ప్రేమ చేజారితే 5 | Prema Chejarithe 5 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 27, 2023 · 10 MIN

ప్రేమ చేజారితే 5 | Prema Chejarithe 5 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 5 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) షాలిని, ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు తమ ప్రాజెక్టు కోసం కొన్ని నెలలు కంప్యూటర్ కోర్సు చేయటానికని అక్కడ చేరారు. ఈ విషయాలు కుమార్ అడిగి తెలుసుకున్నాడనుకున్నారా?  కానే కాదు. కోర్సులో చేరిన మొదటిరోజు క్లాసులో లెక్షరర్ అందరి పరిచయాలు అడగగా, ఎవరికి వారు తమ గురించి తాము చెప్పినప్పుడు  తెలిసిన విషయాలు. కొన్ని విషయాలు కుమార్ కూడా తెలుసు కున్నాడు లెండి ప్రతిరోజూ షాలినిని గమనిస్తూ...   షాలిని రోజూ క్లాస్కి తెల్ల కైనటిక్ హోండాలో వచ్చేది. చూడ్డానికి బాగా డబ్బున్న అమ్మాయనిపించేది. అయినా కూడా నెమ్మదిగా, అణకువగా తన పనేదో తాను చేసుకుపోతూ వుండేది. ప్రక్కనున్న తనలాంటి అందమైన ఇద్దరమ్మాయిలలా కోతివేషాలు వేసేది కాదు, అందుకే స్పెషల్గా అనిపించేది కుమార్కు. క్లాసులో అడిగిన వాటికి సమాధానాలు చెప్పటమే కాక తనకు వచ్చే ఎన్నో సందేహాలను అడిగి మరీ నివృత్తి చేసుకునేది, వేరే ఎవరైనా తనని సందేహాలడిగితే తీర్చేది కూడా. అందుకే షాలిని మంచి తెలివైనదని కూడా అర్థమయ్యింది కుమార్కు. షాలిని కళ్ళు పెద్దగా చాలా అందంగా వుండేవి. అందుకే ఆ కళ్ళంటే కుమార్కి చాలా ఇష్టం.   అదే సమయంలోనే పెళ్ళి, పెళ్ళి సంబంధాలని రాఘవరావు అంటుండటంతో కుమార్ చేస్కుంటే షాలినిలాంటి అమ్మాయినే చేస్కోవాలని నిర్ణయించుకున్నాడు... తర్వాత, షాలినే ఎందుకు కాకూడదు అని కూడా అనుకున్నాడు. కానీ కుమార్ బుద్ది, కుమార్కు బుద్ధి చెప్పింది, అయినా  నీకేముందని ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పి తన తాహతును గుర్తు చేసింది. నిజానికి కుమార్ తనకున్న చిన్న ఉద్యోగం చూపి షాలినిలాంటి పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తే మాత్రం ఆమె అంగీకరిస్తుందా? పోనీ పోయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి చెప్పినా వాళ్ళు  అంగీకరిస్తారా?!   అలా కాక షాలిని కూడా కుమార్ని ప్రేమిస్తూ వుండి వుంటే ఒక రకంగా పని సులువయ్యేది. కానీ షాలిని ఇంతవరకూ కుమార్ వైపు చూడను కూడా లేదు. ఒకవేళ షాలినిని ఈ కోర్సయిపోయేలోపల తనను ఇష్టపడేలా చేస్కోగల్గితే, అప్పుడు ఆమెతో పెళ్ళి గురించి ఆలోచించే అవకాశం వుండొచ్చనుకున్నాడు కుమార్.   అంతే అప్పటి నుండి కుమార్కు షాలిని ఆలోచనలే...   షాలినిని ఎలా పరిచయం చేస్కోవాలి... ఎలా వుంటే షాలిని తనని ఇష్టపడుతుంది... ఏమి చేస్తే షాలిని తనని చూసి మాట్లాడ్తుంది... ఇవే ఆలోచనలు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oUqGffPe0UU

Episode metadata supplied by the publisher feed · Published Feb 27, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమ చేజారితే 5 | Prema Chejarithe 5 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 10:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 27, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!