధులు శుభ్రంగా ఉంటాయి. అలా ఉండటం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ ఏ వస్తువు కావాలన్నా దూరానున్న బజారుకు వెళ్లాల్సివుంటుంది. ఒక మంచి ఇల్లు దొరికేప్పుడు ఒకటి ఉంటే మరొకటుండదన్నది తెలిసిందే కదా!సాయంకాలం సరిగ్గా ఆరవ్వగానే ఒక్కొక్క ఇంటికీ ఒక్కో చౌకీదార్ వచ్చేవాడు. వారి చేతుల్లో ఒక రూళ్ళ కర్ర, రగ్గు, రాత్రి భోజన సంచీ, టార్చిలైటు ఉండేవి. ఒకరికొకరు అభివాదం తెలుపుకుని, కుశల ప్రశ్నలు పూర్తయ్యాక గుంపుగా నమాజ్ చేసేవాళ్ళు. తర్వాత, గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న భోజనం సంచులు ముందు పెట్టుకుని తినేవాళ్ళు. నిలబెట్టివుంచిన నులక మంచాలు వాల్చుకుని దమ్ము  కొట్టేవాళ్ళు. ఇంటి యజమానులు నిద్రపోయిన ఐదో నిముషం నిద్రపోయేవాళ్ళు.  మరుసటి రోజు తెల్లవారుఝామున ఇంటి యజమాని లేవడానికి ఐదు నిముషాలు ముందే నిద్రలేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవారు.మా వీధిలో ఒక బడ్డీ కొట్టు ఉండేది. నాకు ఆ వీధిలో దొరికిన మొదటి స్నేహితుడు ఆ కొట్టతనే. పేరు నవాజ్. ఉదయం ఆరు గంటలకి కొట్టు తెరిస్తే రాత్రి ఎనిమిదికి కట్టేసేవాడు. వారంలో ఏడు రోజులూ వ్యాపారం జోరుగా సాగేది. ఉదయం నుంచీ వాడి దగ్గరకు పేపరు, పాలు, పాన్, సిగరెట్, బ్లేడ్- ఇలా ఏదో ఒకటి కొనేందుకు ఆ వీధివాసులు వస్తూనే ఉంటారు. నవ్వు ముఖంతో హుషారుగా వస్తువులందిస్తూ డబ్బు తీసుకుంటూ ఉంటాడు నవాజ్.1960లో అయూబ్ ఖాన్ ఇస్లామాబాద్ నగరాన్ని నిర్మించి పాకిస్తాన్ రాజధానిగా చేశాడు. అన్ని రకాలుగానూ ప్లాన్ చేసి అన్ని సౌకర్యాలతోనూ నిర్మించబడిన నగరం కాబట్టి పచ్చని చెట్లతోను, చుట్టూ కొండలతోనూ కళకళలాడుతుంటుంది. నగరం నిర్మించిన తొలి రోజుల్లో నవాజ్ తండ్రి ఆ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. అతనికి జబ్బు చేయడంతో నవాజ్ ఈ కొట్టు బాధ్యతని తన భుజాలకెత్తుకుని నడుపుతున్నానని నాతో చెప్పాడొక రోజు.ఎన్నేళ్ళయిందని అడిగాను. “నా పద్దెనిమిదో ఏటనుండి ఉన్నానిక్కడ. ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది. ఇరవైయేళ్ళు! సంవత్సరంలో 365 రోజులూ పనిచేస్తున్నాను. ఇక్కడ నివసించే అందరూ, వాళ్ళ పిల్లలూ, మనవళ్ళూ అందరూ తెలుసు నాకు!” అన్నాడు.నవాజ్ స్వగ్రామం లైలాపూర్. అది ఇస్లామాబాదు నుండి 160 మెళ్ళ దూరానుంది. ముసలివాళ్లయిన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళేవాడు కాడు నవాజ్. వాళ్ళేవచ్చి చూసి వెళ్ళేవారు. 'సంవత్సరమంతా విరామం లేకుండా పని చేసేవాడు, ఎలా వెళ్ళగలడు?” అని నన్నే అడిగేవాడు.