పెళ్లిచూపులు | Pellichupulu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 28, 2022 · 9 MIN

పెళ్లిచూపులు | Pellichupulu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్లిచూపులు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాజేష్ ఆష్ట్రేలియాలో ఒక పెద్ద బేంక్ లో ఉన్నత పదవిలో అయిదు సంవత్సరాలనుండి ఉద్యోగం చేస్తున్నాడు. ఐఐటి ఖరగ్ పూర్ లో చదివాడు. చాలా తెలివైనవాడు. అంతేకంటే ముఖ్యంగా జీవితపు విలువలు బాగా తెలుసున్నవాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన రాజేష్ కు తను ఎంత కష్టపడి చదివి పైకి వచ్చాడో, దాని వెనుక అతని తల్లితండ్రుల కష్టం, త్యాగం అన్నీ గుర్తు ఉన్నాయి. రాజేష్ తల్లి కల్యాణి కూడా ఉద్యోగం చేసేది. తండ్రి ప్రకాశ్ రావు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఎప్పుడూ ఆఫీస్ టూర్లంటూ తిరిగేవాడు. తల్లి పొద్దుటే లేచి అన్ని పనులూ పూర్తిచేసుకుని తనను, తమ్ముడిని తయారు చేసి స్కూల్ కు పంపి తను హడావుడిగా ఆఫీసుకి పరుగెత్తేది. నాన్న ఊళ్లో లేని కారణంగా అన్నీ తనే చూసుకోవలసి వచ్చేది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలతో సతమతమౌతూనే పిల్లల పెంపకం విషయంలో ఎంతో శ్రధ్ద తీసుకునేది. తమ చదువుల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటూ శ్రధ్దగా దగ్గర కూర్చుని చదివించేది. తనకు ఐఐటి ఖరగ్ పూర్ లో సీట్ వచ్చినపుడు ఆనందంలో అమ్మ కళ్లనుండి జాలువారిన ఆ కన్నీటి బొట్లను తనెప్పటకీ మరచిపోలేడు. ఐఐటి పూర్తి అయిన తరువాత ఎమ్. ఎస్ కి యూ. ఎస్ వెడతావా అని అమ్మ అడిగితే వెళ్లనని చెప్పేసాడు. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బేంక్ లో మంచి పేకేజ్ తో జాబ్ వచ్చింది. కొన్నాళ్లు అక్కడ పనిచేసి తరువాత ఇండియా వచ్చేసి ఇక్కడే జాబ్ చేస్తూ తన తల్లితండ్రులతో కలసి ఉండాలనేదే అతని ధ్యేయం. రాజేష్ తల్లితండ్రులు కొడుక్కి పెళ్లిచేసేయాలన్న తలంపులో ఉన్నారు. ఇంకో రెండు మూడేళ్లు ఆగేక చేసుకుంటానన్న రాజేష్ తో 'అలా కాదు రాజేష్! మేమూ పెద్దవాళ్లం అయిపోయాం. స్తిరపడ్డావు కదా, తమ్ముడి చదువు పూర్తయింది. వాడుకూడా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. నీ పెళ్లి బాధ్యత తీరిపోతే మేమూ కాస్త రిలాక్స్ అవుతా’మని నచ్చచెప్పేసరికి, మీ ఇష్టం అంటూ సమాధానమిచ్చాడు. రాజేష్ మూడు వారాలు శెలవు మీద హైద్రాబాద్ కి తల్లీతండ్రీ తో గడపాలని వచ్చాడు. అప్పటకి రెడీ గా పెట్టుకున్న రెండు సంబంధాలను చూసివచ్చారు రాజేష్ తో కలసి. రాజేష్ కు అవేమీ నచ్చలేదు. ఒక రోజు బెంగుళూర్ నుండి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి తల్లితండ్రులు రాజేష్ తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడి పెళ్లిచూపులకు రావలసిందిగా ఆహ్వానించారు.. అమ్మాయి ప్రొఫైల్ బాగుంది. ఆ అమ్మాయి ఫొటో కూడా రాజేష్ కు నచ్చింది. రాజేష్ పిన్ని బెంగుళూర్ లో ఉంటున్న కారణంగా రాజేష్ వాళ్లూ పిన్ని ఇంట్లో దిగారు. ఆ మరుసటి రోజు రాజేష్ కు అపర్ణకూ బెంగుళూర్ లో పెళ్లి చూపులైనాయి.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vhu32wq556w

Episode metadata supplied by the publisher feed · Published Dec 28, 2022

Embed this episode

NOW PLAYING

పెళ్లిచూపులు | Pellichupulu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 9:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!