EPISODE · Sep 16, 2022 · 27 MIN
ప్రేమ‘భ్రమ’రం - 2 | Prema Bhramaram - 2 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 2 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక రెండవ భాగం గత ఎపిసోడ్ లో... నా పేరు విచల్. నేను ఒక మందుల తయారీ కర్మాగారంలో మంచి పదవిలో ఉన్నాను. నా కజిన్ పేరు పద్మ. ఆమె తనకు బావ వరస అయిన కవన్ ని ప్రేమించింది. కానీ తను ముక్త అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతాడు కవన్. ముక్త మనసును కవన్ మీదనుండి మళ్ళించమని నన్ను కోరుతుంది పద్మ. ఆలా చేస్తే కవన్ తనను ప్రేమిస్తాడని ఆమె ఆశ. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను నేను. ఇక ప్రేమ‘భ్రమ’రం రెండవ భాగం చదవండి ... పద్మ నాకు అప్పగించిన బాధ్యత నా ఆలోచనల మూలాల్నే కదిలించింది. ఆడవాళ్లంటే నాకు బిడియమని గట్టిగా నమ్ముతాను. కానీ ఒక ఆడపిల్ల పద్మతో నాకు దగ్గర స్నేహమే ఉంది. ఎంత దగ్గరంటే - ఆమెకి నావద్ద తన ప్రేమకథను వినిపించేటంత చొరవుంది. బిడియమైతే ఆమెతో అంతసేపు ఎలా మాట్లాడతాను- అదీ ప్రేమ గురించి... అది చాలదన్నట్లు - నేను కూడా ఆమె దగ్గర చొరవ చేసి - నాకో ప్రియురాల్ని వెదికిపెట్టమన్నాను. నిజంగా నేను బిడియస్థుణ్ణేనా? నా మనసు నవ్వి, ‘‘ఈ సందేహం ఇప్పుడొచ్చిందా - ఎప్పుడో రావాలి కదా!’’ అంది. అన్నది నా మనసు కాబట్టి - ఆ మాట సరయు గురించేనని నాకు వెంటనే అర్థమైంది. సరయు మా పెదనాన్నగారమ్మాయి. అందంగా ఉంటుంది. నోరారా నన్ను అన్నయ్యా అని పిలుస్తుంది. తోడబుట్టినది కాకపోయినా - వయసొచ్చేక కూడా నాకు తను చెల్లి అనిపిస్తుందే తప్ప - ఏ ఫీలింగ్సూ కలుగవు. వరసల సంప్రదాయంలో అదో ఉదాత్త భావం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/l7SnYh9l32k
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 2 | Prema Bhramaram - 2 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.