“నవాజ్, నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు?" ఒక రోజు అడిగాను. .“పేదవాళ్ళు ఉన్నపళంగా పెళ్ళి చేసుకోలేరు. అమ్మాయికి కన్యాశుల్కం ఇవ్వడానికి డబ్బులు కూడబెట్టాలి,” అన్నాడు.అలా చెప్తున్నప్పుడు వాడి కళ్ళు కొట్టు పలకలకు అంటించివున్న ఎందరో  హిందీ సినిమా నటీమణుల పోస్టర్ల మీద ఒక క్షణం వాలి తిరిగొచ్చాయి. డింపుల్ కపాడియా, నీతూ సింగ్, పర్వీన్ బాబి, పూజా భట్, శ్రీదేవి, నీలమ్ అని అప్పట్లో పాకిస్తాన్ లో కూడా ప్రసిద్ధులైన నటీమణులందరూ అక్కడ వరుసగా వాడికోసం వేచివున్నారు.“నిన్ను మీ అమ్మానాన్నలు బడికి పంపించలేదా?” అడిగాను.“ఏదో పంపించారు. ఉర్దూ కొంచం రాయడానికీ చదవడానికి వచ్చు. లెక్కల్లో కూడిక, తీసివేత మాత్రమొచ్చు. గుణించడం రాదు. మా తలిదండ్రులకి ఆర్థిక స్తోమత లేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, మా ఇంట్లో కోడి మాంసం తినాలంటే నాకైనా జబ్బు చెయ్యాలి, లేదా కోడికైనా జబ్బు రావాలి...” నేరేడు పళ్ళ అదనులో ఆ వీధంతా నేరేడు పళ్ళు నేల రాలేవి. అయితే వాటిని ఏరుకోడానికి పిల్లలు ఉండరక్కడ. అక్కడ నివసించే పిల్లలందరూ నాగరికులు. వీధిలో పడిన వాటిని ఏరుకునే స్వతంత్రం లేదు వాళ్ళకు. కొట్టు బయట నిల్చుని సరుకులమ్మే  నవాజ్ నెత్తిన రోజుకు వంద పళ్ళయినా రాలేవి. దాంతో వాడి తెల్లటి సల్వార్ కమీజ్ ఊదా రంగులోకి మారిపోయేవి. అలాంటప్పుడు ఎండకి ఎర్రగా మెరిసే దేహంతో, వెనక్కి దువ్విన పొడవాటి జుట్టుతో పంజాబి నటుడిలా అందంగానే కనిపించేవాడు.అలాంటొక నేరేడు పళ్ళ సీజన్ లో నేను ఆఫీసునుండి వెనక్కి వచ్చేసరికి నా ఇల్లు కనిపించలేదు. వీధి పేరు చూస్తే, నేనుంటున్న వీథే! అయితే వీధినంతా ఆక్రమించి పందిరి వేసేశారు. నేను కారునలా నిలబెట్టి ఏం చెయ్యాలా అనిఆలోచిస్తుంటే, నా ఇంటి ఓనర్ పదవీ విరమణ చేసిన మిలిటరీ మేజర్, నగిషీ పనిచేసి వున్న ఖరీదైన చెప్పులు వేసుకుని, చేతికర్ర తిప్పుకుంటూ నాదగ్గరకొచ్చాడు. నాకు వణుకు మొదలైంది.వచ్చిన కొత్తల్లో కొన్నిసార్లు మేజర్‌తో మాట్లాడాను. మనం ఏది చెప్పినా దానికి విరుద్ధంగా ఒక అభిప్రాయం చెప్పేవాడతను. అలా ఒక ఎన్నటికీ కొలిక్కిరాని వివాదమొకటి మొదలయేది. సంభాషణల్లో పొరపాటున కూడా బంగ్లాదేశ్-పాకిస్తాన్యుద్ధం గురించిన ప్రస్తావన తీసుకురాకూడదు.  తెస్తే, మనిషిలో భావావేశం కట్టలు తెంచుకుని పొంగిపొరలుతుంది. మనిషి నేలమీద నుండి ఒక అడుగు పైనే తేలిపోగలడు. మనం అతని అభిప్రాయాలన్నిటితో ఏకీభవించాక కూడా ఓ అర్ధగంట చర్చని కొనసాగించగలడు.అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చి పెట్టుకుంటూ 'తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మని  ప్రాధేయపడ్డాడు. నా ఒక్కడి కారే కాదు,  ఆ వీధిలో అందరి కార్లూ వీధి చివర  ఉన్నాయి. కార్లను చూసుకోడానికని ప్రత్యేకించి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుంచాడు.మరుసటి రోజు పొద్దున నాకు మరో ఆశ్చర్యం ఎదురయింది. బడ్డీకొట్టు  కనిపించలేదు. అదున్న చోటు ఖాళీగా ఉంది. నవాజ్ ఎక్కడ అంటే జవాబివ్వడానికి నసుగుతున్నారు. ఆ వీధి వాసులకు ఆ రోజు పేపర్, పాలు, పాన్, సిగరెట్-ఏవీ దొరకలేదు. దూరానున్న బజారుకెళ్ళాల్సొచ్చింది. పందిరి వెయ్యడానికి అడ్డంగా ఉందంటూ బడ్డీని తీసేయమని చెప్పారట. నవాజ్ రెండు రోజులు వ్యవధి అడిగాడట. వాళ్ళు ఇవ్వకపోగా, బడ్డీ కొట్టుని పగలగొట్టి అతణ్ణి తరిమేశారట. పాకిస్తాన్లో మామూలుగా మాట్లాడేప్పుడు ఉర్దూలో మాట్లాడుకుంటారు. ఎవరినైనా తిట్టాలనుకుంటే మాత్రం పంజాబీ అందుకుంటారు. ఎందుకంటే పంజాబీ తిట్టడానికే సృష్టించబడిన భాష అన్నది వాళ్ళ అభిప్రాయం. ఆ రోజు మేజర్ పంజాబీలో తిట్టాడు అన్న విషయం ముఖ్యాంశంగా మాట్లాడుకున్నారు జనం.పెళ్ళి ఇంటి ఏర్పాట్లు బహు ఘనంగా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రకరకాల షామియానాలూ, జరీ తెర అలంకారాలూ, రంగురంగుల లైట్లూ కళ్ళకు కొడుతున్నాయి. లాహోర్  నుండి తెప్పించిన ఎరుపు, తెలుపు, పచ్చ రంగు గులాబీలు కుప్పలు కుప్పలుగా పోసివున్నాయి. ఈ వేడుకలన్నీ నాలుగు రోజులు జరుగుతాయని ప్రకటించారు. నా పోర్షన్ మీటర్ బాక్స్ నుండి కరెంటు తీసుకుని స్తంభాలకూ చెట్లకూ లౌడ్ స్పీకర్లు కట్టి సినిమా పాటలు మ్రోగించారు. పాటల మోతకి ఇళ్ళలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా వినిపించేది కాదు. ఆ మోత ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగింది. అప్పుడే విడుదలయిన మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ నటించిన ఖలనాయక్ సినిమా ఇస్లామాబాద్లోని థియేటర్లలో విజయవంతంగా ఆడుతూఉంది. అందులోని చోళీకే పీచే క్యా హై అన్న ప్రసిద్ధమైన పాటని కనీసం రెండు వందల సార్లయినా మోగించారు. ఎవరైనా వచ్చి చోళి విప్పి చూపితేగానీ ఆపరేమో అనిపించింది. నా మీటర్ బాక్స్ నుండి అరువుకు తీసుకున్న కరెంట్ తోనే ఈ పాటలు మోగిస్తున్నారు. దీన్ని ఎప్పుడైనా ఆపించే శక్తి నాకుంది అనుకోగానే నాకు నవ్వొచ్చింది.