EPISODE · Dec 10, 2022 · 16 MIN
పెరటి చెట్టుపై వాలిన పక్షి | Perati Chettupai Valina Pakshi | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెరటి చెట్టుపై వాలిన పక్షి రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కోదండం గారు అన్న మాటలకి ఆంజనేయులు తలవంచుకున్నాడు. " తప్పు నాదే సార్. నన్ను క్షమించండి. చేతులారా నా పరీక్ష నేనే పోగొట్టుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈసారి తప్పనిసరిగా పరీక్ష పాస్ అవుతాను. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ వస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సర్. నాయందు దయవుంచి నాకు ఈ ఒక్కసారి లెక్కలు చెప్పండి సర్" అన్నాడు రుద్ధమైన కంఠంతో. "చూడు ఆంజనేయులు. ఇన్స్టంట్ పరీక్షకు కేవలం రెండు నెలలే సమయం ఉంది. సంవత్సరమంతా చదవలేనివాడివి ఈ రెండు నెలలలో చదివి ప్యాసవగలవా?" "ఖచ్చితంగా పాసయేలా కృషి చేస్తాను సర్. మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని పాడు చేసుకోను. నా మీద దయ ఉంచండి సర్ " "సరే. నువ్వు రోజు ఉదయంమే వచ్చి లెక్కలు నేర్చుకోవాలి. నేను చెప్పినట్టుగా విని ఆచరిస్తే నువ్వు తప్పనిసరిగా 60 మార్కులతో పాస్ అవుతావ్.. కేవలం నీకోసం ఒప్పుకుంటున్నాను. ఫీజు 500. బాగా ఆలోచించుకో" "సార్. ఒక్కసారి గా అంత ఫీజు ఇచ్చుకోలేను. కానీ పరీక్షకు వెళ్లబోయే లోపుగా తప్పనిసరిగా మీ ఫీజు మొత్తం చెల్లిస్తాను. ఈ వంద అడ్వాన్స్ గా ఉంచండి సర్. ''అంటూ వందనోటు ఇవ్వబోయాడు వినయంగా ఆంజనేయులు. "పరీక్షకు వెళ్ళేలోపు ఇస్తానన్నావుగా... మొత్తం అపుడే ఇద్డువుగాని... రేపు మంచి రోజు. ఉదయమే రా. "అంటూ చనువుగా ఆ వంద నోటు ఆంజనేయులు జేబులో పెట్టేసారాయన. "నా దగ్గర ఏడాదిపాటు చదువు కొని పరీక్ష ఫెయిల్ అయ్యావ్ అంటే నాకే అవమానంగా ఉంది. ఐదు సబ్జెక్టులు పాస్ అయి లెక్కలు సబ్జెక్టు 34 మార్కులు తెచ్చుకుని మిగుల్చుకున్నావంటే నీ నిర్లక్ష్యానికి నాకు చాలా కోపంగా ఉంది. సరే రేపు ఉదయమే రా " ఆంజనేయులు మాష్టారి కాళ్ళకి సాష్టాంగ పడిపోయాడు. " మీరు ఒప్పుకున్నారు. నాకు అదే చాలు సార్ " అని వినమ్రంగా వెళ్ళిపోయాడు ఆంజనేయులు. "హూ వెధవ పిల్లలు. క్లాస్ లో మంచిగా చెప్పినప్పుడు వినిపించుకోరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. "అనుకుని పేపర్లో తల దూర్చారు కోదండం గారు. ******* మరుసటి ఉదయం నుంచే ఆంజనేయునికి కోదండం గారి శిక్షణ ప్రారంభమైంది. ఒక్కోసారి ఇచ్చిన హోంవర్క్ చేసుకుని వచ్చేవాడు కాదు ఆంజనేయులు. " ఏంటయ్యా! ఇంటి దగ్గరేం పని ఉంటుంది నీకు? రోజంతా ఖాళీయేగా. మరి హోం వర్క్ చేయడానికి ఏమి బాధ? "అని మాష్టారు కఠినంగా ఆడిగినప్పుడల్లా ఆంజనేయులు కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగేవి. "నువ్ ఇంటిదగ్గర చేసుకురావు అని నాకర్ధమైంది. ఇక్కడే చేసి వెళ్ళు " పరీక్ష ఉత్తీర్ణత అవ్వడానికి ఏ ఏ అధ్యాయాలలో ఏ లెక్కలు బాగా చేస్తే పాస్ అవుతాడో ఆ లెక్కలు ఒక్కొక్కటిగా ఎంతో వివరంగా అర్థమయ్యేలా చెప్పి, ఒక్కొక్క లెక్కని ఐదుసార్లు చేయించి, తన ఎదురుకుండా వాటినే పరీక్ష గా పెట్టి దిద్ది మార్కులు వేయడం మొదలుపెట్టారు కోదండం గారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MglWaX4TWag
Embed this episode
NOW PLAYING
పెరటి చెట్టుపై వాలిన పక్షి | Perati Chettupai Valina Pakshi | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.