EPISODE · Oct 19, 2022 · 15 MIN
పొదరిల్లు | Podarillu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పొదరిల్లు రచన: లక్ష్మి మదన్ వర్ధని స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందుకు వచ్చి అరుగు మీద నిలబడి, సందు చివరి వరకు చూస్తోంది... ఆ రోజుల్లో ఇప్పటి నర్సరీలాగా ఎవరైనా ఇంటి దగ్గర ఓనమాలు నేర్పించే వాళ్ళు ఉంటే పంపించేవారు, స్కూల్ వెళ్లే వరకు ఏదో కొంత నేర్చుకుంటారని. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ బడి నడిచేది. దానిని కానిగీ బడి అని కూడా అంటారు. పొద్దున చద్దన్నంలో చింతకాయ పచ్చడి, నెయ్యి వేసి కలిపి పిల్లలకు పెట్టి పంపించింది వర్ధని. యూనిఫాంలు బూట్లు ఇవన్నీ వేసుకునే పని లేదు కదా అప్పటి రోజుల్లో! చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని, చద్దన్నం తినేసి దేవుడికి దండం పెట్టుకొని పిల్లలంతా బడికి వెళ్లేవారు. పిల్లలు కూర్చోవడానికి అక్కడ ఒక గోడ మీద ఎవరి గోనేసంచి వాళ్లు తెచ్చి పెట్టుకునేవారు. వెళ్ళాక అది పరుచుకుని కూర్చునేవారు. శ్రావణి, సంగీత, మరియు శ్రీనివాస్ ముగ్గురు కలిసి స్కూలుకు వెళ్లేవారు. అందరికన్నా చిన్నది శ్రావణి చాలా బెరుగ్గా ఉండేది. స్కూల్లో టీచర్ అంటే విపరీతమైన భయం. ముగ్గురు వెళ్లి వరండాలో నిలబడ్డారు. ఇంతలో టీచరు రంగమ్మ వచ్చి.. "లోపలికి వచ్చి మీ గోనెసంచి పరచుకొని కూర్చుని, పలకలు తీసి ఓనమాలు, ఒంట్లు రాయండి" అని చెప్పింది. "సరే పంతులమ్మా!" అని పిల్లలు లోపలికి వచ్చి గోనెసంచి పరచుకొని కూర్చున్నారు. ఇంతలో మిగతా పిల్లలు కూడా వచ్చి వారి వారి సంచులు పరచుకొని కూర్చున్నారు.... ఆరోజు రంగమ్మ టీచర్ కి ఇంట్లో పని ఆలస్యమైంది అనుకుంటా.. వంటింట్లోనే ఎక్కువసేపు పని చేస్తూ కనబడింది. ఇంకా టీచర్ లేదని పిల్లలకి ఆటవిడుపుగా ఉంది. అల్లరి చేస్తూ మాట్లాడుతూ కూర్చున్నారు. ఇంతలో టీచర్ బయటకు వచ్చి "అందరూ పలకలు పట్టండిరా" అని అన్నది. అందరూ పలకలు పట్టి చూస్తున్నారు. అందరి పలకల మీద గుప్పెడు గుప్పెడు బియ్యం పోసి "ఇందులో రాళ్లు చక్కగా ఏరేసి పెట్టండి" అని చెప్పింది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Xj4fCp7zp6k
Embed this episode
NOW PLAYING
పొదరిల్లు | Podarillu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.