EPISODE · Sep 22, 2022 · 36 MIN
ప్రేమ‘భ్రమ’రం - 3 | Prema Bhramaram - 3 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 3 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం మూడవ భాగం గత ఎపిసోడ్ లో... నా పేరు విచల్. మా పెదనాన్నగారమ్మాయి సరయు. పై చదువులకు అమెరికా వెళ్లాలనుకుంది సరయు. తాను అక్కడ ప్రేమలో పడకూడదన్న షరతు మీద పెదనాన్నని ఒప్పిస్తాను. కానీ నేను ప్రేమ వివాహం చేసుకుంటే తను కూడా అలానే చేస్తానంది సరయు. నా క్లాస్‌మేట్ కిషోర్ వాళ్ళ నాన్న రమణయ్య కాల్ చేసి, నన్ను రమ్మంటాడు. ట్రైన్ లో నాకు ఒక జంట పరిచయమవుతారు. ఇక ప్రేమ ‘భ్రమ’రం మూడవ భాగం చదవండి ... ‘‘భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానం ప్రేమ. ప్రియుడికీ ప్రేయసికీ అనుసంధానం ప్రేమ’’ ఈ మాట నాకు కిషోర్ చెప్పాడు. అది ఉపదేశం కాదు. నా ఉపదేశానికి సమాధానం. కిషోర్ నాకు కాలేజిలో క్లాస్‌మేటు. వేర్వేరు కంపెనీల్లోనే ఐనా ఒకే ఊళ్లో ఉద్యోగాలు చేస్తున్నాం. వాడు, స్వర అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరుపక్షాల పెద్దవాళ్లూ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ పెళ్లి జరిగితే రెండు కుటుంబాలూ వాళ్లని వెలేస్తాయి. అది తెలిసీ వాళ్లు పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ పెళ్లి జరక్కుండా ఆపాలని రెండు కుటుంబాలూ తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ఏ పుట్టలో ఏ పాముంటుందోనని తెలిసినవాళ్లందరికీ చెప్పి రాయబారాలు పంపుతున్నారు. అంతవరకూ ఇది మామూలు ప్రేమ కథ. రాయబారానికి కిషోర్ తండ్రి ఎంచుకున్నవారిలో నేను కూడా ఉండడంతో - ఈ ప్రేమకథలో నేనూ ఒక పాత్ర కావాల్సి వచ్చింది. ‘‘మావాడూ నువ్వూ మంచి మిత్రులు. వాడి చెడు గుణాల్లో ఒక్కటీ నీకు అలవడలేదు. నీ మంచి గుణాల్లో ఒక్కటీ వాడికి వంటబట్టలేదు’’ అని ముందు నన్ను పొగిడాడు కిషోర్ తండ్రి. నా గురించి ఆయనకి అంతగా తెలియదని తెలిసినా, పోనీ పొగిడాడులే అని సంబరపడ్డాను. ఐతే - ‘పొగడ్తల్లో ఎప్పుడూ ఓ క్యాచ్ ఉంటుంది సుమా’ అని మనసు హెచ్చరించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/DJgSAZC8Urs
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 3 | Prema Bhramaram - 3 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.