EPISODE · Apr 15, 2023 · 14 MIN
ప్రేమ చేజారితే 11 | Prema Chejarithe 11 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే - ధారావాహిక పదకొండవ భాగం రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) 'ఇంతకీ కుమార్ వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్టు ఏదో తెలుసా?!?' అని అడిగాడు నితిన్. ఎవరూ, ఏమీ పలక లేదు... మళ్ళీ నితినే... మీకు ఆ ప్రాజెక్టు గురించిన అంచనా లేదనిపిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు యొక్క విశేషతను మీరు అర్థం చేస్కోవాలంటే ముందుగా మీకు ఒక నలుగురిని పరిచయం చేయాల్సి వుంది. వారిలో ఒకరు నా భార్య డాక్టర్ నిధి. ఆమె చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీలో ఎమ్. డి. చేసింది. ప్రస్తుతానికి స్వచ్చందంగా ఒక అనాథాశ్రమానికి తన సేవలు అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆవిడ కూడా పాలు పంచుకున్నారు. మిగిలిన వారిలో ఒకరు డాక్టర్ రాధ అని నిధి చూస్కునే అనాథాశ్రమంలోనే నిధికి అసిస్టెంటుగా సేవలందిస్తోంది. మిగిలిన ఇద్దరూ అక్కడ పిల్లలను చూస్కునే ఆయాలే, అయినా వారే వారికి అన్నీ కూడా. మిగిలిన విషయాలు డాక్టర్ నిధి వివరిస్తారు. ఇప్పుడే వారంతా వచ్చి పక్క గదిలో కూర్చున్నారు, వారిని పిలుస్తాను,' " అని చెప్పి నిధికి కాల్ చేసాడు నితిన్. ప్రక్క గది నుండి ఆ నలుగురూ వచ్చి "అందరికీ నమస్కారాలు తెలిపి వారి పేర్లను వారు చేస్తున్న వృత్తిని చెప్పుకుని, తమని తాము పరిచయం చేస్కున్నారు. తర్వాత నిధి మాట్లాడ్తూ, "విషయానికి వస్తే ముందుగా నేను ఈ ఇద్దరి గురించి మీకు చెప్పటానికే ఇక్కడికి వచ్చాను. వీళ్ళలో ఒకరి పేరు 'స్నేహ', ఇంకొకరి పేరు 'ప్రేమ్'. వీరిద్దరూ అనాథాశ్రమంలోని పిల్లలను చూస్కుంటుంటారు. స్నేహ నెలలు పిల్లలను చూస్కుంటుంది. ప్రేమ్ ఎనిమిదేళ్ళ లోపు పిల్లలను చూస్కుంటాడని వారిని చూపించింది నిధి. వీరు చిన్న పిల్లలను విసుక్కోకుండా, శ్రద్ధగా చూస్కుంటూ ఎనలేని సేవలు అందిస్తున్నారు. దానితో పిల్లలు మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా వుంటున్నారు. దానికి మనమంతా వీరికి కృతఙ్ఞులమే. వీరు పిల్లలను ఎలా చూస్కుంటున్నారో తెలుసుకోటానికి వీరిని మీరేమైనా ప్రశ్నలు అడగాలనుంటే అడిగి తెలుసుకోవచ్చు," అంది. తర్వాత ఒక జూనియర్ సైకియాట్రిస్టు లేచి స్నేహాను ఉద్దేశించి, "మీరు రాత్రి అనాథాశ్రమంలో పిల్లలతో పాటూ పడుకున్నాక, ఏ అర్థరాత్రో ఎవరైనా పసిబిడ్డ గుక్కపట్టుకుని ఏడిస్తే ఏం చేస్తారు?" అని అడిగాడు. దానికి స్నేహ, "మొదట ఆ పసిబిడ్డ పక్క బట్టలు కానీ చెడ్డీ కానీ తడిచి ఏడుస్తుందేమో చూస్తాను. అది కాకపోతే ఏదైనా కుట్టి ఏడుస్తుందేమోనని బిడ్డ శరీరాన్నంతా పరికించి చూస్తాను. అదీ కాకపోతే కడుపు చిన్నగా ఒత్తి అరగక ఏడుస్తుందేమో అనిపిస్తే, డైజెషన్ సిరప్ వేసి పదినిమిషాలలో ఏడుపు ఆపకపోతే డాక్టర్కు ఫోన్ చేస్తానని చెప్పింది. దానికి ఆ సైకియాట్రిస్టు, "గుడ్" అని చెప్పి కూర్చున్నాడు. తర్వాత ఇంకో జూనియర్ సైకియాట్రిస్టు లేచి ప్రేమ్ను ఉద్దేశించి, "నీవు చూస్కునే పిల్లల్లో ఓ నలుగురు ఒకే వస్తువు కోసం పోట్లాడ్తున్నారనుకో, వారి పోట్లాటను ఎలా ఆపుతావు," అని అడిగాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/9eOH3A62gNA
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 11 | Prema Chejarithe 11 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.