EPISODE · Jan 1, 2023 · 8 MIN
ఫోన్ పోయింది | Phone poyindi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఫోన్ పోయింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కాలింగ్ బెల్ చప్పుడుకి వంట గదిలోనుంచి వచ్చి తలుపు తీసి, గోడ పట్టుకుని ఒంగిపోతు నిలిచివున్న సుబ్బారావు ని చూసి “అయ్యో.. ఏమైంది మామయ్యగారూ!” అంటూ చేయిపట్టుకుని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టి, లోపల గదిలో కూతురుకి లెక్కలు చెపుతున్న మొగుడు రమేష్ ని రమ్మని పిలిచింది రమ్య. “ఏమైంది..” అంటూ రమేష్, రమేష్ కూతురు స్వర, పక్కగదిలో భారతం చదుకుంటున్న రాజేశ్వరి ఒకేసారి కంగారుగా ముందు గదిలోకి వచ్చారు. సోఫాలో చెమటలు పట్టి వణికిపోతున్న భర్తని చూసి “ఏమైందండి, మళ్ళీ షుగర్ పడిపోయిందా?” అంది రాజేశ్వరి. “వుండమ్మా, ముందు కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. యిది మనకి మాములేగా. వద్దన్నా సెల్ ఫోన్లో బాబాయ్ తో మాట్లాడుకుంటూ పది కిలోమీటర్లు నడిచేసి, ఇంటికి యిలా చేరతారు” అన్న కొడుకుతో, “ఎక్కువ దూరం వెళ్లలేదురా. మియాపూర్ దాకా వెళ్లి వచ్చేసాను” అన్నాడు సుబ్బారావు. ఫ్రూట్ జ్యూస్ గ్లాస్ చేతికి యిస్తో “మామయ్యగారూ! మన యింటినుంచి మియాపూర్ రానుపోను 10 కిలోమీటర్స్ వుంటుంది, మీరు అంత దూరం నడవకూడదు” అంది కోడలు రమ్య. “మొన్న తాతయ్య ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు” అంది మనవరాలు స్వర. ఫ్రూట్ జ్యూస్ తో కొద్దిగా ఓపిక వచ్చిన సుబ్బారావు, మనవరాలు వంక చూసి “నువ్వు కూడా చెప్పేదానివే.. అసలు ఆ టైములో నువ్వు బయటకి ఎందుకు వచ్చావు, ఎవ్వరు తోడు లేకుండా” అన్నాడు. “మిమ్మల్ని మేము ఎవ్వరం కంట్రోల్ చెయ్యలేం, మీ మనవరాలు తప్పా, అందుకే దానిని మీకు కాపలాపెట్టాం” అన్నాడు కొడుకు. మెల్లగా లేచినుంచున్న తండ్రిని చూసి, “మళ్ళీ ఎక్కడకి లేచారు?” అన్నాడు. “చెమటలు పట్టేసాయి, స్నానం చేసి వస్తా” అంటూ బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.. వేడినీళ్లతో గంట సేపు స్నానం చేయడం అలవాటు. అయిదు నిమిషాలలోనే తలుపు కొడుతూ, “తాతయ్యా! ఆర్ యు ఓకే ?” అని అడుగుతున్న మనవరాలికి, “ఆ బాగానే వున్నా, వస్తున్నా” అన్నాడు సుబ్బారావు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/jc1jqTOMcDo
Embed this episode
NOW PLAYING
ఫోన్ పోయింది | Phone poyindi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.