EPISODE · Nov 12, 2022 · 3 MIN
పద్మనాభం | Padmanabham | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పద్మనాభం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమిటీ అలా కదలకుండా పడుకున్నారు..? టైం పది అయ్యింది, లేవండి. మరీ బద్ధకం ఎక్కువ అయ్యింది ఈ మధ్య!” అంటూ గలగలా మాట్లాడేస్తోంది కమల. “అప్పుడే ఎందుకు లేచావు కోడిలాగా.. ఈ రోజు గ్రహణం, కదలకుండా పడుండాలి” అన్నాడు పద్మనాభం. “అయ్యో రాత, చూడక చూడక ఒక్కసారి నిన్న భక్తి టీవీ చూసారు. ఏమి విన్నారో ఏమిటో! అందులో చెప్పింది గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలి అని.. మీరెందుకు, మనవలు వుండి..?” అంది నవ్వుతూ కమల. “ఏడిచినట్లు వుంది వాళ్ళు చెప్పింది. గర్భిణీలకా..! ఏదీ వివరంగా చెప్పరు. యివ్వాలిసిన దానాల గురించి తప్పా.. అనవసరంగా కదలకుండా పడుకునే సరికి కాళ్ళు చేతులు బిగసుకు పోయాయి” అంటూ మెల్లగా లేచి నుంచుని, మళ్ళీ మంచం మీద పడిపోయాడు పద్మనాభం. కమల కంగారు పడుతూ “ఏమైంది? మెల్లగా లేవండి. పెద్ద.. ఒక గంట కూడా కాలేదు గ్రహణం మొదలై.. ఈ కాస్తకేనా ఈ నాటకాలు?” అంటూ మళ్ళీ పైకి లేపి, “మీ నాన్నగారు సరైన పేరు పెట్టారు- ‘పద్మనాభం’ అని” అంది నవ్వుతూ. “చాలు.. ఆపు నీ ఎత్తిపొడుపులు. మార్నింగ్ వాకింగ్ లో ఈ పాటికి పది కిలోమీటర్లు వెళ్ళివుండే వాడిని. అనవసరంగా టీవీ వాళ్ళు నన్ను కన్ఫ్యూస్ చేసారు” అన్నాడు పద్మనాభం ఒళ్ళు విరుచుకుంటో. “అవును.. ‘వెళ్తే’ కానీ ఎప్పుడైనా సూర్యోదయం చూస్తేగా తమరు? రేపటినుండి అయినా నడక మొదలు పెట్టండి, లేదంటే ఆపొట్ట తో నిజంగా పడుకోవాలి. కరెక్ట్ గా సూట్ అవుతుంది గ్రహణం రోజులకి” అంది పక్కున నవ్వుతూ కమల. “అవునోయ్! రేపటినుండి వాకింగ్ మొదలుపెట్టాలి. సాయంత్రం వెళ్ళి షూస్ కొనుక్కుంటా” అన్నాడు పద్మనాభం బ్రష్ నోట్లో పెట్టుకుంటో. “ఆలా అని చెప్పి అమెరికాలో మీ అమ్మాయి చేత నాలుగు రకాల షూస్ కొనిపించుకుని, ఒక్కటీ వేసుకోవడం లేదు. అవి వాడండి చాలు. అయినా మీ విషయం నాకు తెలియదా! నడిచి వెళ్లడం, వచ్చేడప్పుడు ఆటోలో రావడం. మీరూ, మీ మార్నింగ్ వాక్” అంటూ పొగలు కక్కుతున్న కాఫీ గ్లాస్ అందించింది మొగుడి చేతికి. కాఫీ తాగుతూ, “ఈ రోజు టిఫిన్ ఏమిటి?” అన్నాడు పద్మనాభం. “టిఫిన్ తినకూడదు, గ్రహణం విడిచిన తరువాత ఒకేసారి అన్నం వండుతాను. అప్పటి వరకు ఓపిక పట్టండి” అంది కమల. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/AtbngmYMwFM
Embed this episode
NOW PLAYING
పద్మనాభం | Padmanabham | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.