EPISODE · Jul 2, 2023 · 18 MIN
పొలిమేర పార్ట్ 1 | Polimera Part 1 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పొలిమేర పెద్దకథ మొదటి భాగం 'Polimera Part 1/2' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah 'పొలిమేర పార్ట్ 1/2' తెలుగు కథ రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాయలసీమలోని రెండు గ్రామాలు అనిమెల, దద్దనాల. చాలా కాలం క్రితం అనిమెల గ్రామంలో జాతర జరిపి, వేట ఇచ్చిన జంతువు తాలూకు రక్తాన్ని అన్నంలో కలిపి గ్రామ శివారులో, పొలాల్లో జల్లుతారు. దీన్నే పొలి అంటారు. దద్దానాల గ్రామం వాళ్ళు ఆ పొలిని ఒంటికి అంటించుకుని తమ గ్రామ సరిహద్దుల్లోకి వెళతారు. దీన్నే పొలిని ఎత్తుకొని వెళ్ళడమంటారు. అప్పటినుండి అనిమెల గ్రామంలో కరువుకాటకాలు మొదలయ్యాయని ఆ గ్రామస్థులు భావిస్తారు. అది మూఢ నమ్మకమని చెప్పినా వినరు. దద్దానాల గ్రామం నుండి పొలిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి ఆ పనికి సుంకన్నను పంపుతారు. ఈ ప్రయత్నంలో ఏం జరిగిందో రచయిత కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు రాయలసీమ మాండలికంలో ఉద్విగ్నభరితంగా రచించారు. ఇక కథలోకి వెళదాం. ఒరేయ్య! సుంకన్నా! ప్యాటకు పొయి గొడ్లకు తౌడు చెనిక్కాయచెక్క త్యాపోరాబ్బి! పచ్చిమ్యాత యాడా చేలల్లో ల్యాకపోయె. ఆటి మోగాన అయన్నా బేచ్చే ఇన్ని పాలిచ్చాయి. ఈకరువు కాలంలో అయ్యే మనకు ఆదరువు. బెర్రీన (తొందరగా) పోయిరాపో నాయిన! ఇంగో మాట. ఆ జమడక్కు పిల్లోడు మార్కట్టులో కనపడ్తే ఇత్తనాల లెక్కడుగు. పోయినేడు వానలు పడ్తే చేలల్లో ఇత్తు కుందామని ఇత్తనం గింజలు తెచ్చుకొంటిమి. వానలు పడకపోయె. ఇత్తనాలు మిగిలిపోయె. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/TFJRIh_NyXI
Embed this episode
NOW PLAYING
పొలిమేర పార్ట్ 1 | Polimera Part 1 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.