EPISODE · Jan 30, 2023 · 10 MIN
ప్రేమ చేజారితే 1 | Prema Chejarithe 1 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 1 రచన, కథా పఠనం: పెండేకంటి లావణ్య కుమారి పెండేకంటి లావణ్యకుమారి గారి ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) ధారావాహిక ప్రారంభం నమస్తే అండి! ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) అనే ధారావాహికను వ్రాసినది, చదువుతున్నది మీ లావణ్య కుమారి పెండేకంటి. సంగ్రహం: ప్రేమించిన వారికి ప్రేమ అందకుండా చేజారిపోతే, భవిష్యత్తు కాలంలోని వారయితే ఏం చేస్తారు అనే ఇతివృత్తంతో ఈ ధారావాహికను వ్రాసాను. ఇప్పుడైతే ప్రేమించిన వారు దక్కకపోయినా, తిరస్కరించినా కొందరు ఆత్మహత్యలు చేస్కుంటున్నారు, కొందరైతే ప్రేమను తిరస్కరించిన వారిని హత్యలు చేస్తున్నారు, ఇంకొందరైతే పిచ్చివాళ్ళై వాళ్ళనే తల్చుకుంటూ జీవిస్తున్నారు, మరికొందరు వారిని మర్చిపోయి వేరే వారిని పెళ్ళి చేస్కుని హాయిగా జీవిస్తున్నారు. అయితే పాతిక సంవత్సరాల తర్వాత కూడా మనుషులు ప్రేమించిన వారు దక్కకపోతే ఇలాగే వుంటారా? లేక వేరే ఏదైనా చేస్తారా? అనేదే ఈ సీరియల్లో మీరు చూడబోయేది. ఇలా జరుగవచ్చేమోనన్న ఆలోచనతో ఊహించి వ్రాసిన కథ అని గమనించగలరు. ఈ ధారావాహికంతా చూసాక ఇది ఆహ్వానించదగిన విషయమనిపిస్తే మీరూ దీని గురించి ఆలోచించండి, అలాకాక జరగకూడదనిపిస్తే దీన్నొక హెచ్చరికగా భావించి ఎవరూ అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడిక సీరియల్ మొదటి భాగం చదువుతున్నాను. ------- ప్రేమ చేజారితే (భవిష్యత్ కాలంలో) - భాగం - 1 అది 2040 సంవత్సరం... అదో విలాసవంతమైన బంగ్లాల సమూహముండే పెద్ద కాలనీ. దాని పేరు 'ఆనందలోకం', ఆ పేరు వ్రాసి వుంచిన బోర్డు మీద దాని పేరు క్రింద 'ప్రయత్నంతో సాధ్యమే' అనే కాప్షన్ కూడా వుంది. ఆ కాలనీ అంతా డబ్బుంటే ఎన్ని హంగులతో వుండొచ్చో అన్ని హంగులతో దర్జాగా, సుందరంగా వుండి అందరికీ కనువిందు చేస్తుంటుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yGZLN8M6xkc
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 1 | Prema Chejarithe 1 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.