పిల్లల్ని కనాలంటే? episode artwork

EPISODE · Aug 9, 2020 · 14 MIN

పిల్లల్ని కనాలంటే?

from Harshaneeyam

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను మేమే చేసుకొనేవాళ్ళం. అంటే కారు, బస్సు, రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగ్గిపెట్టెలను ఆ ఆకారంలో మార్చుకొని వాటికి మందుసీసాల రబ్బరు మూతలను చక్రాలుగా అమర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకొనేవాళ్ళం. నిజంగా ఎంత తృప్తిగా వుండేదో. ఈ బాబుగాడున్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ లాంటోడు. వాళ్ళ నాయన హైస్కూల్ హెడ్మాస్టరే కాదు . R.M.P. వైద్యుడు కూడా. కాబట్టి వాళ్ళింట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొదవుండేది కాదు. ఓరోజు ఇద్దరమూ కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళికా రచనలో పడ్డాము. నేనెలాగు రబ్బరు మూతలు తేలేను కనుక వాడు చెప్పిన ప్రపోజల్ కు సరే అన్నాను. అంటే వాడు రబ్బరు గాన్లు తెచ్చేటట్టు, నేనేమో అవసరమైన అగ్గిపెట్టెలు తెచ్చేటట్టు. ఆ విధంగా పనులు విభజించుకొన్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిన తీసుకొచ్చాడు. మరి నాకు అగ్గిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి. అక్కడా ఇక్కడా అడుక్కోని ఒక ఐదో ఆరో సంపాయించాను. ఇక మిగిలినవాటికోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. అదుగో అప్పుడు నాలోని మరో మనిషి నిద్రలేచి ఓ సలహా ఇచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అగ్గిపెట్టెలు మాయం. పుల్లలు తీసి ఇంటివెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొకరోజు, నేనొక రోజు హాయిగా ఆడుకొంటూ స్వర్గలోకాల్లో విహరించే ఒకానొక రోజు.....ఇంట్లో వాళ్ళకి కొత్త అగ్గిపెట్టె అవసరం పడి చూస్తే ... ఇంకెక్కడి అగ్గిపెట్టెలు... కట్ చేస్తే షరా మామూలే.. ఇంట్లో సినిమా... ఇంటిబయట ప్రేక్షకులు :-)అలా ఆ అమాయకత్వం అంతటితో ఆగిందా..అబ్బే ఆరోతరగతికి వచ్చేటప్పటికి బాలల పురాణ పుస్తకాలు చదవడంతో అందులో హీరోలు ఎవరైతే వారుగా మమ్మల్ని ఊహించుకోవడం బాగా తలకెక్కేసింది. ఊర్లో అంతకుముందు కొన్ని రోజులక్రితమే శ్రీరామనవమికి లవకుశ నాటకమేసారు. అప్పుడు మొదటిసారిగా "రామనీల మేఘశ్యామా..కోదండరామా" అనే పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకేముంది అప్పటినుండి రాముని అవతారంగా పరకాయప్రవేశం చేసేసాను. అదుగో అప్పుడూ ఈ బాబుగాడు నాకు పోటీనే..రేయ్ నీకంటే నేను పెద్దోడ్ని నేనే రాముణ్ణి , నువ్వు లక్ష్మణుడివని. కానీ ఈసారి కుదరదంటే కుదరదని వాడ్ని లక్షణుడిగా సెటిల్ చేసేసి నేనే రాముడి నయ్యాను. ఇంతవరకూ బాగానే వుంది. మరి సీత?