ప్రేమ చేజారితే 2 | Prema Chejarithe 2 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 6, 2023 · 19 MIN

ప్రేమ చేజారితే 2 | Prema Chejarithe 2 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 2 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో   షాలిని కుశాల్ను స్నానం చేయించటానికి తీస్కెళ్తూ వుంటుంది... ప్రేమ చేజారితే - 1  కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంక చదవండి...   బాత్రూమ్ దగ్గరకు రాగానే షాలిని అక్కడే వున్న వాటర్ ప్రూఫ్ సాక్స్ వేస్కుని, వాటర్ ప్రూఫ్ ఏప్రన్ కట్టుకుంది. తర్వాత కుశాల్ని బాత్రూమ్ లోనికి తీస్కెళ్ళబోతుంటే, వాడు, "రోజూ నీవెందుకవి వేస్కుంటావు, ఈ రోజు అవి నాకూ కావాలి,” అంటూ మారాం చేయసాగాడు.  "నీవు వేసుకున్నవే విప్పి స్నానం చేయించాలంటుంటే ఇప్పుడు ఇవేస్కుంటానంటావేంటి, నేను ఇవ్వను...ముందు పదా లోపలికి," అంది షాలిని.    "మరి నీవెందుకు వేస్కున్నావు?" అన్నాడు కుశాల్.    "స్నానం చేసినంత సేపూ నా మీదంతా నీళ్ళు వేస్తుంటావు కదా, నా బట్టలు తడవకుండా ఇవి వేస్కున్నానంతే. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తూ కూర్చుంటే స్కూలు కెళ్ళే టైము కాస్తా అయిపోతుంది త్వరగా పదా," అంటూ షాలిని కుశాల్ని బాత్రూమ్ లోకి లాక్కుపోయినట్టుగా తీస్కెళ్ళింది.   స్నానం చేయించినంత సేపూ కుశాల్ షాలినీని తన చిన్ని బుర్రలోకొచ్చే సందేహాలన్నీ అడుగుతూనే వున్నాడు. షాలిని ఏవో తనకు తెలిసినంత వాడికి విడమరచి చెప్తూనే స్నానం చేయించేసింది.   తర్వాత స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేసి, వాళ్ళ కాలనీలోనే, ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్కూల్లో వదిలి వచ్చింది.   వీళ్ళుండే ఈ కాలనీ గురించి తెలుసుకోవలసిన విశేషాలు చాలానే వున్నాయి. ఈ కాలనీ మామూలు కాలనీలలాగా కట్టినది కాదు. దీన్ని కట్టిన విధానాన్ని తెలుసుకోవాలంటే 2040కి కొన్ని ఏళ్ళ ముందు జరిగిన ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకోవలసి వుంది.    అవేమంటే...   అంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కాలంలోనే భారతదేశం ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలకు లోనై ఎంతో భూమిని కోతకు, ముంపుకు గురి చేసుకుంది...   అందులో బాగా చెప్పుకో తగ్గవి, 2028లో, 2033లో వచ్చిన పెద్ద, పెద్ద సునామీలైతే, మిగిలినవి ప్రతి సంవత్సరమూ దేశంలో   చాలా ప్రాంతాలలో వచ్చే వరదలు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/gi2QERvg7nE

Episode metadata supplied by the publisher feed · Published Feb 6, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమ చేజారితే 2 | Prema Chejarithe 2 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 19:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!