EPISODE · Oct 23, 2022 · 17 MIN
పని-మని-షీ | Pani Mani Shi | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పని-మని-షీ రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ అబ్బబ్బా చస్తున్నాను పని చెయ్యలేక! ఒక్కరు కూడా ఇటున్న పుల్ల అటు పెట్టేవాళ్ళులేరు, అంతా తిని కూర్చునేవాళ్ళే. ఏమిటో ఈ చాకిరి.. హాయిగా పెద్ద చదువులు చదువుకుంటేనన్నా ఉద్యోగం చేసుకుంటుండేదాన్ని. ఈ అడవచాకిరి తప్పేది”.. గట్టిగా అంటూనే కడిగిన గిన్నెలను పెద్దచప్పుడు వచ్చేటట్టు బుట్టలో వేస్తోంది అరుణ. “ అరుణా.. కాస్తా టీ ఇస్తావా!” హల్లోనుండే కేక వేసాడు చైతన్య. “ ఆహా… ఏది తప్పినా ఇది మాత్రం తప్పరు తమరు. ఎంతపనిలో ఉన్నా అడిగిందే తడవుకావాలి. పాపం పనిలో ఉన్నట్టుందే.. కాస్తా సహాయం చేసినట్టుంటింది అని టీ పెట్టుకొని నా మొహానా ఇంతపొద్దామే అనే ఆలోచననే రాదు ఈ మనిషికి”. గొణుస్తూనే రుసరుసలాడుతూ టీ తీసుకొచ్చి భర్త చేతికిస్తూ అక్కడే ఉన్న కూర్చిలో కూర్చుంది అరుణ. “ అరే.. ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? తలనొప్పిగా ఉందా.. టాబ్లెట్ వేసుకున్నావా.. ” కంప్యూటర్ లో నుండి తల ఎత్తకుండానే అడిగాడు. “ అవును. నాకేం పనిపాటలేదుగా! ఎప్పుడు కోపంగానే ఉంటాను మరీ, మీకంటే బోలెడు పనులాయే, ” ముక్కు ఎగబీలుస్తూ. “ అరుణ…. అసలేమయిందో చెప్పకుండా ఈ వ్యంగ్యాలేంటో అర్ధంకాలేదు, ఏమైందో చెప్పురా నీ బాధేంటో, ” కంప్యూటర్ పక్కన పెట్టి అరుణ దగ్గరకు వచ్చి అరుణ చుబుకం పట్టుకుని అడిగాడు. “ అదికాదండి… పని చేసుకోలేక చస్తున్నాను, ఒక్కపనిమనిషి దొరికిచావడం లేదు, మీ అమ్మానాన్నలకు సకలం అందించాలి, ఒంటినిండా బీపిలు షుగర్లు అందుకోసమని, రెండుగంటలకోసారి వాళ్ళకు ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి, కరోనా కాలం వచ్చినప్పటినుండి మీరు ఇంటినుండే పని చేస్తున్నా, హాడావుడి తగ్గుతుందనుకున్నా ఇంకా ఎక్కువే అయింది, మాటిమాటికి టీ అంటారు తినడానికి ఏదో అడుగుతూనే ఉంటారు, ఇక పిల్లలైతే రోజుకో వెరైటి చేస్తే తప్పా టిఫిన్ బాక్స్ లు తీసుకపోరు, ఇంటికి వచ్చాక ఇంకోరకం చేయ్యాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే గంపెడు గంపెడు గిన్నెలు అవుతున్నాయి, పొద్దుకు పదిసార్లు కడుగుతున్నా సరిపోవడంలేదు, నేను చెయ్యలేనండి మీరు ఏం చేస్తారో ఏంటో నాకు అర్జంటుగా పని మనిషిని తీసుకరండి, లేదంటే ఎవ్వరి పనులు వాళ్ళుచేసుకోండి, ” చేతులుతిప్పుతూ చెప్పింది అరుణ ఆయాసపడుతూ. “ సరే నీకు కావలసింది పనిమనిషి అంతేకదా ! నా స్నేహితులను అడుగుతాను, నీకు తెలిసిన వాళ్లింట్లో పనిమనుషులు ఉండరా వాళ్ళను అడిగి మాట్లాడుకోవచ్చు కదా అరుణ, డబ్బులగురించి ఆలోచిస్తున్నావా ? బయటకు వెళితే ఎంతమంది కనిపిస్తారు పనివాళ్ళు, ఎవరినో ఒకరిని మాట్లాడుకో నీకు ఇబ్బంది తగ్గుతుంది, ” చెప్పాడు చైతన్య “ అయ్యో రామా… రామాయణం అంతా విని రాముడికి సీతేం కావాలి అన్నట్టుంది మీ తీరు, ” కాలింగ్ బెల్ మ్రోగడంతో మాట్లాడుతున్నదల్లా ఆపింది. వెళ్ళి తలుపుతీసాడు ఎదురుగా ముప్పై ఏళ్ళుంటాయేమో ఒకావిడ నిలబడి ఉంది. చూడడానికి బాగుంది జార్జెట్ చీరకట్టింది. జుట్టుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టువదిలేసింది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4tEnJc1du6c
Embed this episode
NOW PLAYING
పని-మని-షీ | Pani Mani Shi | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.