అక్కడన్నమాట మా హీరోయిన్ రంగ ప్రవేశం. ఊర్లో అంతా సూర్యవంశ రాజులు, గొల్లవారు ఎక్కువ. కాబట్టి బడికి అమ్మాయిలను పెద్దగా పంపేవారు కాదు. మరి వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా మాకు నచ్చిన పిల్ల నాగేశ్వరి [ పేరు మార్చాను ]. ఆ పిల్లకు కాస్త చింతపండు,జీలకర్ర కలిపి ముద్దగా చేసి ఓ చీపురు పుల్లకు గ్రుచ్చి లంచంగా ఇచ్చి మచ్చిక చేసుకున్నాము. ఇంతకీ ఇదేమి బాగుంటుందనుకొనేరు. కొత్త చింతపండు, జిలకర,ఉప్పు కలిపి ముద్దచేసి తిని చూడండి. సూపర్ గా వుంటుంది. ఇలా నాగేశ్వరిని సీతగా మార్చేసాము. నేను రాముడిని కదా..కొంచెం నీలి రంగులో వుండాలికదా. అందుకని ప్రతిరోజు స్కూల్ కి వచ్చేటప్పుడు మొఖానికి అరచేతి నిండా పాండ్స్ పౌడరు దట్టంగా దట్టించి స్కూల్ కి వచ్చేవాడిని. బాబుగాడు, నాగేశ్వరీ కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఒక బావి దగ్గర చేరేవాళ్ళం. ఎందుకంటే అంతకుముందే అప్పటికే అక్కడ ఇటుకలతో ఒక చిన్న గుడిని, ఒక దీపకుందీని, ఆముదపు డబ్బాని తయారుగా పెట్టుకొని వున్నాము.పెళ్ళి పత్రికల్లో ఆరోజుల్లో కచ్చితంగా రాముడు సీత ఇద్దర్నీ ప్రింట్ చేసేవాళ్ళు. అలాంటి పెళ్ళి పత్రికను ఒకటి మేము ఇటుకలతో కట్టిన ఆ గుడిలో పెట్టి దేవునిగా చేసి దీపారాధన చేసి, ఎవరూ చూడకుండా దానికి ఒక పెద్ద అట్టముక్కను వాకిలిగా పెట్టి మళ్ళీ స్కూల్ కి చేరుకొనేవాళ్ళం. ఒంటేలు గంట కొట్టగానే ముగ్గరం కలిసి మళ్ళీ మా గుడి దగ్గరకు పోయి పూజ చేసేవాళ్ళం. మరి అప్పటికి రాముడి మేకప్ పోయుంటుందికదా! సీత మేకప్ వేస్తుంటే హాయిగా వేపించుకొనేవాడిని. లక్ష్మణుడు మేము దీపారాధన చెసేటప్పుడు చుట్టుప్రక్కల జనసంచారమైతే మాకు సమాచారం ఇవ్వడానికి కాపలాగా వుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాకా ఈ ఆట బాబుగాడికి మహా బోర్ కొట్టేసింది. ఎందుకంటే వాడెంత సేపున్నా దీపారాధన చెయ్యలేడు,పౌడరు పూపించుకోలేడు :-). సరే అని వేరే ఆట ఆడాలని ముగ్గురం డిసైడ్ అయ్యాం. ఈసారి మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరం మా ఆటకు మూల వస్తువు.ఇంతకీ ఆటఏమిటంటే ఒక ఐదుమందిమి కలిసి ద్రౌపతి ని పెళ్ళి చేసుకోవడం. కానీ ఇక్కడ మాకొక చిక్కు వచ్చింది. మేము ముగ్గరం ఇప్పటికే ఎవరికీ తెలియకుండా రామ,లక్ష్మణ, సీత అవతారాలెత్తాము. ఇప్పుడు మరో ముగ్గురు అంటే ఎక్కడ గొడవలౌతాయో అని భయం కూడా వేసింది. అందుకని మేమిద్దరమే పాండవులం. నాగేశ్వరి ద్రౌపతి అన్నమాట. ఇక పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించేసుకున్నాం. ఇంతకీ పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ మా ముగ్గురికీ ఒకటే భయం. పెళ్ళయితే పిల్లలు పుడతారాని :-)కానీ పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఒకసారి వచ్చాక ఇక మనసూరుకుంటుందా? హబ్బే రాత్రులు నిద్రపట్టేది కాదు. ఎలా? ఎలా? ఎలా?... ఏదైతే అది అవుతుందని ముగ్గురం ధైర్యం చేసాము. మా స్కూలు వెనకాల ఒక పెద్ద ఇసుక గ్రౌండ్ వుండేది. ఇప్పటికీ వుంది కానీ ఇసుక మాత్రం చాలా తక్కువగా వుంది. ఒక రోజు, అపర సంధ్యవేళ, చుట్టు ప్రక్కల ఆడుకొనే పిల్లలు అందరూ ఇంటికెళ్ళాక ఎవరూ లేని సమయం చూసి ముగ్గురం సమావేశమయ్యాము. పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారనే భయం ఒకప్రక్క తొలుస్తూనే వున్నా మిగతా కార్యాచరణకు మంతనాలు సాగించాం. ఈ సారి నా వంతు తాళిబొట్టు తయారు చేయడం. బాబుగాడి వంతు పసుపు త్రాడు సంపాయించడం. అప్పటికి మాకు పెళ్ళిలో బెల్లం జీలకర్ర నెత్తిన పెడతారని తెలియదు. తాళి కట్టేస్తే ఇక పెళ్ళయిపోయి పిల్లలు పుట్టేస్తారని మాత్రమే తెలుసు :-)ఇలా ముచ్చటించుకోని మంచి ముహూర్తం కోసం నేను, బాబుగాడు ఊర్లో రామాలయంలో హరికథలు చెప్తున్న హరిదాసు గారిని కలిసి, " మేము బాగా చదవుకోవాలనుకుంటున్నాము ఏరోజు మొదలు పెడితే ఫస్టు మార్కులు వస్తాయో " చెప్పమని కోరాము. ఇక్కడ మరో విషయం ఈ హరికథా దాసు గారితో మాకు అప్పటికే కొంచెం చనువు ఎక్కువ. వారి పేరు గుర్తు లేదుకానీ వారు చెప్పే రుక్మిణీ కల్యాణం హరికథకు రోజూ వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని శ్రద్ధగా వినేవాళ్ళం. అలాగే మాకు నచ్చిన పద్యాలను ఆయనచేత ఒక తెల్లకాగితం మీద వ్రాయించుకొని ఊరు బయటుండే పెద్ద రావిచెట్టు మీదెక్కి వచ్చేదాకా రాగాలు తీసేవాళ్ళం :-)ఈ చనువుతో పాపం ఆయన నిజమేననుకొని ఒక మంచిరోజు చెప్పారు :-). ఇక నేను తాళి ఎలా సంపాయించాలి? బంగారం అంటే దొంగతనం చేయ్యాలి కదా ! హబ్బే అప్పటికి ఎదో ఇంట్లో అగ్గిపెట్టెలు తప్ప ఇలా విలువైనవి కాజేసేటంత సీనులేదు. అదీకాక మనం ఏపని చేసినా ఎలా కనిపెట్టేస్తారో గానీ ఇంట్లో వెంటనే తెలిసిపోయేది. అప్పుడే డిసైడ్ అయిపొయ్యా..నేను పెద్దాయ్యాక నా పిల్లోల్లకు ఏది అడిగితే అది కొనిచ్చేయాలని :-)అద్దో అలా చించి చించి, ఒక చిల్లపెంకు తో తాళి తయారు చెయ్యడానికి నిర్ణయించుకొన్నాను. ఒక మోస్తారు చిల్లపెంకు సంపాయించి. ముందుగా ఒక చీలతో దానికి అతి జాగ్రత్తగా రెండు రంధ్రాలు పెట్టి చుట్టూ బాగా అరగదిద్ది గుండ్రంగా తయారు చేసి ఒక కాగితంలో చుట్టి ఇక పెళ్ళిరోజుకోసం వైటింగ్....ఆ రోజు రానే వచ్చింది. బాబుగాడు ఇంట్లో ఒక...

NOW PLAYING

పిల్లల్ని కనాలంటే?

0:00 14:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 14 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on August 9, 2020.

What is this episode about?

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!