ప్రేమ‘భ్రమ’రం - 4 | Prema Bhramaram - 4 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 29, 2022 · 21 MIN

ప్రేమ‘భ్రమ’రం - 4 | Prema Bhramaram - 4 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 4 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో... రమణయ్య నాతో మాట్లాడుతూ తన కొడుకు కిషోర్, స్వర అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడని చెబుతాడు. వాళ్ళను వేరు చెయ్యమని కోరుతాడు. స్వర నాతో మాట్లాడుతూ  తను కిషోర్ ని ప్రేమించడం లేదనీ, తన బావ భవన్ ని ప్రేమిస్తున్నాననీ చెబుతుంది. కానీ భవన్, ముక్తను ఇష్టపడుతున్నాడని చెబుతుంది. ఇక  ప్రేమ  ‘భ్రమ’రం నాలుగవ భాగం చదవండి ... ‘‘ముక్త ఎవరు?’’ అన్నాను మొదటిసారిగా ఆ పేరు విన్నట్లు. ‘‘ఎవరంటే ఏం చెప్పను? సాటి ఆడపిల్లనయుండీ - ఆమె అసామాన్య సౌందర్యవతి అని చెప్పడానికి సంకోచించనని చెప్పనా?’’ అంది స్వర. ఫలానా హీరోయిన్‌ బాగుంటుందంటే - ‘నాకంటేనా?’ ఆని చిరాకు పడే చెల్లి గుర్తుకొచ్చింది. ఇప్పుడు కాదు - పదేళ్ల వయసప్పుడే అదలా అనేది. ‘‘ఆడవాళ్లంరా - ఎవరికి వాళ్లమే అందగత్తెలం. నాటి వైజయంతిమాల, హేమమాలిని, శ్రీదేవి అయినా - నేటి ఐశ్వర్య, రాకుల్‌, రశ్మిక అయినా - ఎవరైనా మా తర్వాతే అనుకుంటాం’’ అని అమ్మ కూడా చెల్లిని సమర్థిస్తూ మాట్లాడేది. ‘‘అంటే ఆ ముక్త పరిచయం - అందమొక్కటేనా?’’ అన్నాను - నేను అందానికి ప్రాధాన్యమివ్వనన్న దర్పాన్ని గొంతులో పలికిస్తూ. ‘‘అందమంటే అది మామూలు అందం కాదు. ఆ అందాన్ని వర్ణించడానికి ఆడపిల్లలు కూడా కలం పడతారు. కుంచె అందుకుంటారు. గాత్రాన్ని సవరిస్తారు’’ అంది స్వర. అర్థమయింది. భవన్‌ ముక్త అందానికి పడిపోయాడు. అందుకు స్వర అతణ్ణి తప్పు పట్టడం లేదు. అంత అందానికి ఏ మగాడు పడడూ - అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ సమర్థిస్తోంది. ‘‘మీరు ముక్తని చూశారా?’’ అన్నాను. ‘‘భవన్‌ ముక్తని చూసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నిజానికి నేనే ముందామెను చూసి, ‘ఎంత బాగుందో, చూడు’ అంటూ చూపించాను. అంతే! అంతకాలం నన్ను ప్రేమిస్తున్నాడనుకున్న భవన్‌కి - తొలిచూపులోనే ముక్తపై ప్రేమ పుట్టేసింది’’ అంది స్వర. పద్మ విషయంలోనూ ఇలాగే  జరిగింది. ఆమె చిన్నప్పట్నించీ ఇష్టపడ్డ కవన్‌ - ముక్తని చూసి ప్రేమలో పడ్డాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Z-Ry5_4zpfw

Episode metadata supplied by the publisher feed · Published Sep 29, 2022

Embed this episode

NOW PLAYING

ప్రేమ‘భ్రమ’రం - 4 | Prema Bhramaram - 4 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

0:00 21:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 21 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 29, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!