EPISODE · Nov 16, 2022 · 22 MIN
ప్రేమ‘భ్రమ’రం - 11 | Prema Bhramaram - 11 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 11 రచన: వసుంధర (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో... ముక్త నన్ను అర్జునుడికి గీతాబోధ చేసిన శ్రీకృష్ణుడితో పోలుస్తుంది. ముక్త ప్రేమించింది అమోఘ్ అని తెలుసుకొని ఆశ్చర్య పోయాను. అమోఘ్, రిక్తలు కలిసిఉన్న ఫోటో తీసి, తనకు చూపమంటుంది ముక్త. అమోఘ్ ఇంటికి వెళ్లి రిక్తను చూపమంటాను. ఇక ప్రేమ ‘భ్రమ’రం పదకొండవ భాగం వినండి ... రిక్త. నా ఎదురుగా ఉంది. భ్రమ కాదు. నిజంగా మనిషే! ఈ విషయం తెలిస్తే - ముక్త ఏమౌతుంది? ‘‘నమస్తే’’ అన్నాను. ఆమె బజ్జీ చేతిలోకి తీసుకుంది. నేను, అమోఘ్ ఆమె ననుసరించాం. ఆమెకి చాలా ఇష్టంలా ఉంది. వరుసగా నాలుగు బజ్జీలు తినేసింది. ఇస్సు ఉస్సనలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. నాకు మిర్చిబజ్జీ ఇష్టమే కానీ - కాస్త కారంగా ఉంటే చాలు - నోరు మండుతుంది. తట్టుకోలేను. ఆమెను చూసి ప్రభావితుణ్ణై - ఒక బజ్జీ కొరికాను. చుర్రుమంది - మరో బైట్ తీసుకోవాలంటే భయం పుట్టేలా - అమోఘ్ చెప్పినట్లు బజ్జీలో కొరివికారం కానీ కూరేరా? కానీ రిక్త ఏమిటి - అంత సుకుమారంగా కనబడుతున్న ఆడపిల్ల - బజ్జీల్ని కసకస నమిలేస్తోంది. నేను అసహాయంగా అమోఘ్ వంక చూశాను. ‘‘మేం కారం బాగా తింటాం. మీకు నప్పకపోతే - మొహమాటపడి తినద్దు’’ అన్నాడు అమోఘ్. ఆ మాట రిక్తను సమర్థించడానికి అన్నట్లుంది. ఎందుకంటే - తను కూడా మొదటి బజ్జీ సగమే తిన్నాడు. నా అవస్థ కనిపెట్టిన అమోఘ్ రూప వంక చూస్తే - ఆమె లోపలికెళ్లి - మరో గిన్నెడు బజ్జీలు తెచ్చింది. ‘‘భయపడద్దు. ఇవి అరటికాయ బజ్జీలు’’ అన్నాడు అమోఘ్. మేమిద్దరం వాటిమీద పడ్డాం... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HFj-5Cmc3nI
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 11 | Prema Bhramaram - 11 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.