EPISODE · Feb 20, 2023 · 9 MIN
ప్రేమ చేజారితే 4 | Prema Chejarithe 4 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 4 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో షాలినీని మెచ్చుకుంటూ రాఘవరావు షాలినితో మాట్లాడ్తుండగా మెట్లు దిగుతున్న శబ్దం వినిబడింది. ఇక చదవండి... మెట్లు దిగిన కుమార్, రాఘవరావు గదిలో కొచ్చి, "ఏంటి నాన్నా! ఏదో సంతోషంగా మాట్లాడ్తున్నారు, ఏంటి విషయం?" అని ఇద్దరినీ చూసి అడుగుతూ వచ్చి రాఘవరావు చెయ్యి పట్టుకుని ఆయన ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు. "ఏమీ లేదురా, పెళ్ళి వయసుదాటాక పెళ్ళి చేస్కున్నా కూడా నాకు బంగారం లాంటి కోడలిని తెచ్చావు. షాలిని ఏ పనైనా విసుగుపడకుండా సంతోషంగా చేస్తుందని మెచ్చుకుంటున్నానంతే. మీ అమ్మకు నీ ఉన్నతిని కానీ, కోడలినీ, మనవడిని కానీ చూసే అదృష్టం లేకుండా పోయిందిరా. అది ఉన్నన్ని రోజులూ మనం ఏదో తిండికీ, బట్టకు లోటు లేకుండా వున్నామే కానీ మీ అమ్మకు ఏనాడూ ఒక నగా, నట్రా చేయించేంత స్థోమతలో నేను లేకపోయాను. ఏమో అది అంత తొందరపడి నీ ఉన్నతిని చూడకుండానే ఈ లోకం నుండి వెళ్ళి పోయింది," అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాఘవరావు. "అవును నాన్నా, నాక్కూడా ఎప్పుడూ అదే లోటుగా అనిపిస్తుంది... పోనీలెండి, మిమ్మల్నైనా సంతోషపెట్టగలిగాను, నాకు ఆ ఆనందమన్నా మిగిలింది," అంటూ మనసులో షాలిని అసలు మీ కోడలే కాదని తెలిస్తే మీకు ఈ ఆనందం కూడా కలిగేది కాదేమో, అయితే నేను చేసింది మీకు ఆనందాన్ని కలిగించే మంచి పనే అని నాకిప్పుడు చాలా తృప్తిగా వుందనుకున్నాడు కుమార్. తర్వాత షాలినికి, "డైనింగ్ టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టు," అని చెప్పి, రాఘవరావును పట్టుకుని చిన్నగా డైనింగ్ టేబుల్ దాకా నడిపించుకు తీస్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరగా కుర్చీలో కూర్చోబెట్టి ప్రక్కనే వున్న మరో కుర్చీలో తనూ కూర్చున్నాడు కుమార్. రాఘవరావుకు టిఫిన్ మంచం దగ్గరికే తెచ్చివ్వచ్చు, కాకపోతే అలా అతనిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీస్కెళ్ళి తన చేతులతో పెట్టటమనేది ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అలా చేస్తుంటాడు కుమార్. అమ్మెలాగూ లేదు, వున్న నాన్నను ఆనందంగా చూస్కోవాలనేదే కుమార్ కోరిక. ఇంతలో షాలిని వేడి, వేడి ఉప్మా తీస్కొచ్చి టేబుల్ పైనున్న ఇద్దరి ప్లేట్లలో పెట్టింది. రాఘవరావు వణుకుతున్న చేతులతో తినటం కష్టమవుతుందని షాలిని తనే రాఘవరావుకు స్పూన్తో పెట్టబోతే, కుమార్ నేను తింటూ పెడ్తానని చెప్పి, షాలినిని నీవు కూడా తినమని చెప్పబోయి ఆపుకున్నాడు కుమార్. షాలిని వారితో, " మీకు పండ్లరసం చేసి తీస్కొస్తాను," అని చెప్పి లోనికెళ్ళింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/skT8rgfm65A
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 4 | Prema Chejarithe 4 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.