EPISODE · Feb 13, 2023 · 11 MIN
ప్రేమ చేజారితే 3 | Prema Chejarithe 3 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 3 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో కాలనీ గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. మిగిలిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక చదవండి... 'ఆనందలోకం' లాంటి కాలనీలలో తిరిగే వాళ్ళందరూ ఎక్కడికెళ్ళినా సైకిళ్ళలోనే వెళ్తుంటారు. కాలనీలో కేవలం సరుకుల రవాణాకూ, నడవలేని వారి కోసం మాత్రమే సోలార్ పవర్ కార్లను వాడుతుంటారు. కాలనీ వారంతా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ వాడుతూ, ఇప్పటికైనా పాడైన ప్రకృతిని తిరిగి బాగు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళకు వాళ్ళు ప్రమాణం చేస్కున్నారు. అలా ఆ ప్రమాణాలు పాటిస్తూ సమాజానికి మేలు కలిగే విధంగా వుండటమే ఆ కాలనీల గొప్పతనం. అందువల్లే కాలనీలు కట్టుకోటానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందటమే కాక మిగిలిన ప్రజలందరి మన్నన కూడా పొందాయి. కాలనీలు ఎంతో నిశ్శబ్దంగా ఉంటుండగా, కాలనీలు కాక బయటి మామూలు ఊర్లు మాత్రం యథావిధిగా ట్రాఫిక్, రణగొణధ్వనులు మరియు ఎప్పుడూ ప్రజల హడావిడితో ఎంతో చైతన్యవంతంగా వున్నా నిండా కాలుష్యంతో వుంటున్నాయి. ఇప్పుడిక కాలనీలలో కాక బయట ఊర్లలోని వారు ఎలా వుంటున్నారో తెలుసుకుందాము.... అదే రోజు ఉదయం ఆరుగంటల సమయం... 'ఆనందలోకం' కాలనీ బయట వున్న వూరిలో... చాలా మటుకు అందరి అపార్ట్మెంట్లలో ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు లేచి తయారవుతున్న హడావిడి మొదలయ్యింది. ఒక అపార్ట్మెంట్లో భర్తను లేపుతున్న భార్య, ఇంకో అపార్ట్మెంట్లో తొందర, తొందరగా వంట చేస్తూ స్కూల్కెళ్ళాల్సిన కూతురిని అక్కడినుండే పిలుస్తూ లేపుతున్న తల్లి, ఇంకో అపార్ట్మెంట్లో తల్లిని తను ఆ రోజు వేసుకోవాలనుకున్న డ్రెస్సుకు ఐరన్ గురించి వాకబు చేస్తున్న కాలేజీకెళ్ళే కూతురు... అక్కడక్కడా, ఆరోగ్యం మీద శ్రద్ధ వున్న కొందరు వాకింగ్ చేయటానికి వెళ్ళి తిరిగి వస్తున్న దృశ్యాలు. వంటిళ్ళలో పొద్దునకు, మద్యాహ్నానికి కావాల్సిన వంటలు చేయటంలో తల పక్కకు కూడా తిప్పను సమయం లేని తల్లులూ, పిల్లలను ప్రేమగా తయారుచేయలేకపోతున్నామనే బాధ వున్నా వారినే చేస్కునేలా తర్ఫీదివ్వటం వల్ల వాళ్ళే చేతనయ్యీ కాకుండా, మధ్య, మధ్యలో తల్లిని అడిగి చేస్కుంటున్న పిల్లలూ. ఇలా ఎవరికివారు తమ, తమ పనులను చేస్కుంటూ అదిలేదూ, ఇదిలేదూ, అది కావాలి, ఇది కావాలని తల్లులతో గొడవపడ్తూ బిజీగా వున్నారు. ఎంత హడావిడి వున్నా అదే వారి జీవితం, దాన్నే వారు ఇష్టపడతారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/uHISa6QDq4Y
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 3 | Prema Chejarithe 3 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.