EPISODE · Sep 27, 2022 · 11 MIN
పిట్ట కథ | Pitta Katha | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిట్ట కథ రచన : పాండ్రంకి సుబ్రమణి నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగ విరమణ చేసినప్పుడు నా సహ పెన్షన్ ధారులకు నేనొకటి చెప్తుంటాను, దివ్య ధీమాగా-- “ఇక నుంచి మనం కాలమనే సుందర సామ్రాజ్యానికి రారాజులం. ఇకపైన మనం యెప్పుడైనా లేస్తాం. ఎప్పు డైనా ముస్తాబవుతాం. ఎక్కడికైనా వెళతాం. ఎంతసేపైనా పచార్లుస్తాం. కార్యాలయ హాజరు పుస్తకంలో మనల్ని సంతకం చేయమని అడిగే దమ్మూ యెవడికీ లేదు. అదే రీతిన మనం యెప్పుడైనా మన యిఛ్ఛానుసారం లేచి వాహ్యాళికి వెళతాం. ఏం- మధ్యాహ్నం వెళతాం లేదా సాయంత్రమైనా వెళతాం. అదీ లేదా- టీవీ ప్రోగ్రాములు గట్రా చూసిన తరవాత అర్థరాత్రి తీరుబడిగా గాలివాటంగా నడక సాగిస్తాం. మనల్ని అడ్డుకునేవాడెవటంట? ఇకపైన స్వేఛ్ఛ మనకు స్వంతం. మనకు మాత్రమే స్వంతం. ఇంటి ముంగిట వాలే పెంపుడు పావురంలా నెలనెలా చేరే పెన్షన్ మన గతకాల సేవలకు గుర్తింపుగా వచ్చే కిరీటం... “కాని- ఇక్కడే నేను కాస్తంత అధికంగా వాగానేమోనని తరవాత తట్టింది. తత్తరపాటు కలిగంది. ఎప్పు డైనా లేస్తాను- ఎప్పుడైనా వాకింగ్ చేస్తాను- ఎప్పుడైనా తింటాను- అన్న వాక్యాన్ని నా శరీర యాంత్రిక వ్యవస్థ లోపలనుంచి రహస్యంగా వినినట్లుంది. అది తిన్నగా మా ఫ్యామిలీ డాక్టరు వద్దకు మోసుకు వెళ్ళినట్లుంది. “నీకు ఉద్యోగ బరువు బాధ్యతలనుండి స్వేఛ్ఛ లభించిందే గాని—ఆదినుండి అంతం వరకూ మునుపులాగే జీవన క్రమం పాటించాలయ్యా! ఉదయం ఒకసారి సాయంత్రం మరొకసారి నడక సాగించడం తప్పని సరి. ఎక్కడ బడితే అక్కడ కాదు. స్వఛ్ఛమైన గాలి ప్రవాహం ఉన్నచోట. అంతేకాదు— రుచిగా ఉంటే యెకబిగిన లాగించేయకుండా మితంగా భోజనం చేయడం- సమయానికి మరచిపోకుండా మందుబిళ్ళలు వేసుకోవడం తప్పని సరి. అంతే కాదండోయ్. మూడు నెలలకొకసారి షుగర్ బిపీ చెక్ చేసుకోవడం అంతకంటే తప్పని సరి--” దానితో ఉత్తుంగ తరంగ మంతటి నా ఉత్సాహానికి, స్వేఛ్ఛా ప్రియత్వానికి ఆనకట్ట పడింది. బ్రతుకు బాట బ్రైట్ గా సాగాలంటే వీటిని పాటించడం అనివార్మమేనేమో!.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/YFgPxbVqzrU
Embed this episode
NOW PLAYING
పిట్ట కథ | Pitta Katha | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.