EPISODE · Aug 2, 2023 · 8 MIN
ఫుల్ డిస్కౌంట్ | Full Discount | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Full Discount' - New Telugu Story Written By Surekha Puli 'ఫుల్ డిస్కౌంట్' కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అన్ని దినపత్రికలో చీరల డిస్కౌంట్ గురించి ప్రకటన వెలువడింది. పండగ రోజులు కదా.. ఆకర్షించే ప్రకటన అది. ఒక చీర పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారని ఆడవాళ్లందరూ కొనుగోలుకు ఎగబడుతున్నారు. జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేస్తున్న మాణిక్యం, నివేదిత లంచ్ టైం లో పేపర్లో వచ్చిన చీరల ప్రకటన గురించి చర్చించుకున్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా హోటల్ సరోవర్ లో నిర్వహించబడుతున్న డిస్కౌంట్ చీరల ఎగ్జిబిషన్ కి వెళ్లాలి అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ ఒకేసారి సెలవు దొరకదన్నాడు బాస్. రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళిద్దరిలో ఆత్రుత హెచ్చింది. ఏమైనా సరే తక్కువ రేట్ లో పండక్కి చీర కొనుక్కోవాలని, పిల్లలకు ఆరోగ్యం బాలేదని ఒకరు, తనకే తలనెప్పి అని మరొకరు సగం రోజు సెలవు తీసుకుని మొత్తానికి ఎలాగైతేనేం ఆఫీస్ నుండి బయటపడ్డారు. ఆటో ఎక్కి హోటల్ సరోవర్ వైపు దారి తీశారు. నివేదిత అన్ది "మా అత్తగారు కూడా ఇంట్లో లేరు, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి ఆలస్యంగా వెళితే పిల్లలు స్కూల్ నుండి వచ్చి గాబరా పడతారు". మాణిక్యం చెప్పింది "అందుకే కదా సగం రోజు సెలవు తీసుకున్నాము. సరిగ్గా ఆఫీస్ వదిలే టైం కి ఇంటికి వెళ్లి పోతే సరే.. ఏ బాధ ఉండదు, ఎవరికీ డౌట్ రాదు. " వచ్చేవి పండుగ రోజులు. సగానికి సగం రేటు తగ్గించి చీరలు అమ్ముతున్నారు అనే విషయం ఎంతో మంది స్త్రీల మనసు దోచే విషయము. హోటల్ సరోవర్ వెనకవైపు పెద్ద హాల్లోని గోడలకు రకరకాల చీరలను పురివిప్పిన నెమలి ఆకారంలో వేలాడ దీసారు. గుట్టలుగా టేబుల్స్ మీద పరిచి ఉన్న చీరలను చూసి అన్ని వయస్కుల స్త్రీలు వేలంవెర్రిలా ఎగబడుతున్నారు. కొందరు కొనడానికి వస్తే, చాలామంది కాలక్షేపానికి వచ్చారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JhDVzV_2F4k
Embed this episode
NOW PLAYING
ఫుల్ డిస్కౌంట్ | Full Discount | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.