ఇన్ని ఇబ్బందుల మధ్యన కూడా ఒక ఊరట ఏంటంటే, సాయంత్రమయ్యే సరికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాల్లో రకరకాల ఆహార పదార్థాలు వడ్డించి, వాటి మీద అందమైన వెండిరేకు కప్పి ఆ వీధిలో ఉన్న అందరి ఇళ్ళకీ సరపరా చేయబడ్డాయి. పెళ్ళికని వీధిని ఆక్రమించుకున్న ఆ నాలుగు రోజులూ రుచికరమైన ఆహార పదార్థాలు ఎన్నోరకాలు, మేజర్ గారి ఇంటినుండి అందరి ఇళ్ళకీ వచ్చాయి. వీధివాసులెవరూ వారివారి ఇళ్ళల్లో వంటలు చెయ్యలేదు. చౌకీదార్లు వారి భోజనాల సంచులు తెచ్చుకోలేదు. నందికోట్ నుండి రప్పించబడిన వంటవాళ్ళు వండిన ఆహార పదార్థాల రుచి జీవితాంతం మరిచిపోలేమన్న విషయంలో ఆ వీధిలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు.పెళ్ళికూతురిని ఇంటికి తీసుకొచ్చిన మరుసటి రోజు రాత్రి, ప్రసిద్ధ ఖవ్వాలి గాయకుడు నుస్రత్ ఫతే అలీఖాన్ తన పరివారంతో వచ్చాడు. తను పాడటానికి రాలేదు. మేజర్ కి బాగా దగ్గరివాడు అని చెప్పుకున్నారు. అయితే ఈ వార్త నిప్పులా నలుమూలలా పాకింది. చుట్టుపక్కల జనాలంతా మా వీధికొచ్చేశారు. మేజర్, అతణ్ణి ఒకే ఒక్క పాట పాడమని వేడుకున్నాడు. నుస్రత్ ఇలాంటి పెళ్ళి వేడుకల్లోనో మరోచోటో పాడడు అన్నది అందరికీ తెలుసు. అయితే తన స్నేహితుడి కోరిక మేరకు తన నియమాన్ని పక్కనబెట్టి ఒకే ఒక ఖవ్వాలి పాడాడు. అతని కంఠం నుండి వెలువడిన పాట అక్కడి జనాలని మంత్రం వేసినట్టు కట్టిపడేసింది. పాట పూర్తవ్వగానే జనాలు కొట్టిన చప్పట్లు ఆగడానికి చాలా సమయం పట్టింది. వీధిలోనే కాదు వీధికి అవతలవరకు నిల్చుని విన్నారు ఆ పాటని. 'మరొక పాట!' అని అరిచారు. నాకు మాత్రం తిల్లానా మోహనాంబాళ్ సినిమాలో సింగపూర్ జమీందార్ బంగ్లా  ముందు శివాజీ గణేశన్ నాదస్వరం వాయించిన దృశ్యం గుర్తొచ్చింది.ఐదారు రోజుల తర్వాత ఆ పందిరి విప్పినప్పుడు ఉన్నట్టుండి ఇది మన వీధికాదేమో అన్నట్టు బోసిపోయింది. నాలుగు రోజుల వేడుకలనంతరం మేమెవరం మామూలు స్థితికి రాలేకపోయాం . నా ఇంటి మీటర్ బాక్స్ నుండి కరెంట్ తీసుకుని మోగించిన మోత ఆగిపోయింది. ఆ మోతకి అలవాటుపడిన చెవులకి ఈ నిశబ్దం అలవరుచుకోడానికి సమయం పట్టింది. ఇత్తడి పళ్ళాల్లో వచ్చే రుచికరమైన భోజనాలు ఆగిపోయాయి. తెల్లవారంగానే ప్రతి ఇంటివారూ బడ్డీ కొట్టు నవాజ్ వచ్చేశాడా అని వచ్చిచూసేవారు. పది రోజులుగా వాడు లేడు. సరిగ్గా పదకొండవ రోజు ఉదయం కొత్తగా ఒక బడ్డీ కొట్టు...

Episode metadata supplied by the publisher feed · Published Feb 18, 2022

Embed this episode

NOW PLAYING

'పది రోజులు' - శ్రీ అప్పాదురై ముత్తులింగం

0:00 19:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 19 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on February 18, 2022.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!