EPISODE · Oct 5, 2022 · 17 MIN
ప్రేమ‘భ్రమ’రం - 5 | Prema Bhramaram - 5 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 5 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం గత ఎపిసోడ్ లో... ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపమని నన్ను కోరుతుంది స్వర. ముక్త ఫోటో చూపిస్తుందామె. నిజంగానే ముక్త ఓ అపురూప దివ్య సుందరి. ఇక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం చదవండి ... నేనుంటున్న చోటుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న చెరువు పక్కన ఉందో పెద్ద రావిచెట్టు. దాన్ని బోధివృక్షం అంటాడు ఆఫీసులో నా కొలీగ్ శ్రీను. నేనైతే ఇక్కడికి ఉద్యోగంకోసం వచ్చాను కానీ, అతడిది చిన్నప్పట్నించీ ఇదే ఊరు. ప్రేమకథ కాదు కానీ, ఆడపిల్లతో జతపడ్డ ఓ తమాషా కథ అతడిది. హైస్కూల్లో చదివేటప్పుడు తన క్లాసు అమ్మాయి శరమ అంటే గొప్ప ఆకర్షణ ఉండేదిట. ఆ అమ్మాయి ఒకరోజున అతడు తన వంటిమీద చెయ్యేశాడని - టీచరుకి ఫిర్యాదు చేసింది. నిజానికి శ్రీనుకి ఏ పాపం తెలియదు. ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియదని టీచరుకి మరీమరీ చెప్పాడు. టీచరు నమ్మలేదు. ఫోన్ చేసి ఆ విషయం శ్రీను ఇంట్లో చెప్పేడు. తండ్రి శ్రీనుని చావగొట్టేసేడు. శ్రీనుకి ఉక్రోషమొచ్చింది. ఆ రాత్రి ఇంట్లోంచి పారిపోయి - ఆ చెరువు దగ్గరకెళ్లి రావిచెట్టుకింద కూర్చున్నాడు. శ్రీనుకి ఈత రాదు. ఆ చెరువులోపలికి వెళ్లి ములిగిపోదామని అనుకున్నాడు. చెరువులో అడుగెడుతుండగా ఎవరో వెనక్కి లాగేరు. చూస్తే ఓ ముసలాయన. లాక్కెళ్లి చెట్టుకింద కూర్చోబెట్టి తనూ పక్కన కూర్చున్నాడు. ‘‘ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చావ్?’’ అని ఆయన శ్రీనుని అడిగేడు. ‘‘ఈ సమయంలో మీరిక్కడికెందుకొచ్చారు?’’ అని శ్రీను ఆయన్ని ఎదురుప్రశ్న వేసేడు. ‘‘వారానికొకసారి, పాతాళలోకంనుంచి నాగకన్యలు ఇక్కడికొచ్చి స్నానం చేసి వెడుతుంటారు. నేను వాళ్లని చూడ్డానికి వస్తుంటాను’’ అన్నాడు ముసలాయన. శ్రీను నమ్మలేదు. ‘‘ఏరీ నాగకన్యలు?’’ అనడిగాడు. ‘‘నువ్వున్నావుగా - వాళ్లిప్పుడు పాముల్లా మారిపోయారు. ఎవరైనా చెరువులో అడుగెడితే - కరిచి చంపేస్తారు. అందుకే నిన్ను చూసి వెనక్కి లాక్కొచ్చాను’’ అన్నాడు ముసలాయన. శ్రీనుకి వళ్లు జలదరించింది. ‘‘మీకు కన్యల్లా కనబడ్డవాళ్లు నాకెందుకు అలా కనబడరు?’’ అన్నాడు. ‘‘ఈ ప్రశ్నకి జవాబు దొరకాలంటే - నీకు నా వయసు రావాలి’’ అని నవ్వాడు ముసలాయన. శ్రీనుకి కొంత అర్థమైంది. పైకి కాకుండా మనసులో నవ్వుకున్నాడు. ‘‘చావంటే నాకు భయం లేదు. ఓసారి చెరువులోకి వెళ్లాలనుంది’’ అన్నాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/zr3m2apyVfw
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 5 | Prema Bhramaram - 5 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.