EPISODE · Nov 28, 2022 · 18 MIN
పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక | Pichukamma Picchuka Bangaru Pichhuka | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వాతావరణ కాలుష్యం వల్ల, ముఖ్యంగా సెల్ల్ టవర్ల వల్ల పక్షి జాతి అంతరించి పోతోంది. ముఖ్యంగా పిచ్చుకలు మచ్చుకి కూడా కనిపించడం లేదు. మామూలు హాస్య కథలోనే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసారు నల్లబాటి రాఘవేంద్ర రావు గారు. ఇక కథలోకి వెడదాం. ఆ చెట్టు మీద సరస సల్లాపాలాడుకుంటూ అందమైన పిచ్చుక జంట.. ''ఒసేయ్ నా రాచవన్నెల బంగారు పిచ్చుక.. నన్ను ముక్కుతో పొడవకే. నువ్వు నన్ను లైన్ లో పెడితే నా వల్ల నీకు పిల్లలు పుడతారు.. అనుకోకు. ఎందుకంటే ఈ మానవజాతి వల్ల కలిగిన వాతావరణ కాలుష్యంతో మన జాతిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎప్పుడో తగ్గిపోయిందే. పోనీ మన ఇద్దరికీ ఎలాగోలా పిల్లలు పుట్టారే అనుకో.. ఈ భూ ప్రపంచపు కాలుష్యంలో మన పిల్లకాయలు బ్రతికి బట్ట కట్టలేరు'' అంది మగ పిచ్చుక. ''అవును మావా.. అసలు నువ్వు నేను బ్రతికి బట్ట కడతామంటావా? మన జాతి పూర్తిగా నశించి పోతున్నప్పటికి ఈ మానవులు పట్టించు కోవడం లేదు ఎందుకనో?'' నిట్టూరుస్తూ అంది ఆడ పిచ్చుక. ''ఓస్.. జంతువులు పక్షులు నశిస్తే మనకేం.. అనుకుంటున్నారేమో వీళ్లు. ఈ మనిషి గొప్ప వాడు కావడం కోసం అటవీ ప్రాంతాన్ని హరిoచేస్తున్నాడు. దాంతో వర్షాలు పడటం లేదు. మొక్కలు కూడా మొలవడం లేదు. ఇక ఇలాగే కొనసాగితే కేవలం మన జాతి మాత్రమే కాకుండా అప్పుడు శాఖాహార మాంసాహార జంతువులు కూడా నశిస్తాయి. అప్పుడేమవుతుందో తెలుసా.. జీవావరణ చక్రం దెబ్బతిని మానవాళి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.. అది తెలుసు కోలేక పోతున్నారు ఈ మానవ మొనగాళ్లు.'' అంది మగ పిచ్చుక. ''మీ పురాణం కట్టి పెట్టవో మామ. నీ పిచ్చుక పురాణం ఎవడు వింటాడు. సరే నేను అడిగిన దానికి చెప్పు. మనకు ఇంతటి నష్టం కలుగ చేసిన ఈ మనుషుల మీద కసి పగ ద్వేషం తీర్చుకోవాలని ఉంది నాకు. పని జరుగుతుం దంటావా?'' ప్రేమగా కోరిక కోరింది ఆడ పిచ్చుక. ''ఓస్.. ఇదే కదా నీ కోరిక. నాతో రామాపురం రా. అక్కడ ఆనంద పరమానందయ్య గారి ఇంటికి వెళదాం. అక్కడ మనుషులను ఓ ఆట ఆడించి వాళ్ళను ఏడిపించి తద్వారా నీ కోరిక తీరుస్తాను రా'' అన్నది మగ పిచ్చుక ఆడ పిచ్చుక ముక్కునుగీరుతూ. ''ఎట్టా?'' ఆశ్చర్యంగా చూసింది ఆడ పిచ్చుక. ''ఎట్టా లేదు, తట్టా లేదు, బుట్టా లేదు.. నే చెప్తాగా.. నాతో రా.'' అంటూ మగ పిచ్చుక గాలిలోకి ఎగిరింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5wxChsY4UYQ
Embed this episode
Ready to play
పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక | Pichukamma Picchuka Bangaru Pichhuka | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.