EPISODE · Jun 21, 2023 · 11 MIN
పొద్దు వాలిపోతోంది | Poddu Valipothondi | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పొద్దు వాలిపోతోంది రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సంధ్యాసమయం! సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు... పడమటి ఆకాశం ఎర్రగా కనిపిస్తూ సూర్యుడికి వీడ్కోలు పలుకుతోంది. నేను వీధి వాకిట్లో నులక మంచం మీద పడుకున్నాను... పైన ఆకాశంలో అప్పుడే కనిపిస్తున్న చుక్కలు మెరుస్తున్నాయి. వీధిలో పశువులు ఇళ్ళకు వెళ్తూ ధూళిని రేపుతునాయి... అవును... ఇప్పుడు గోధూళి వేళ అయింది. ఈ పదానికి చిన్నప్పుడు నాకర్థం తెలిసేది కాదు. తెలిసే సరికి నేను వృద్ధుడనైపోయాను... మా రైతు రాములు నా మంచం కింద దుడ్డు కర్ర, మంచి నీళ్ళ సీసా, విసన కర్ర పెట్టి వెళ్ళిపోయాడు... రెండు సంవత్సరాల నుంచీ నా దినచర్య ఇదే. నా భార్య శ్యామల నన్ను వదలి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి వంటరిగానే ఇంట్లో గడుపుతునాను. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటునారు. శ్యామల చనిపోయినపుడు వాళ్ళిద్దరూ వచ్చారు. అప్పుడు నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మనమనీ చెబితే నేను వెళ్ళనన్నాను. దాంతో వాళ్ళు కోప్పడి మారైతు రాములు కప్పచెప్పి వెళ్ళిపోయారు. నేను పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుణ్ణి కాబట్టి ఫించను 50,000 వస్తోంది. పదెకరాల పొలం వుంది. డబ్బుకి ఏ ఇబ్బందీ లేదు. కాకపోతే తోడు లేదు. వంటరి జీవితం... ఇలా ఎన్నాళ్ళు గడపాలనీ నా బాధ. ఆలోచనల్లోంచి తేరుకున్నాను... పడమర దిక్కు వైపు మళ్ళీ చూసాను... నా జీవితం కూడా పడమర దిక్కుకి చేరుకుంది ... అంటే సంధ్యా సమయం అన్నమాట... అస్తమించడానికి ఎదురు చూసే సమయం... నేనెక్కడో చదివాను... ” పొద్దు వాలిపోతోంది”... అని.... నాది కూడా అదే స్థితి... ఆలోచనలు మళ్ళీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వంటరితనాన్ని వెంట బెడుతుంటాయట ఆలోచనలు. రాను రాను ఆకాశం నల్లబడుతోంది... చీకట్లు కమ్ము కొంటున్నాయి... ఊరు సద్దుమణుగుతోంది... ఒకప్పుడు మా ఊరు ఎంత బాగుండేది. యవ్వనంలో సాయంత్రం ఏటి ఒడ్డున వాలీబాల్ ఆడుకొని ఇంటి కొచ్చేసరికి అమ్మ కమ్మటి భోజనాన్ని పెట్టేది. యవ్వనం కాబట్టి ఆకలి విపరితంగా వేసేది... అందుకే ఆ భోజనాన్ని ఆవురావురు మంటూ తినేసి వీధిలోకి బాతాఖానీ కోసం వెళ్ళిపోయేవాడిని. ఊళ్ళో మా కామేశం మాస్టారి గారింట్లో మళ్ళీ మా బేచంతా గుమిగూడేది... యన్టీ ఆర్ గొప్పంటే ఏయన్నర్ గొప్పనీ, కృష్ణ డేరింగ్ హీరో అనీ చాలా సేపు సినిమా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంతలో మా మరో స్నేహితుడొచ్చి పక్క ఊరి టూరింగ్ టాకీసులో బొమ్మ మారిందని చెప్పడంతో ఆ సినిమాకి డబ్బులెలా సంపాదించాలోననీ ఆలోచనల్లో పడేవాళ్ళం. ఆలోచనల్లోంచి మళ్ళీ బయట పడ్డాను..... తలగడ్డ సర్దుకొని ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాను... కానీ కళ్ళు మూతలు పడటం లేదు. నక్షత్రాలు మెరుస్తూ జీవితం క్షణ భంగురం అనీ గుర్తు చేస్తున్నాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/mb69uFoLw6I
Embed this episode
NOW PLAYING
పొద్దు వాలిపోతోంది | Poddu Valipothondi | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.