EPISODE · Oct 12, 2022 · 19 MIN
ప్రేమ‘భ్రమ’రం - 6 | Prema Bhramaram - 6 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 6 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం గత ఎపిసోడ్ లో... రావి చెట్టు దగ్గర తన అనుభవాలు చెబుతాడు నా స్నేహితుడు శ్రీను. నేను కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాను. అక్కడ ఉన్న వ్యక్తి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు చెబుతాడు. ఇక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం చదవండి ... ‘‘మీరెవరో నాకు తెలియదు....’’ అన్నాను. ఆ విషయం అతడికి తెలియదనా - తన గురించి ఏమైనా చెప్పడానికి ఓ పలకరింపు, అంతే!. ‘‘కూర్చోండి’’ అన్నాడతడు నవ్వుతూనే. గొంతు మృదువుగా మనోహరంగా ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి గొంతు అలాగే ఉండేదేమో! కూర్చుందుకు అతడి అనుమతి అవసరం లేదు. కానీ అతడు చెప్పకపోతే, అలాగే నిలబడి ఉండిపోయేవాణ్ణేమో అనిపించింది. కూర్చున్నాను. ‘‘నా పేరు అమోఘ్’’ అన్నాడతడు. ‘‘నేను విచల్’’ అన్నాను. ‘‘మీరిక్కడికెందుకొచ్చారు?’’ ఆన్నాడతడు. నేనా ప్రశ్నకి బదులివ్వకుండా, ‘‘నేనిక్కడికొస్తానని మీకెలా తెలుసు?’’ అన్నాను. అతడు మళ్లీ నవ్వాడు, ‘‘నేనడిగిందానికి బదులిస్తే, జవాబు అందులోనే ఉండొచ్చు’’ అన్నాడు. తిరకాసుగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు కోపం రావడం లేదు. ‘‘నిజం చెబుతున్నాను. నేనెందుకొచ్చానో నాకు తెలియదు’’ అన్నాను. ‘‘అంటే నా సంకల్పబలమే మిమ్మల్నిక్కడికి రప్పించిందన్న మాట! ఐతే నేను చెప్పేది మీరు వినాలి’’ అన్నాడతడు. అప్పుడు నాకూ అనుమానమొచ్చింది. నేనొచ్చింది ప్రశాంతత కోసమా? లేక అతడి సంకల్పబలాన్ని అనుసరించా? అతడు నాకేదో చెప్పాలనుకుంటున్నట్లు నాకు అర్థమౌతోంది. ఏమో - అతడు చెప్పేది వినడంవల్ల నాకు ప్రశాంతత లభిస్తుందేమో! ‘‘చెప్పండి’’ అన్నాను. ‘‘నేనొక ప్రేమికుణ్ణి’’ అన్నాడతడు. అంటే - అతడు నాకు వినిపించబోయేది ప్రేమ కథ అన్న మాట! కొంపదీసి ఇతడు కూడా ముక్తను ప్రేమించడం లేదు కదా! ‘‘చెప్పండి. మీ కథ విని చేతనైతే సాయం చేస్తాను’’ అన్నాను. ‘‘సాయమంటే, ఎలాంటి సాయం?’’ చప్పున అడిగేడతడు. ‘‘సాధారణంగా ప్రేమకథల్లో అవసరపడే సాయమే! పెద్దల్ని ఒప్పించడమో, వాళ్లొప్పుకోకపోయినా మీ పెళ్లికి సాయపడ్డమో, మీ జంటకి ఆశ్రయంఇవ్వడమో - వగైరా వగైరా....’’ అన్నాను. ‘‘నా ప్రేమ ఆ కథలన్నీ దాటిపోయింది’’ అన్నాడు అమోఘ్. ‘‘అంటే?’’ అన్నాను. Read the full story on www.manatelugukathalu.com నేను రాస్తున్న వెబ్ సిరీస్ ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/tKPbCzi0_28
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 6 | Prema Bhramaram - 6 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.