ప్రేమ చేజారితే 10 | Prema Chejarithe 10 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 11, 2023 · 10 MIN

ప్రేమ చేజారితే 10 | Prema Chejarithe 10 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 10 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) నితిన్, కుమార్తో కలిసి కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తూ ఇలా మాట్లాడసాగాడు, " నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనే నిన్ను ఇక్కడికి పిలిచాను. అదేమంటే, ఇప్పుడు మీ ప్రాజెక్టులో మా ప్రమేయముండే అసలైన ఘట్టం మొదలయ్యింది, ఇంతకాలం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు నాకూ, నిధికి మాత్రమే తెలుసు. ఇప్పుడు కాలనీలో చాలా మంది పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చేంత పెద్దయ్యారు. ఇంక ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వుంటుంది. దానికి ఇంకొంత మంది సైకియాట్రిస్టుల ప్రమేయ, సహాయాలు అవసరపడ్తాయి. అందుకే ఈ రోజు నా దగ్గర చదువుకున్న మరియు నాకు అసిస్టెంట్లలా వుండటానికి ఒప్పుకున్న ఒక ఆరుగురు సైకియాట్రిస్టులకు ఈ ప్రాజెక్టు గురించి వివరించాలనీ, దానికి మీరు కూడా వుండి మాట్లాడితే బాగుంటుందనీ మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించాను. మీరు భయపడక్కరలేదు వీళ్ళందరూ అన్ని విషయాలను రహస్యంగానే వుంచుతారు, అది వారి నైతికబాధ్యతగా భావించి, అన్నీ గోప్యంగా వుంచే వారినే వడగట్టి ఎంచుకున్నాను. మీరు ఏమాత్రం సందేహపడక్కరలేదు," అన్నాడు నితిన్ కుమార్తో. దానికి కుమార్, "సరే అయితే, వీరికి పిల్లల గురించిన డీటైల్స్ అయితే ఇవ్వద్దు జనరల్గానే పిల్లలందరికీ కౌన్సెలింగ్ ఇమ్మని చెప్పండి. కుశాల్ ఎవరు, ఏమిటీ అనే విషయం అందరికీ తెలియటం నాకేమాత్రం ఇష్టం లేదు. దీనివల్ల అందరికీ మా కుటుంబంలో జరిగినవి తెలియడం వలన కుశాల్ మనసు బాధపడుతుందేమో అన్నదే నా ఆలోచన, కొంచెం పెద్దయ్యాక తన ఇష్టంతో బయటపడితే పర్వాలేదు. అందుకే సాధ్యమైనంత వరకూ నేను వారితో కుశాల్కు తండ్రిగా కాకుండా ఈ ప్రాజెక్ట్ ను స్థాపించిన వ్యక్తిగానే మాట్లాడ్తాను, తెలిసిప్పుడు తెలుస్తుంది. అయినా మనం బయటపడలేదంటే అది గోప్యంగా వుంచాలనుకుంటున్నామనేది కూడా వారికి అర్థమవుతుంది," అన్నాడు. " 'కుమార్ గారూ! మీరు వీరి గురించి అస్సలు సందేహపడవద్దు,' అంటూ చేతిలో చేయి వేసి భరోసా ఇస్తున్నట్టుగా సున్నితంగా నొక్కి చెప్పాడు... 'అంతేకాక, కుశాల్ కూడా నా కౌన్సెలింగ్తో చాలా పరిణితితో ఆలోచిస్తున్నాడు, ఈ విషయం తెలిసినా కూడా ఇంతకు ముందులా బాధపడడని నేను కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి ఆ రోజు జరిగిన ప్రమాదంలో కుశాల్కు షాలినిని అలా చూసి అర్థం కాని సందిగ్ధంలోనే మూర్చపోయాడనిపిస్తుంది. అంతేకాక కుశాల్ని హిప్నోథెరపీతో మర్చిపోయేలా చేసిన విషయాలు పదే, పదే అర్థం అయ్యీ కాని కలలుగా వస్తూ కుశాల్ను కలవరపరుస్తూ తలనొప్పిని కలిగిస్తున్నాయి. అందుకే ఇక కుశాల్కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ పూర్తి చేసే సమయం ఆసన్నమైంది,' " అని అన్నాడు నితిన్ ఎంతో దృఢంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/Jk4KTO44C_c

Episode metadata supplied by the publisher feed · Published Apr 11, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమ చేజారితే 10 | Prema Chejarithe 10 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 10:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!