EPISODE · Oct 19, 2022 · 25 MIN
ప్రేమ‘భ్రమ’రం - 7 | Prema Bhramaram - 7 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 7 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఏడవ భాగం గత ఎపిసోడ్ లో... రావి చెట్టు దగ్గర నాకు అమోఘ్ పరిచయం అవుతాడు. అమోఘ్, రిక్తలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించక పోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎవరికీ తెలియకూడదని రిక్త పురుష వేషంలో ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఇక ప్రేమ ‘భ్రమ’రం ఏడవ భాగం చదవండి ... ఐదింటికల్లా లేచిపోయాను. క్షణాలమీద తెమిలాను. డ్రెస్సు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఒకటికి రెండు సార్లు తల దువ్వాను. బైక్ తియ్యకుండా క్యాబ్ బుక్ చేశాను. చెప్పినకంటే ముందుగా పావు తక్కువ ఏడుకి అమోఘ్ ఇల్లు చేరి తలుపు తట్టాను. తలుపు తెరుచుకుంది. అమోఘ్ తీస్తాడనుకున్నాను. కానీ కళ్లముందు ఓ మెరుపు తీగ. కళ్లు జిగేల్మన్నాయి. ‘‘విచల్ గారా?’’ అందామె. కలస్వనం. చెవులని తాకిన శబ్దతరంగాలు - వంటిని జలదరింపజేశాయి. ఏదో అందామనుకున్నాను. నోట మాట రాలేదు. ‘‘కూర్చోండి - ఆయన స్నానం చేస్తున్నారు’’ అని లోపలకు వెళ్లిపోయిందామె. రిక్త. అపురూప సౌందర్యవతి. మీనాక్షి థియేటర్లో అమోఘ పక్కన చూసిన వ్యక్తి ఈమే అంటే చచ్చినా ఒప్పుకోను. వెళ్లి సోఫాలో కూర్చున్నాను. రిక్త రూపం నన్నింకా వెంటాడుతోంది. ఎంత బాగుంది! ‘ఈమధ్య- వయసులో ఉన్న ఆడపిల్లలు మరీ ఎక్కువ అందంగా కనిపిస్తున్నారు నీకు’ అంది మనసు. అది నిజమనుకోను. రోజూ ఎందరో అమ్మాయిల్ని చూస్తున్నాను. బాగుంటే ఒకటికి రెండుసార్లు చూస్తాను. తర్వాత మర్చిపోతాను. కానీ రిక్త సౌందర్యం ఎందుకో నన్ను వెంటాడుతోంది. ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడంవల్ల కలిగిన కుతూహలమేమో! ఆమోఘ్ వచ్చేసరికి ఏడు కావడానికింకా ఓ నిముషముంది. నన్ను చూస్తూనే, ‘‘నాకు టైమంటే టైమే కానీ - బిఫోర్ టైం వచ్చేవాళ్లు నాకెక్కువ నచ్చుతారు. థాంక్స్ ఫర్ ఆనరింగ్ మై ఇన్విటేషన్ అండ్ ఆనరింగ్ మీ విత్ యువర్ ప్రిజెన్స్’’ అన్నాడు. రొటీన్ మర్యాద. మాట మార్చడానికి, ‘‘నిన్న సినిమా ఎంజాయ్ చేశారా?’’ అన్నాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/bPTRGGJl8LM
Embed this episode
NOW PLAYING
ప్రేమ‘భ్రమ’రం - 7 | Prema Bhramaram - 7 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.