EPISODE · Nov 26, 2022 · 18 MIN
ప్రభాత కిరణాలు | Prabhatha Kiranalu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రభాత కిరణాలు రచన : M R V సత్యనారాయణ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బ్యాంకు నుండి ఇంటికి వస్తున్న కిరణ్ కాలనీ మొగలో ఉన్న అమ్మవారి గుడి ముందు జనాన్ని చూసి బైక్ స్లో చేసి పక్కగా ఆగాడు. గుడి ముందు బుర్రకథ చెబుతున్నారు కళాకారులు. సత్య హరిశ్చంద్ర కథ చెబుతోంది మధ్యన ఉన్న అమ్మాయి. ముగ్గురూ రంగు రంగుల బట్టలు వేసుకున్నారు. కథ చెప్పే అమ్మాయి కంఠం బాగుండడంతో కాసేపు నిలబడి కథ విన్నాడు. ఒక పావుగంట ఉండి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం ఎనిమిది గంటలు అయ్యింది. రాఘవయ్య మాస్టారు భోజనం ముగించి భాగవతం చదువుకుంటున్నారు. కిరణ్ స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద భోజనం సిద్ధంచేసి ఉంచింది జానకమ్మ. “అబ్బాయ్! నువ్వు తింటూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను” అని వంటింట్లోకి వెళ్ళింది జానకమ్మ. రోజూ తన పక్కనే కూర్చుని కబుర్లు చెప్పే తల్లి ఇంకా, లోపల ఏం చేస్తోందా?అని ఆలోచిస్తూ భోజనం చేయసాగాడు కిరణ్. “అమ్మా, ఇంకా వంట చేస్తున్నావేమిటి?” ఆత్రం ఆపుకోలేక అడిగాడు తల్లిని. “ముగ్గురు భోజనానికి వస్తామన్నారు నాయినా, అందుకే మళ్ళీ వంట చేస్తున్నాను” వంటింట్లోంచే జవాబు చెప్పింది జానకమ్మ. రోజూ ఎనిమిది గంటలకు ఖచ్చితంగా భోజనం చేస్తాడు రాఘవయ్య. కొడుకు వచ్చాక అతనికి పెట్టి, ఆ తర్వాత తను తింటుంది జానకమ్మ. ‘అమ్మా, నువ్వూ నాన్నతో పాటే భోజనం చేసెయ్’ అని చాలా సార్లు చెప్పాడు తల్లికి. కానీ ఆవిడ ఒప్పుకోదు. భర్తా, కొడుకూ భోజనం చేసాకా మాత్రమే తను తింటుంది. వచ్చేది ఎవరా? అని ఆలోచిస్తూ భోజనం కానిచ్చాడు కిరణ్. అతను తిన్న ప్లేటు తీసి సింకు లో పడేసి టేబుల్ శుభ్రం చేసింది జానకమ్మ. తన గదిలోకి వెళ్లి టి. వి. తక్కువ సౌండ్ లో పెట్టుకుని న్యూస్ చానల్ చూస్తున్నాడు కిరణ్. కాసేపటికి తల్లీ తండ్రీ కబుర్లు చెప్పుకోవడం వినిపించింది కిరణ్ కి. ఒక గంట గడిచాక కాలింగ్ బెల్ మోగడం, తల్లి వెళ్ళి తలుపు తీయడం చూసి హాలు లోకి వచ్చాడు కిరణ్. తండ్రి లేచి నిలబడి ‘రండి.. రండి’ అంటూ ఆహ్వానించాడు. ముగ్గురు మనుషులు వచ్చారు. ఒక పెద్దాయన, ఒక యువకుడు, ఒక యువతి. ముగ్గురూ తల్లికీ, తండ్రికీ నమస్కరించారు. “మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం” అన్నాడు పెద్దాయన. “భలేవారే, ఇబ్బందేం లేదు. ఇప్పటికే పొద్దుపోయింది. కాళ్ళు కడుక్కుని రండి, భోజనం చేద్దురుగాని” అని బాత్ రూమ్ చూపించాడు రాఘవయ్య. ముగ్గురూ ఫ్రెష్ అయిరాగానే డైనింగ్ టేబుల్ మీద భోజనాలు వడ్డించింది జానకమ్మ. “ఆంటీ, నేను ఏమైనా సాయం చెయ్యనా” అడిగింది ఆ అమ్మాయి జానకమ్మని. ఏమీ అవసరం లేదు అన్నట్టు తలాడించింది జానకమ్మ. వాళ్లకు కొసరి కొసరి వడ్డిస్తోంది జానకమ్మ. హాలులో ఉన్న కిరణ్ కి వచ్చిన వాళ్ళు ఎవరో అర్ధం కావడం లేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ZVZTAz4yyTA
Embed this episode
NOW PLAYING
ప్రభాత కిరణాలు | Prabhatha Kiranalu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.