ప్రేమ‘భ్రమ’రం - 8 | Prema Bhramaram - 8 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 26, 2022 · 25 MIN

ప్రేమ‘భ్రమ’రం - 8 | Prema Bhramaram - 8 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 8 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో... ఉదయాన్నే అమోఘ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. ఒక అందమైన యువతి తలుపు తెరిచింది. ఆమే రిక్త అనుకున్నాను. కానీ ఈమె పేరు రూప అని తెలుస్తుంది. ముక్త అంగీకారంతో ఆమెను కలుస్తాను. ఇక  ప్రేమ  ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం చదవండి ... ‘‘మరి మీ ఆఫీసు....’’ అన్నాను ఏమనాలో తెలియక. ‘‘ఆఫీసుకి సెలవెట్టాను’’ ‘‘సెలవా - ఎందుకు?’’ అది ఆశ్చర్యమో మరేమిటో చెప్పలేను. ‘‘మీరొచ్చిన పని అలాంటిది మరి’’ మాటలో ఉన్న నిష్ఠూరం గొంతులో లేదు. ‘‘సారీ! నా కారణంగా మీరు మీ ఆఫీసుకి సెలవెట్టాల్సి ఉంటుందనుకోలేదు’’ నొచ్చుకున్నాను. ‘‘సారీ చెప్పకండి. ఆఫీసుకి సెలవెట్టడానికి నా కారణం నాకుంది’’ అందామె. ‘‘అంటే?’’ ‘‘మీరు కవన్‌, భవన్‌ల గురించి మాట్లాడ్డానికి నా దగ్గరికొచ్చారు. ఆ మాటలు ముందుకెళ్లేముందు నేను మీకు నా కథ చెప్పాలి’’ అంది ముక్త. ‘‘మీ కథ నాకు చెబుతారా? నిజంగా అవసరమా?’’ అన్నాను. చెత్త ప్రశ్న.... అవసరం లేకపోతే తీరికూర్చుని నాకెందుకు వినిపిస్తుంది? తను రచయిత కాదు. నేను సినిమావాణ్ణి కాదు. భవన్‌కీ, కవన్‌కీ, ఆమె కథకీ ఏదో లంకె ఉండుంటుంది. ‘‘అవసరమే - అందుకే ఆఫీసుకి సెలవెట్టాను. మీరు నాకు ఫోన్‌ చేసినప్పుడే - ఇలా కథ చెప్పాల్సుంటుందని తెలుసు. అందుకే మీకు ఫలహారం, భోజనం వగైరాలకి ఏర్పాట్లు చేశాను. ఇంకా.....’’ ఏం చెబుతుందోనని కుతూహలంగా చూస్తున్నాను. ‘‘మిమ్మల్ని సారీ చెప్పొద్దన్నాను. ఎందుకంటే కథ చెప్పడంలో నా ప్రయోజనం కూడా ఉంది’’ మళ్లీ గాజు తలుపులు తెరుచుకున్నాయి. ఇందాకటి వ్యక్తి లోపలికొచ్చాడు. బల్లమీద గ్లాసులు, ప్లేట్లు ట్రాలీకి మార్చేసాడు. ఇద్దరిముందూ చెరో మినరల్‌ వాటర్‌ బాటిలూ పెట్టాడు. ‘‘టిఫిన్‌ తినేటప్పుడు ఫిల్టర్‌ వాటర్‌. ఉత్తప్పుడు దాహమేస్తే మినరల్‌ వాటర్‌. జస్ట్‌ ఫర్‌ కన్వీనియన్స్‌. అంతే’’ నవ్విందామె. ట్రాలీ తోసుకుంటూ ఆ మనిషి వెళ్లిపోయాడు. ‘‘ఈ పద్ధతి బాగుంది. నేనూ ఫాలో ఔతాను’’ అన్నాను మర్యాదకి. ఆమె చిన్నగా నవ్వి, ‘‘విషయానికి వస్తాను. నా కథలో - నావాళ్లకి కూడా తెలియని రహస్యాలున్నాయి. అవి కూడా మీకు చెబుతాను...’’ అందామె... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7W4Ay34xNs0

Episode metadata supplied by the publisher feed · Published Oct 26, 2022

Embed this episode

NOW PLAYING

ప్రేమ‘భ్రమ’రం - 8 | Prema Bhramaram - 8 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com

0:00 25:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 25 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!