EPISODE · Mar 6, 2023 · 9 MIN
ప్రేమ చేజారితే 6 | Prema Chejarithe 6 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 6 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో జరిగినది... కరోనా కారణంగా కుమార్ షాలినిని మళ్ళీ కలవలేకపోయాడు. అలా కుమార్ మూగ ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. ఇక చదవండి... అప్పట్లో ఆ కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. కరోనా కోరల్లో కుమార్ జీవితం కూడా ఎంతో నష్టపోయింది. కరోనా సమయంలో దురదృష్టమో, ఏమో వీరింట్లో కూడా అందరికీ కరోనా వచ్చింది. రాఘవరావు యాబైఅయిదేళ్ళవాడైనా, చిన్నతనం నుండి రోజూ చేసే యోగా, ధ్యానం వల్ల కరోనా ఆయనను ఏమీ చేయలేక పారిపోయింది. ఇంక కుమార్ కూడా తండ్రి లాగే యోగా, ధ్యానం చిన్నప్పటి నుండి చేసేవాడు, పైగా యువకుడు. అందుకే కుమార్ను కూడా కరోనా ఏమీ చేయలేక ఓడిపోయి తోకముడుచుకోవాల్సి వచ్చిందన్న కక్ష్యతో తన ప్రతాపమంతా కుమార్ వాళ్ళమ్మ సరస్వతమ్మ మీద తీర్చుకుని విజయం సాధించి ఇద్దరినీ ఇలా జయించానని ఆనందపడిపోయింది. సరస్వతమ్మ వయసు యాభైకి దగ్గరగా వుంది, అదీ కాక ఆమెకు ఆస్తమా వుంది... ఆమె కూడా పెళ్ళయినప్పటి నుండి ధ్యానం చేయటం వల్ల ఆస్తమా అదుపులోనే వుండేది. కానీ ఈ కరోనా వల్ల, ఆస్తమా తిరగబట్టి ఊపిరితిత్తులు బాగా పాడయిపోయాయి. అప్పటికింకా కరోనాకు వాక్సిన్ రాలేదు, అలాగే కరోనా వచ్చిన వారి శరీరంలో కలిగే ఇబ్బందులు కూడా ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అందువల్ల ఆమె ఊపిరితిత్తులు పాడైపోయేవరకు కనుక్కోలేక పోయారు. తెలుసుకున్నాక ఆమెను ఐ.సి.యు.లో వుంచి నలబై రోజులకు పైగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయటానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోయింది. ఆమె అనంతవాయువుల్లో కలిసి పోయింది. అలాగే కుమార్ ఇంతకాలం ఆదా చేసిన డబ్బు కూడా హారతికర్పూరంలా ఖర్చయిపోయింది. డాక్టర్లు ముందే చెప్పారు, గ్యారంటీ ఇవ్వలేమని, అది మీ సొంత నిర్ణయం, మీరు ఐ.సి.యు.లో వుంచి చూడమంటేనే మేము ఐ.సి.యు.లో వుంచి చూస్తామనీ, ఖర్చు కూడా చాలా అవుతుందని చెప్పారు. కుమార్ తన తల్లికంటే డబ్బు తనకేమీ ఎక్కువ కాదని వున్న దంతా ఖర్చు పెట్టటానికే సిద్ధపడ్డాడు. కరోనా చూస్తే ఒక కొత్త జబ్బు, డాక్టర్లు కూడా ఏ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోయారు. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. కుమార్ తన తల్లి బ్రతికే అవకాశం ఏమాత్రం వున్నా వదులుకోవాలను కోలేదు, అందుకే తన ప్రయత్నం తను చేసాడంతే. విధి వారిని చిన్న చూపు చూసిందనుకోవాలేమో. సరస్వతమ్మ మరణం తండ్రీ, కొడుకులనిరువురిని బాగా కృంగదీసింది. కానీ ముందుగా తేరుకున్నది రాఘవరావే. తేరుకుని కొడుకుకు ఎంతో ధైర్యాన్ని నూరిపోసాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pjb0YvyQO34
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 6 | Prema Chejarithe 6 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.