EPISODE · Jan 15, 2023 · 12 MIN
పంజరంలో చిలక | Panjaramlo Chiluka | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంజరంలో చిలక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేను ఎస్పీగా జిల్లాకి వచ్చి సంవత్సరం అయింది. నేను వచ్చే నాటికి జిల్లాలో ఎన్నో సమస్యలు... ఒకవైపు నక్సల్స్ సమస్య, ఇంకో వైపు రాజకీయ సమస్యలు; రాజీకీయంగా ఈ జిల్లా చాలా సెన్సిటివ్. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు ఈ జిల్లా చాలా ముఖ్యమైనది... ఈ జిల్లాలో వెనుకబడినవారు, గిరిజనులు ఎక్కువగా ఉండటంతో రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ; ఈ మధ్యనే డ్రగ్స్ సమస్య కూడా ఎక్కువైంది. చాలా మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో క్రైమ్ రేటు పెరుగుతోంది. నేను చేరిన రెండు నెలలకు జిల్లా ముఖ్యపట్నంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న లావణ్య అనే విద్యార్థిని కిడ్నాప్‌కి గురైంది. మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దాంతో ప్రతిపక్షాలు, కాలేజి విద్యార్థుల ఆందోళన మొదలైంది. నేను మా డీఎస్పీ సుధాకర్ని పిలిచి కేసు గురించి వాకబు చేసాను. అతను “సార్! ఆమెను అధికార పక్షం ఎమ్మెల్యే గోవర్థన రావు కొడుకు కుమార్ కిడ్నాప్ చేసాడు... అతను ఇది వరకు డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ముద్దాయి. బాగా మత్తుమందులకి అలవాటు పడ్డ వ్యక్తి; అతను ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ మన పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అతన్ని అరెస్ట్ చేస్తే అధికార పక్షానికి రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ చేస్తే మనం ఎవ్వరం ఇక్కడ ఉండం! అందర్నీ బదీలీ చేస్తారు” అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/r0Jeq5DYIZI
Embed this episode
NOW PLAYING
పంజరంలో చిలక | Panjaramlo Chiluka | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.