ప్రాయ‌శ్చిత్తం | Prayaschittham | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 7, 2023 · 13 MIN

ప్రాయ‌శ్చిత్తం | Prayaschittham | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రాయ‌శ్చిత్తం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు బి. ఏ ఫ‌లితాలు వ‌చ్చేరోజు... శార్వ‌రికి ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర్నుంచీ టెన్షన్ గా ఉంది.. 3 సంవ‌త్స‌రాల క‌ష్టం యొక్క ఫ‌లితం తేలేరోజు.. చ‌దువుకుంటున్న‌ప్పుడు ఎక‌నామిక్స్ లెక్చ‌ర‌ర్ గారు ‘మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ‌తారు. మూడు గంట‌ల్లో ప‌రీక్ష వ్రాస్తారు. కానీ  మూడు నిమిషాల్లో ఫ‌లితం తెలిసిపోతుంది’ అన్న మాట‌లు ఆ స‌మ‌యంలో గుర్తుకు వ‌చ్చి నవ్వుకుంది... నిజ‌మే.. ఇప్పుడు మూడు నిముషాల స‌మ‌యం వ‌చ్చేసింది. నిన్న‌టిదాకా ఆమెకు త‌న ఫ‌లితం మీద బాగా న‌మ్మ‌కం ఉండేది. కానీ ఈ రోజు ఎందుకో ఫ‌లితాలొస్తాయి అన‌గానే భ‌యం క‌లుగుతోంది; ముఖ్యంగా ఈ టెన్ష‌న్‌కి కార‌ణం లెక్చర‌ర్స్‌, స్నేహితులు ఆమె మీద పెట్టుకున్న న‌మ్మ‌కం.. వాళ్ళంతా శార్వ‌రికి యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ వస్తుంద‌నీ గొప్ప న‌మ్మ‌కం పెట్టుకున్నారు.... శార్వ‌రి భ‌య‌ప‌డుతున్నదందుకే.. ఒక వేళ వాళ్ళంతా భావిస్తున్న‌ట్లు యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ గానీ రాక‌పోతే వాళ్ళ‌ముందు త‌ను త‌లెత్తుకోగ‌ల‌దా?`` అని ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ద‌గ్గ‌ర్నుంచీ ఏం జ‌రుగుతుందోన‌నీ భ‌య‌ప‌డుతోంది... ఆమె కాఫీ తాగి కాసేపు పేప‌రు తిర‌గ‌వేసింది. ఆ త‌రువాత ఫ్రెష్ అయి 9 గంట‌ల‌కు యూనివ‌ర్శిటికి బ‌య‌లుదేరింది. ఆటోలో వెళుతుంటే ఆమెని ఆలోచ‌న‌లు చుట్టు ముట్ట‌సాగాయి. జీవితంలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించి త‌ను ఈ స్థితికి చేరుకుంది. తాను ఆరు చ‌దువుతున్న‌ప్పుడు తండ్రి శ్రీధర్ ఒక హ‌త్య కేసులో ఇరుక్కొని జైలు పాల‌వ‌డం, ఆ త‌రువాత త‌ల్లి సులోచ‌న బెంగ‌తో మంచం ప‌ట్టి చ‌నిపోవ‌డం, అప్పుడు  త‌న‌ని ఎవ‌రో అనాధాశ్ర‌మంలో చేర్పించ‌డం... అక్క‌డే ఉండి తాను ఇంట‌ర్‌లో రేంకుతో పేస‌వ‌డం, ఆ త‌రువాత స్కాల‌ర్‌షిప్పు మంజూర‌వ‌డంతో తాను హాస్ట‌ల్లో ఉండి డిగ్రీ  చ‌దువుకోవ‌డం అన్నీ గుర్తుకు రాసాగాయి... యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఆమె భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌సాగింది. ఆరునెల‌ల క్రితం పీజీ చ‌దువు కోసం లండన్  స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్‌కి ఎప్లె చేస్తే ప‌దిరోజుల కింద‌ట త‌న‌కు సీటు ఎలాట్ అయిన‌ట్లు ఆ యూనివ‌ర్శిటి నుంచి లెట‌ర్ వ‌చ్చింది. కాక‌పోతే సుమారు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టాలి.. మ‌రొక రెండు ల‌క్ష‌లు ఖర్చులు , పుస్త‌కాల‌కు అవ‌స‌రం అవుతాయి. ఇప్పుడామె ఆలోచ‌న‌ల‌న్నీఆ ఐదు ల‌క్ష‌ల చుట్టే తిరుగుతునాయి. ఒక‌వేళ ఆ డ‌బ్బు స‌మ‌కూర‌క‌పోతే లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్  లో చదువు కోవాలనే  తన కల  కల్ల అవుతుంది ; అప్పుడు ఇక్క‌డే పిజీ చెయ్యాలి; ఆమె ఆలోచ‌న‌లు ఐదులక్ష‌ల‌లు దాకానే వ‌చ్చి ఆగిపోతునాయి త‌ప్పా అవి ఎలా సంపాదించాల‌న్న విష‌యం వైపు వెళ్ళ‌టం లేదు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/41KUKv2Lqc4

Episode metadata supplied by the publisher feed · Published Jan 7, 2023

Embed this episode

NOW PLAYING

ప్రాయ‌శ్చిత్తం | Prayaschittham | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com

0:00 13:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 7, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!