పొలిమేర పార్ట్ 2 | Polimera Part 2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 4, 2023 · 19 MIN

పొలిమేర పార్ట్ 2 | Polimera Part 2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Polimera Part 2/2' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah 'పొలిమేర పార్ట్ 2/2' తెలుగు కథ రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: దద్దానాల గ్రామం వాళ్ళు తమ ఊరి పొలిని తీసుకెళ్లి నందువల్లనే తమ ఊర్లో వర్షాలు పడటం లేదని అనిమెల గ్రామ ప్రజలు భావిస్తారు. జాతర సమయంలో దద్దినాలనుండి పొలిని తీసుకుని రావాలని నిర్ణయించుకుంటారు. అందుకు సమర్దుడిగా సుంకన్నను ఎంచుకుంటారు. ఇక పొలిమేర పెద్ద కథ పార్ట్ 2 చదవండి. దద్దనాల్లో ఊరి నడింగల పెద్దేప్మాను కాడ ఊరి పెద్దలు పెద్దాడ్డి తిక్కాడ్డి బస్సిరెడ్డి చెల్లంనాయుడు తిమ్మానాయుడు కాటంరాయుడు మంచల్రాయుడు పెంటయ్య పెద్దబొట్లాచారి నామాలయ్య పోతురాజు అప్పల్రాజు సన్నన్న బుల్లెన్న సంటెన్న పాలన్న సాలన్న తలుపులన్న కొమర్రావు చిన్నారావు కన్నయ్య నల్లప్ప జాలప్ప ఆవులయ్య ఎద్దులప్పతో పాటు వూరి జనం గుమిగూడినారు. బస్సిరెడ్డి ముందుగాల లేచి "అందరికి దండాలు. మనూర్లో ద్యావర జరిగి మూడేండ్లైతాంది. మూడేండ్ల కొకతూరి పెద్దమ్మ ద్యావర జరపడం ఆనవాయితీ. అమ్మోరి దయవొల్లా కరువుకాటకాలు ల్యాకుండా రోగంరోట్టా రాకుండా పైరు పచ్చలతో పిల్లాజల్లా చల్లంగా వుండాం. అందుగ్గాను ఈతూరి అమ్మోరి ద్యావర అందరూ కల్సికట్టుగా నిల్బడి వైబోగంగా సేచ్చాం. గాబట్టి ఎవరి వంతు వాళ్ళు పన్సేసి అమ్మోరికి ఏ కొతుకు రాకుండా జరపాల. యేదన్న వాటం (విధానం) దప్పుతే పెద్దమ్మతల్లి మాంతమైన దేవత. అన్ని ఇసయాల్లో మెల్కువగా వుండాల. అన్నీసరే! అనిమెలోళ్ళు అమ్మోరి పొలి ఎత్తక పోవడానికి రావచ్చు. ఒగిసోలంతా జాగిరిగా ఉండాల. వాళ్ళ పొలి మనం ఎత్తకొచ్చినాంచి కరవుకాటకాల్తో అలమటిచ్చి అల్లాడి పోతాండరు. వాళ్ళు పొలి తీస్కక పోవడానికి తప్పక వొచ్చారు. ఓగన్నేసి వుండాల." అన్సేప్పి కుచ్చున్యాడు బస్సిరెడ్డి. తిమ్మానాయుడు ఉషారుగా లేసి "ద్యావర గొప్పగా జరగాలంటే తీరువ ఈతూరి బారీగ ఏస్కోవాల! అన్నీ సరుకులు పిర్రమై పోయినై. తీరవలు రాబట్టే పని చెల్లంనాయుడికి ఒప్పగిచ్చాం. అమ్మోరికి పసుపు కుంకుమ గందోడి సాంబ్రాణి నిమ్మకాయలు టెంకాయలు నైద్యానికి సరుకులు అమ్మోరికి కొత్తగుడ్డలు అవుట్లు టపాకాయలు తెచ్చే బాద్యత కొమ్మర్రావుది. అమ్మోరి బొమ్మ సేసే బాద్యత కన్నయ్యది. గుడి కట్టిచ్చే వంతు పెదబొట్లాచారికి. అమ్మోరి కత చెప్పే ఆసాదోళ్ళును తప్పెటోళ్ళను మెళాలోళ్ళను తుడుమోళ్ళను కొమ్మోళ్ళను దండోరోళ్ళను పురమాయించే పని అప్పల్రాజుకు. ఎక్కువ తక్కువలు బుల్లెన్న సూసుకుంటాడు. ఒగ్యాల అనిమెలోళ్ళు పొలెత్తక పోనీకి వొచ్చే కన్పెట్టడానికి కాటంరాయుడు పోతురాజోళ్ళు ఉంటారు." అన్నీ పూసగుచ్చినట్టు సెప్పి కూకున్యాడు తిమ్మానాయుడు. ఆ ఎనక మంచాల్రాయుడు "అద్సరే! ద్యావర దున్నపోతు మూడేండ్లుగా చేలల్లోబడి ఎట్టిగా తిని ఆంబోతులా బోబల్చినాది. దాన్ని పట్టడానికీ ఎవని వొల్లాగాదు. అమ్మోరి ముందర దాన్ని నరికే మొగోడెవడో ముందది దేల్సండ్రి." అని గురుతు సేసినాడు. నల్లప్ప నిల్బడి "ఇంగెవరూ మన పాలన్న సాలన్నలే. ఓ ఇరబైమందిని ఎంటేస్కొనిబోయి ద్యావర దున్నపోతును పట్టకొచ్చారు. అమ్మోరికి వోళ్ళే బలిచ్చారు." అనే నల్లప్ప. జనమంతా "ఔనౌను, వోళ్ళైతేనే సరిగ్గా సరిపోతారు" చప్పట్లుగొట్టి జైకొట్టి బలపర్చినారు జనం. అదే జనం మద్దినున్న యామయ్య పైకి లేచి " మీ ఎర్రికాకపోతే అమ్మోరికి ఆకలేమిట్రా! మీ అమాయకత్వం కూలా! పచ్చి సీయలు తినడానికి ఆమేమన్నా జంతువా? ఎందుకు ఈ జీవ హింస. ఇది మూడత్వంతో చేసే చేష్ట" అని అరిచి చెప్పినాడు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటలు గాల్లో కల్సిపోయినాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/n-__1ukvZnE

Episode metadata supplied by the publisher feed · Published Jul 4, 2023

Embed this episode

NOW PLAYING

పొలిమేర పార్ట్ 2 | Polimera Part 2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com

0:00 19:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!